సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
కొబ్బరి పీచు, దాని ఉత్పత్తులకు సంబంధించి అన్ని కాలాల్లోకెల్లా అత్యధిక ఎగుమతులు సాధించిన భారత్
Posted On:
15 JUL 2020 3:25PM by PIB Hyderabad
కొబ్బరి పీచు దానికి సంబంధించిన ఉత్పత్తుల్లో 2019-20 సంవత్సరానికి గాను రూ.2,757.90 కోట్ల విలువైన రికార్డు స్థాయిలో ఎగుమతులను చేసింది భారత్. ఇది అంతకు ముందు సంవత్సరం రూ.2728.90 కోట్లు కన్నా రూ.30 కోట్లు ఎక్కువ. 2019-20 సంవత్సరంలో 9,88,996 మెట్రిక్ టన్నుల కాయిర్, కాయిర్ ఉత్పత్తులు దేశం నుండి ఎగుమతి అయ్యాయి, అంతకుముందు సంవత్సరంలో ఎగుమతి చేసినది 964046 మెట్రిక్ టన్నులు. కొబ్బరి పీచు దవ్వ, టఫ్టెడ్ మాట్స్, కాయిర్ జియో-టెక్స్‌టైల్స్, కాయిర్ రగ్గులు, తివాచీలు, కాయిర్ ఇతర రకాలు, కాయిర్ రోప్, పవర్-లూమ్ మాట్స్ ఎగుమతులు పరిమాణం, విలువ పరంగా వృద్ధిని నమోదు చేశాయి. చేతి-మగ్గం మాట్స్, కాయిర్ నూలు, రబ్బరైజ్డ్ కాయిర్, పవర్-లూమ్ మ్యాటింగ్ వంటి ఉత్పత్తులు పరిమాణం పరంగా క్షీణత, విలువ పరంగా పెరుగుదల చూపించాయి.
కాయిర్ పిత్ ఎగుమతి ఆదాయం రూ. 1349.63 కోట్లు, దేశం నుండి మొత్తం కాయిర్ ఉత్పత్తుల ఎగుమతిలో ఇది 49% ఉంది.
కాయిర్ ఫైబర్ రూ.493.43 కోట్లలో ఎగుమతి జరిగితే, ఇది మొత్తం ఎగుమతుల్లో 18% ఉంది.
విలువ జోడించిన వస్తువులు మొత్తం ఎగుమతుల్లో 33% ఉన్నాయి.
విలువ జోడించిన ఉత్పత్తులలో (విలువలో 20%) టఫ్టెడ్ మాట్స్ అగ్రస్థానంలో ఉన్నాయి.
కొబ్బరి పీచు దాని ఉత్పత్తుల ఎగుమతి ఎప్పుడూ తగ్గలేదు, కాయిర్ వ్యాపారం గురించి ఆ పారిశ్రామికవేత్త ఆందోళన చెందనవసరం లేదు.
కొబ్బరి పీచు, ఆ ఉత్పత్తుల దేశీయ మార్కెట్ కూడా పెరుగుతున్న ధోరణిని చూపిస్తోంది.
ఎగుమతులు భారతదేశంలోని అనేక ఓడరేవుల ద్వారా జరుగుతున్నాయి. వీటిలో 99% టుటికోరిన్, కొచ్చిన్, చెన్నై ఓడరేవుల ద్వారా కొబ్బరి పీచు ఉత్పత్తుల ఎగుమతులు జరుగుతాయి. ఉత్పత్తుల ఎగుమతికి ఇతర ప్రధాన ఓడరేవులు విశాఖపట్టణం, ముంబై, కోల్‌కతా మొదలైనవి. కన్నూర్, కోయంబత్తూర్, రిక్సువల్ నుండి రోడ్ల ద్వారా తక్కువ మొత్తంలో ఎగుమతులు జరిగాయి.
పోర్టుల వారీ ఎగుమతులు (2019-20) :
|
|
|
Sl. No.
|
Port/ Place of Export
|
Qty.
(MT)
|
Value
(Rs. Lakhs)
|
|
1
|
Tuticorin
|
519144
|
122910.39
|
|
2
|
Cochin
|
217930
|
107023.69
|
|
3
|
Chennai
|
238970
|
43159.93
|
|
4
|
Vishakapatanam
|
11578
|
1871.26
|
|
5
|
Mumbai
|
1145
|
596.15
|
|
6
|
Kolkata
|
113
|
131.89
|
|
7
|
Bangalore
|
41
|
58.19
|
|
8
|
Others (By Road)
|
75
|
38.63
|
|
|
Total
|
988996
|
275790.13
|
|
|
|
|
|
****
(Release ID: 1638863)
Visitor Counter : 212