మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
డిజిటల్ విద్యపై ప్రజ్ఞాత మార్గదర్శకాలను ఆన్ లైన్ ద్వారా విడుదల చేసిన - కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి.
డిజిటల్ / ఆన్ లైన్ విద్యపై రూపొందించిన ఈ మార్గదర్శకాలు ఆన్ లైన్ విద్యను మెరుగైన నాణ్యతతో ముందుకు తీసుకెళ్లడానికి రోడ్‌మ్యాప్ గా ఉపయోగపడతాయి : శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్'.
ఈ మార్గదర్శకాలు 1 నుండి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఒక రోజులో ఎంత సేపు, ఎన్ని ఆన్‌లైన్ సెషన్లు నిర్వహించాలి అనే దానిపై పరిమితిని నిర్దేశిస్తాయి.
Posted On:
14 JUL 2020 4:50PM by PIB Hyderabad
ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా డిజిటల్ విద్యపై ప్రజ్ఞాత (పి.ఆర్.ఏ.జి.వై.ఏ.టి.ఏ) మార్గదర్శకాలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' ఈ రోజు న్యూఢిల్లీ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మానవ వనరుల శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే కూడా ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ మాట్లాడుతూ, కోవిడ్ -19 మహమ్మారి పాఠశాలల మూసివేతకు దారితీసిందనీ, తద్వారా పాఠశాలల్లో తమ పేర్లు నమోదుచేసుకున్న దేశంలోని 240 మిలియన్ల మంది పిల్లలను ఇది ప్రభావితం చేసిందనీ, పేర్కొన్నారు. పాఠశాల మూసివేత కొనసాగుతూండడంతో విద్యార్థుల విద్యాభ్యాసం దెబ్బతింటోంది. మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడానికి, పాఠశాలలు పునర్నిర్మాణం చేపట్టి, బోధన మరియు అభ్యాసంలో ఇప్పటివరకు జరిగిన విధానాన్ని పునః పరిశీలించాల్సిన అవసరంతో పాటు, ఇంట్లో పాఠశాల విద్య మరియు పాఠశాలలో పాఠశాల విద్య యొక్క ఆరోగ్యకరమైన మిశ్రమం ద్వారా నాణ్యమైన విద్యను అందించే తగిన పద్ధతిని కూడా ప్రవేశపెట్టాలని, శ్రీ పోఖ్రియాల్ అభిప్రాయం పడ్డారు.
లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంట్లో ఉన్న విద్యార్థులకు ఆన్ లైన్ / డిజిటల్ / రెండు విధానాలను కలిపిన విద్యపై దృష్టి సారించి, అభ్యాసకుల మార్గదర్శకాలు అభివృద్ధి చేసినట్లు, కేంద్ర మంత్రి తెలియజేశారు. డిజిటల్ / ఆన్ లైన్ విద్యపై రూపొందించిన ఈ మార్గదర్శకాలు విద్య యొక్క నాణ్యతను పెంపొందించడానికీ, ఆన్ లైన్ విద్యను మెరుగైన నాణ్యతతో ముందుకు తీసుకెళ్లడానికి రోడ్‌మ్యాప్ గా ఉపయోగపడతాయని ఆయన వివరించారు. పాఠశాల అధిపతులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ అధ్యాపకులు మరియు విద్యార్థులతో సహా విభిన్నమైన భాగస్వాములకు ఈ మార్గదర్శకాలు సంబంధితంగా మరియు ఉపయోగకరంగా ఉంటాయని కేంద్ర మంత్రి ప్రత్యేకంగా పేర్కొన్నారు. డిజిటల్ పరికరాలతో ప్రాప్యత కలిగినవారితో పాటు పరిమిత లేదా అసలు ప్రాప్యత లేని వారు కూడా, ఎన్.సి.ఈ.ఆర్.టి. యొక్క ప్రత్యామ్నాయ అకాడెమిక్ క్యాలెండర్‌ను ఉపయోగించడంపై, ఈ మార్గదర్శకాలు ఒత్తిడి చేస్తాయి.
ప్రజ్ఞాత మార్గదర్శకాలలో ఆన్‌లైన్ / డిజిటల్ అభ్యాసానికి చెందిన, ప్లాన్-రివ్యూ-అరేంజ్-గైడ్-యాక్ (చర్చ)-కేటాయింపు-ట్రాక్-అభినందన అనే ఎనిమిది దశలు ఉన్నాయి. ఉదాహరణలతో దశలవారీగా డిజిటల్ విద్య యొక్క ప్రణాళిక మరియు అమలుకు ఈ దశలు మార్గనిర్దేశనం చేస్తాయి.
ఈ సందర్భంగా శ్రీ ధోత్రే మాట్లాడుతూ విద్యార్థుల భద్రత, విద్యా సంక్షేమం కోసం ప్రజ్ఞాత మార్గదర్శకాలను మానవ వనరుల మంత్రిత్వ శాఖ సిద్ధం చేసిందని చెప్పారు. మహమ్మారి సమయంలో ఆన్ లైన్ విద్య చాలా అవాంతరాలను పరిష్కరించిందనీ, అయితే విద్యార్థులకు అవగాహన కల్పించడానికి డిజిటల్ సాంకేతికతలను ఉపయోగిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలనీ, ఆయన సూచించారు. ఈ మార్గదర్శకాలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధిపతులు మరియు ఇతర భాగస్వాములకు ఆన్ లైన్ భద్రతా పద్ధతులను తెలుసుకోవడానికి సహాయపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సురక్షితమైన మరియు నిర్భయమైన డిజిటల్ అభ్యాస వాతావరణాన్ని అందించే ప్రజ్ఞాత మార్గదర్శకాలను రూపొందించడానికి మంత్రిత్వ శాఖ చేసిన కృషిని కూడా శ్రీ ధోత్రే ప్రశంసించారు.
ఈ క్రింది ప్రాంతాలపై నిర్వాహకులు, పాఠశాల అధిపతులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులకోసం రూపొందించిన సూచనలను ఈ మార్గదర్శకాలు వివరిస్తాయి:
* మదింపు / అంచనా అవసరం.
* వ్యవధి, స్క్రీన్ సమయం, సమగ్రత, సమతుల ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ కార్యకలాపాలు వంటి ఆన్ లైన్ మరియు డిజిటల్ విద్యను ప్లాన్ చేస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యలు.
* రిసోర్స్ క్యూరేషన్, స్థాయి వారీ డెలివరీ మొదలైన వాటితో సహా మధ్యవర్ధిత్వం యొక్క విధివిధానాలు.
* డిజిటల్ విద్య సమయంలో శారీరక, మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు.
* సైబర్ భద్రతను నిర్వహించడానికి జాగ్రత్తలు మరియు చర్యలతో సహా సైబర్ భద్రత మరియు నైతిక పద్ధతులు.
* వివిధ కార్యక్రమాలతో సహకారం మరియు భాగస్వామ్యం.
సిఫార్సు చేసిన స్క్రీన్ సమయం
తరగతి
|
సిఫార్సు
|
ప్రీ ప్రైమరీ
|
తల్లిదండ్రులతో సంభాషించడానికి మరియు వారికి మార్గనిర్దేశం చేయడానికి ఇచ్చిన రోజున, 30 నిమిషాల కంటే ఎక్కువ కాదు.
|
1 నుండి 12వ
తరగతి వరకు
|
ఎన్.సి.ఈ.ఆర్.టి. అకాడమిక్ క్యాలెండర్ ను అమలు చేయడం లేదా ఎన్.సి.ఈ.ఆర్.టి. యొక్క ప్రత్యామ్నాయ అకాడెమిక్ క్యాలెండర్ ను అమలుచేయడానికి చేసిన సిఫార్సు కోసం ఈ లింకు చూడండి. http://ncert.nic.in/aac.html
|
1 నుండి 8వ
తరగతి వరకు
|
ప్రాధమిక తరగతుల కోసం ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయించిన రోజులలో ఆన్ లైన్ సింక్రోనస్ లెర్నింగ్ 30 నుండి 45 నిమిషాల చొప్పున రెండు సెషన్లకు మించకూడదు.
|
9 నుండి 12వ
తరగతి వరకు
|
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయించిన రోజులలో 30 నుండి 45 నిమిషాల చొప్పున నాలుగు సెషన్లకు మించకుండా ఆన్ లైన్ సింక్రోనస్ లెర్నింగ్ చేపట్టవచ్చు.
|
పాఠశాల అధిపతులు మరియు ఉపాధ్యాయులు, సైబర్ భద్రత మరియు గోప్యతా చర్యలను నిర్ధారించేటప్పుడు తగిన అవసరాలను అంచనా వేయడం, ప్రణాళిక మరియు డిజిటల్ విద్యను అమలు చేయడానికి అవసరమైన వివిధ దశలను ఈ మార్గదర్శకాలు వివరిస్తాయి. ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు అందించాల్సిన సహాయాన్ని కూడా ఈ మార్గదర్శకాలు వివరిస్తాయి. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా వారు కంప్యూటర్ తెర ముందు కూర్చునే సమయాన్ని పరిగణలోకి తీసుకుని అందుకు అనుగుణంగా వారి ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ కార్యకలాపాలకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
ఇంట్లో పిల్లల కోసం సైబర్ భద్రతా చర్యలతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు యొక్క అవసరాన్ని అర్థం చేసుకోవడానికి ఈ మార్గదర్శకాలు తల్లిదండ్రులకు సహాయపడతాయి. డిజిటల్ పరికరాలను ఎక్కువ సేపు ఉపయోగించడం వల్ల పిల్లలు ఎక్కువగా అలసిపోకుండా లేదా ఒత్తిడికి గురికాకుండా లేదా ప్రతికూలంగా (భంగిమ లోపాలు, నేత్ర సమస్యలు, ఇతర శారీరక సమస్యలతో) దెబ్బతినకుండా ఉండటానికి సంబంధిత వ్యక్తులందరూ, శారీరిక ఆరోగ్యం, మానసిక క్షేమం కోసం ఎలా నడుచుకోవాలో, ఈ మార్గదర్శకాలలో సవివరంగా, తెలియజేయడం జరిగింది. సమర్థతా అధ్యయనం మరియు సైబర్ భద్రతకు సంబంధించి, ఏ పనులు చేయవచ్చు మరియు ఏ పనులు చేయకూడదు సవివరంగా, ఈ మార్గదర్శకాల్లో పొందుపరిచారు.
డిజిటల్ / ఆన్‌లైన్ / ఆన్-ఎయిర్ విద్యకు సంబంధించిన అన్ని ప్రయత్నాలను ఏకీకృతం చేయవలసిన అవసరాన్ని కూడా ఈ మార్గదర్శకాలు నొక్కిచెప్పాయి. దేశవ్యాప్తంగా పాఠశాలలకు వెళ్లే పిల్లలకు ఈ మార్గదర్శకాలు ప్రయోజనం చేకూరుస్తాయి. ఈ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా, దీక్ష, స్వయం ప్రభ, స్వయం మూక్స్, రేడియో వాహిని, శిక్ష వాణి, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రత్యేక బోధనాంశాలు, ఐ.టి.పి.ఏ.ఎల్. మొదలైనవి ఉన్నాయి. భారతదేశం వంటి దేశంలో బహుళ వైవిధ్యాలతో, డిజిటల్ విద్యా విధానాలకు మారడానికి వివిధ రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల స్థాయి సంస్థలు మరియు జాతీయ స్థాయి సంస్థలు కోవిడ్-19 అనంతర స్థితిని కొనసాగించే మార్పుతో కలిసి పనిచేయడం చాలా అవసరం.
మార్గదర్శకాల కోసం దయచేసి "లింక్" ను చూడండి:
https://mhrd.gov.in/sites/upload_files/mhrd/files/upload_document/pragyata-guidelines.pdf
*****
(Release ID: 1638649)
Visitor Counter : 945
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam