ప్రధాన మంత్రి కార్యాలయం

గూగల్ సిఇఒ శ్రీ సుందర్ పిచాయి తో సంభాషించిన ప్రధాన మంత్రి

విశ్వమారి కి వ్యతిరేకం గా భారతదేశం లో జరుగుతున్న యుద్ధం లో ప్రధాన మంత్రి యొక్క నాయకత్వాన్ని ప్రశంసించిన గూగల్ సిఇఒ

భారతదేశం లో గూగల్ యొక్క భారీ పెట్టుబడి ప్రణాళికల ను గురించి ప్రధాన మంత్రి కి వివరించిన గూగల్ సిఇఒ

సాంకేతిక విజ్ఞానం రైతుల కు గొప్ప ప్రయోజనాన్ని కల్పించింది; వ్యవసాయ రంగం లో ఎఐ కార్యక్షమత అమితం: ప్రధాన మంత్రి

ఆన్ లైన్ ఎడ్యుకేశన్ యొక్క పరిధి ని విస్తరించడం కోసం సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించడంపైన, ఇంకా మాతృ భాష లో సాంకేతిక విజ్ఞానం యొక్క అందుబాటు ను పెంచడం పైన చర్చించడం జరిగింది



Posted On: 13 JUL 2020 2:31PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గూగల్ సిఇఒ శ్రీ సుందర్ పిచాయి తో ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించారు. 
 
కోవిడ్-19 ని గురించి విశ్వసనీయమైన సమాచారాన్ని అందించడం కోసం మరియు కోవిడ్ పట్ల జాగృతి ని వ్యాప్తి చేయడం కోసం గూగల్ చేపట్టిన ప్రయత్నాల ను  ప్రధాన మంత్రి కి శ్రీ పిచాయి వివరించారు.  ప్రధాన మంత్రి తీసుకొన్న లాక్ డౌన్ అమలు వంటి బలమైన చర్య ప్రపంచవ్యాప్త వ్యాధి కి వ్యతిరేకం గా భారతదేశం సాగిస్తున్న యుద్ధం లో చాలా దృఢమైన పునాది ని వేసిందని ఆయన అన్నారు.  దుష్ప్రచారం తో తలపడడం లో, అవసరమైన ముందుజాగ్రత్తల విషయం లో సమాచారాన్ని చేరవేయడం లో గూగల్ అత్యంత సచేతనభరిత పాత్ర ను పోషించిందంటూ ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు.  ఆరోగ్య సంరక్షణ సేవల ను అందించడం లో సాంకేతిక విజ్ఞానం తాలూకు లాభాల ను ఇప్పటి కంటే మరింత ఎక్కువ గా వినియోగించుకోవడాన్ని గురించి కూడా ఆయన ప్రస్తావించారు. 

భారతీయులు సాంకేతిక విజ్ఞానాన్ని శర వేగం గా అనుసరిస్తున్నారని, సాంకేతిక విజ్ఞానానికి అనుగుణం గా వారిని వారు మలచుకొంటున్నారని ప్రధాన మంత్రి అన్నారు.  సాంకేతిక విజ్ఞానం నుండి రైతులు లాభపడుతుండడాన్ని గురించి, ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ద్వారా వ్యవసాయాని కి విస్తృత శ్రేణి ప్రయోజనాలు దక్కేందుకు ఉన్నటువంటి అవకాశాల ను గురించి ఆయన మాట్లాడారు.  రైతుల తో పాటు విద్యార్థులు కూడా ఉపయోగించుకోదగ్గ వర్చువల్ లేబ్స్ ఆలోచన ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు.  దేశం లో గూగల్ యొక్క నూతన ఉత్పత్తులను మరియు గూగల్ యొక్క నవీన కార్యక్రమాల ను  ప్రధాన మంత్రి దృష్టి కి శ్రీ సుందర్ పిచాయి తీసుకు వచ్చారు.  బెంగళూరు లో ఎఐ రిసర్చ్ లేబ్ ను ప్రారంభించడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.  అలాగే వరద సంబంధిత గూగల్ ముందస్తు అంచనా ప్రయాస ల తాలూకు ప్రయోజనాల ను గురించి కూడా శ్రీ పిచాయి వివరించారు. 

భారతదేశం లో ఒక భారీ పెట్టుబడి నిధి ని ప్రారంభించాలని, భారతదేశం లో వ్యూహాత్మకమైన భాగస్వామ్యాల ను అభివృద్ధిపరచాలని గూగల్ ప్రణాళికలు వేసుకొన్నట్లు ప్రధాన మంత్రి కి తెలియజేయడం జరిగింది.  ప్రపంచం లో అత్యంత బాహాటమైన ఆర్థిక వ్యవస్థల లో భారతదేశం ఒకటి గా ఉందని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.  వ్యవసాయం లో సంస్కరణలు తీసుకు రావడం కోసం ప్రభుత్వం ఇటీవల చేపట్టిన చర్యల ను గురించి, ఇంకా నూతన ఉద్యోగాల ను  సృష్టించడం కోసం చేపట్టిన ప్రచార ఉద్యమాన్ని గురించి కూడా ఆయన మాట్లాడారు.  అలాగే, కార్మికుల కు నవీన నైపుణ్యాల ను సంతరించడానికి ప్రాముఖ్యం ఇవ్వవలసిన అంశాన్ని గురించి సైతం ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు.  

డేటా సెక్యూరిటీ అంశాన్ని గురించి, ఇంకా గుప్తత తో పరమైన ఆందోళనల ను గురించి ప్రధాన మంత్రి చర్చించారు.  విశ్వసనీయత లో లోపం తాలూకు అంతరాన్ని భర్తీ చేయడానికి సాంకేతిక విజ్ఞాన రంగ కంపెనీ లు కృషి చేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.  సైబర్ క్రైమ్స్ ను గురించి, ఇంకా సైబర్ అటాక్స్ రూపం లో ఎదురవుతున్న బెదరింపుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు.  చర్చల క్రమం లో ఆన్ లైన్ ఎడ్యుకేశన్ యొక్క పరిధి ని విస్తరించడం కోసం సాంకేతిక విజ్ఞాన సంబంధి పరిష్కారాల ను ఆవిష్కరించడం, సాంకేతిక విజ్ఞానాన్ని మాతృ భాష లో అందుబాటు లోకి తీసుకు రావడం, క్రీడల రంగం లో స్టేడియమ్ లో ఉండే తరహా మాదిరి వీక్షణ అనుభూతి ని ఇవ్వడం కోసం ఆగ్ మెంటెడ్ రియెల్ టి (ఎఆర్)/వర్చువల్ రియెల్ టి (విఆర్) యొక్క ఉపయోగం మరియు డిజిటల్ పేమెంట్స్ రంగం లో ప్రగతి తదితర అంశాలు కూడా చోటు చేసుకొన్నాయి. 

***



(Release ID: 1638345) Visitor Counter : 277