ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోలుకునే కరోనా రోగుల శాతం పెరిగింది. 62.42శాతానికి పెరిగిన రికవరీరేటు
18రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ సగటును మించిన రికవరీ రేటు
మరింత తగ్గి, 2.72శాతానికి చేరిన మరణాలరేటు
30రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మరణాల రేటు, జాతీయ సగటుకంటే తక్కువ
Posted On:
10 JUL 2020 2:53PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా కోలుకుంటున్న కోవిడ్-19 రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. గత 24గంటల్లో 19,138మంది రోగులు కోవిడ్ వైరస్ నుంచి కోలుకున్నారు. దీనితో కోవిడ్ వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య తాజాగా 4,95,515కి చేరింది. దీనితో దేశవ్యాప్తంగా కోలుకుంటున్నవారి శాతం 62.42కి చేరింది. ప్రస్తుతం 2,76,882 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారంతా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలసి కేంద్ర ప్రభుత్వం ముందుజాగ్రత్తగా దశలవారీగా, క్రియాశీలకంగా తీసుకున్న చర్యలతో దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు మెరుగుపడుతూ వస్తోంది. కరోనా కేసుల ఉనికిని సత్వరం తెలుసుకునేందుకు భారీ ఎత్తున పరీక్షలు చేపట్టడం, స్వల్పంగా వ్యాధిలక్షణాలు ఉన్న వారిని, లక్షణాలు ఇంకా బయటపడని వారిని ఇంటికే పరిమితం చేయడం, తీవ్రమైన కేసుల్లో ఆసుపత్రిలో వైద్యం ద్వారా తగిన చికిత్సను అందించడం వంటి చర్యలు రికవరీ రేటును పెంచడానికి దోహదపడ్డాయి. కేసులను కనుగొనేందుకు తీవ్రస్థాయిలో నిర్వహించిన టెస్టుల ప్రక్రియ,. సకాలంలో ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, తగిన చికిత్స అందించడానికి దోహదపడింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య క్రమం తప్పకుండా నిరాటంకంగా కొనసాగుతున్న సమన్వయం కూడా రికవరీ రేటు పెరగడానికి దోహదపడింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం కరోనా కేసులకే కేటాయించిన 1,218 కోవిడ్ ఆసుపత్రులు, 2,705కోవిడ్ ఆరోగ్య రక్షణా కేంద్రాలు, 10,301 కోవిడ్ చికిత్సా కేంద్రాలు దేశంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా రికవరీరేటు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో,.దాదాపు 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనానుంచి కోలుకుంటున్న రోగుల శాతం, జాతీయ సగటు రికవరీ రేటుకంటే ఎక్కువగా ఉంది.
ఆయా రాష్ట్రాల రికవరీరేటు వివరాలు
రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం
|
రికవరీ రేటు
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
రికవరీ రేటు
|
పశ్చిమబెంగాల్,
|
64.94%
|
మధ్యప్రదేశ్
|
74.85%
|
ఉత్తరప్రదేశ్
|
65.28%
|
హర్యానా
|
74.91%
|
ఒడిశా
|
66.13%
|
త్రిపుర
|
75.34%
|
మిజోరాం
|
67.51%
|
రాజస్థాన్
|
75.65%
|
జార్ఖండ్.
|
68.02%
|
ఢిల్లీ
|
76.81%
|
పంజాబ్
|
69.26%
|
చండీగఢ్
|
77.06%
|
బీహార్
|
70.40%
|
చత్తీస్ గఢ్
|
78.99%
|
గుజరాత్
|
70.72%
|
ఉత్తరాఖండ్
|
80.85%
|
హిమాచల్ ప్రదేశ్
|
74.21%
|
లఢక్ (యు.టి.)
|
86.73%
|
ఇక జాతీయ స్థాయిలో మరణాల రేటు 2.72శాతానికి తగ్గింది. ప్రపంచంలోని పలు దేశాల్లో నమోదయ్యే మరణాల రేటును పరిశీలించినపుడు మన దేశంలో జాతీయ స్థాయి మరణాల రేటు తక్కువగా ఉంది. మరణాల రేటు తక్కువ స్థాయిలో ఉండేలా చూడటమే లక్ష్యంగా కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యలు అమలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మద్దతు, మార్గదర్శకత్వంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనేక చర్యలు తీసుకున్నాయి. కోవిడ్ వైరస్ సోకేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్న వయోవృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించి వారికి వైద్యపరంగా ప్రత్యేక రక్షణ కల్పించడం వంటి చర్యలు తీసుకున్నాయి. కోవిడ్ రోగులకు అందించే చికిత్సలో నాణ్యతను పెంచే అంశంపై కూడా దృష్టిని కేంద్రీకరించారు. కోవిడ్ కేసులను కనుగొనడం, వారితో సంబంధాలు ఉన్నవారిని గుర్తించడం తదితర ప్రక్రకియల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు, ఎ.ఎన్.ఎం.ల వ్యవస్థ, ఆయుష్మాన్ భారత్-ఆరోగ్య సంక్షేమ కేంద్రాల సిబ్బంది ఎంతో కీలకపాత్ర వహించారు. లక్షలాది మంది వలస కూలీలను, సొంత ప్రాంతాలకు తిరిగివచ్చేవారిని గుర్తించడంలో కూడా వీరు ఎంతో ప్రముఖ పాత్ర పోషించారు. దీనితో దేశంలోని 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరణాల రేటు జాతీయ సగటు మరణాల రేటుకంటే తక్కువగా నమోదైంది.
తక్కువ మరణాల రేటు నమోదైన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు
రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం
|
మరణాల రేటు
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
మరణాల రేటు
|
మణిపూర్
|
0%
|
బీహార్
|
0.82%
|
నాగాలాండ్
|
0%
|
హిమాచల్ ప్రదేశ్
|
0.96%
|
దాద్రానాగర్ హవేలీ డామన్ డయ్యూ
|
0%
|
తెలంగాణ
|
0.82%
|
మిజోరాం
|
0%
|
ఆంధ్రప్రదేశ్
|
1.07%
|
అండమాన్ నికోబార్ దీవులు
|
0%
|
పుదుచ్చేరి
|
1.16%
|
సిక్కిం
|
0%
|
చండీగఢ్
|
1.34%
|
త్రిపుర
|
0.06%
|
తమిళనాడు
|
1.39%
|
లఢక్
|
0.09%
|
ఉత్తరాఖండ్
|
1.39%
|
అస్సాం
|
0.16%
|
హర్యానా
|
1.48%
|
కేరళ
|
0.41%
|
కర్ణాటక
|
1.56%
|
చత్తీస్ గఢ్
|
0.41%
|
జమ్ముకాశ్మీర్ (యు.టి.)
|
1.62%
|
గోవా
|
0.42%
|
మేఘాలయ
|
1.77%
|
ఒడిశా
|
0.46%
|
రాజస్థాన్
|
2.18%
|
అరుణాచల్ ప్రదేశ్
|
0.66%
|
పంజాబ్
|
2.56%
|
జార్ఖండ్
|
0.71%
|
ఉత్తరప్రదేశ్
|
2.66%
|
పరీక్షించడం, కేసును కనుక్కోవడం, చికిత్స అందించడం (టెస్ట్, ట్రాక్, ట్రీట్మెంట్) అనే వ్యూహంపై దృష్టిని కేంద్రీకరించడంతో కోవిడ్ వైరస్ బాధితులను గుర్తించడానికి 1,10,24,491 నమూనాలను పరీక్షించారు. రోజువారీగా జరిగే టెస్టుల సంఖ్యలో కూడా పెరుగుదల నమోదైంది. గత 24గంటల్లో 2,83,659 నమూనాలను పరీక్షించారు.
దేశంలో కరోనా పరీక్షలు నిర్వహించే లేబరేటరీలు మరింత బలోపేతమయ్యాయి. ప్రభుత్వ రంగంలోనే ఈ లేబరేటరీల సంఖ్య 835కు పెరిగింది. ప్రైవేటు రంగంలో ఈ లేబరేటరీల సంఖ్య 334కు చేరింది. దీనితో మొత్తం లేబరేటరీల సంఖ్య 1,169కి పెరిగింది.
వాటి వివరాలు:
• రియల్ టైమ్ ఆర్.టి.పి.సి.ఆర్. పరీక్షల లేబరేటరీలు:614 (ప్రభుత్వం ఆధ్వర్యంలో 382, ప్రైవేటులో 232)
• ట్రూనాట్ పరీక్షల లేబరేటరీలు: 458 (ప్రభుత్వం ఆధ్వర్యంలో 418, ప్రైవేటులో 40)
• సి.బి.నాట్ పరీక్షల లేబరేటరీలు: 97 (ప్రభుత్వం ఆధ్వర్యంలో 35, ప్రైవేటులో 62)
కోవిడ్-19కు సంబంధించి అన్ని రకాల అధీకృత సమాచారం, నవీకరించిన సమాచారం, మార్గదర్శక సూత్రాలు, సలహాల కోసం https://www.mohfw.gov.in/,.. @MoHFW_INDIA పోర్టల్స్.ను సంప్రదించవచ్చు.
కోవిడ్-19కు సంబంధించిన సాంకేతికపరమైన సందేహాలకు technicalquery.covid19[at]gov[dot]in పోర్టల్ ను సంప్రదించవచ్చు. ఇతర ఫిర్యాదులను ncov2019[at]gov[dot]in, @CovidIndiaSeva పోర్టల్స్ ద్వారా పరిష్కరించుకోవచ్చు.
కోవిడ్-19కు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదులనైనా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్ప్ లైన్ 11-23978046 లేదా 1075 అనే నంబర్లకు పంపించుకోవచ్చు. ఇవి రెండూ టోల్ ఫ్రీ నంబర్లు.
కోవిడ్-19కు సంబంధించి వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నంబర్ల జాబితా https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది.
***
(Release ID: 1637809)
Visitor Counter : 227
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam