ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోలుకున్నవారి సంఖ్య దాదాపు 5 లక్షలు; ఇది చికిత్స పొందుతున్న వారి సంఖ్య కంటే 2.31 లక్షలు ఎక్కువగా ఉంది.
రికవరీ రేటు దాదాపు 63 శాతం.
Posted On:
11 JUL 2020 4:37PM by PIB Hyderabad
కోవిడ్-19 ని కట్టడి చేయడం, నిరోధించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరాయంగా అనేక అనుకూల-క్రియాశీల, ముందస్తు మరియు సమన్వయ చర్యలు తీసుకుంటున్నాయి. కంటైన్మెంటు జోన్లను కట్టుదిట్టంగా అమలుచేయడం, నిఘా కార్యకలాపాలు, సకాలంలో రోగ నిర్ధారణతో పాటు కోవిడ్-19 రోగులకు సమర్థవంతమైన వైద్య చికిత్సలు అందించడం వంటి చర్యల ఫలితంగా, చికిత్స పొందుతున్న కోవిడ్-19 రోగులలో మొత్తం కోలుకున్నవారి సంఖ్య ఈ రోజు 5 లక్షలు దాటింది. 5,15,385 మంది కోవిడ్-19 రోగులు ఇప్పటివరకు చికిత్స అనంతరం కోలుకుని, ఆసుపత్రుల నుండి డిశ్చార్జయ్యారు. దీంతో, కోలుకున్నవారి సంఖ్య, ప్రస్తుతం వివిధ ఆసుపత్రులలో కోవిడ్-19 చికిత్స పొందుతున్న వారి సంఖ్య కంటే 2,31,978 ఎక్కువగా ఉంది.
క్రమంగా పెరుగుతున్న ఈ అంతరంతో, రికవరీ రేటు మరింత మెరుగుపడి 62.78 శాతానికి చేరింది. గత 24 గంటల్లో, 19,870 మంది కోవిడ్-19 రోగులు చికిత్స అనంతరం కోలుకుని, డిశ్చార్జ్ అయ్యారు.
మొత్తం 2,83,407 క్రియాశీల కేసులు ఉన్నాయి. వీటిలో, తీవ్రమైన కేసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య పర్యవేక్షణలో చికిత్సను అందిస్తున్నారు. అదేవిధంగా, రోగానికి ముందు కనబడే లక్షణాలు ఉన్న వారికీ మరియు రోగ లక్షణాలు తక్కువగా ఉన్న వారికీ స్వచ్చంధ గృహ నిర్బంధంలో ఉంచి చికిత్సనందిస్తున్నారు.
కోవిడ్-19 నిర్ధారణ కోసం పరీక్షను సిఫారసు చేయడానికి, ఆర్.ఎమ్.పి.లు అందరినీ అనుమతించడం మరియు ఆర్.టి-పి.సి.ఆర్. తో పాటు రాపిడ్ యాంటిజెన్ పాయింట్ ఆఫ్ కేర్ టెస్టింగ్ ప్రవేశపెట్టడం వంటి విధానపరమైన మార్పులను ఇటీవల తీసుకోవడంతో, దేశంలో కోవిడ్ -19 పరీక్షల సంఖ్య గణనీయంగా పెరిగింది. దేశంలోని 1,180 ప్రయోగశాలలతో కూడిన ఐ.సి.ఎమ్.ఆర్. కు చెందిన వ్యాధి నిర్ధారణ నెట్ వర్క్ కింద సామూహిక ప్రభుత్వ, ప్రైవేట్ ప్రయోగశాలల ద్వారా, ఇంతవరకు, 1,13,07,002 నమూనాలను పరీక్షించారు. ప్రభుత్వ రంగంలో ప్రయోగశాల సంఖ్య 841 కి గణనీయంగా పెరగగా, ప్రయివేటు ప్రయోగశాలల సంఖ్య కూడా 339 కి పెరిగింది. నిన్న 2,82,511 నమూనాలను పరీక్షించడంతో, రోజువారీ పరీక్షల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. ఈ రోజు నాటికి దేశంలో మిలియన్ మందిలో పరీక్షలు చేసిన వారి సంఖ్య (టి.పి.ఎమ్) 8,193 కి చేరింది.
* రియల్-టైమ్ ఆర్.టి-పి.సి.ఆర్. ఆధారిత పరీక్షా ప్రయోగశాలలు : 620 (ప్రభుత్వ: 386 + ప్రయివేటు: 234)
* ట్రూ-నాట్ ఆధారిత పరీక్షా ప్రయోగశాలలు : 463 (ప్రభుత్వ : 420 + ప్రయివేటు : 43 )
* సి.బి-నాట్ ఆధారిత పరీక్షా ప్రయోగశాలలు : 97 (ప్రభుత్వ: 35 + ప్రయివేటు : 62)
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు, సలహాలు, సూచనలపై ప్రామాణికమైన, తాజా సమాచారం కోసం ఈ వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి :
https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA.
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా పొందవచ్చు :
technicalquery.covid19[at]gov[dot]in
ఇతర సందేహాలు, అనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా పొందవచ్చు :
ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva .
కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలు, సమస్యలు, సమాచారానికైనా, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ : +191-11-23978046 లేదా 1075 టోల్ ఫ్రీ ను సంప్రదించవచ్చు.
వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం ఈ వెబ్ సైట్ ని చూడండి :
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf
****
(Release ID: 1638028)
Visitor Counter : 237
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam