నౌకారవాణా మంత్రిత్వ శాఖ
ప్రజా సంప్రదింపుల కోసం “ఎయిడ్స్ టు నావిగేషన్ బిల్ 2020” ముసాయిదా విడుదల చేసిన నౌకా రవాణా మంత్రిత్వ శాఖ 90 ఏళ్ల నాటి 'లైట్‌హౌస్ చట్టం-1927'ను మార్చడమే లక్ష్యం
Posted On:
10 JUL 2020 12:01PM by PIB Hyderabad
ప్రభుత్వ పరిపాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని, పారదర్శకతను పెంచాలన్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశానికి అనుగుణంగా, “ఎయిడ్స్ టు నావిగేషన్ బిల్ 2020” ముసాయిదాను కేంద్ర నౌకా రవాణా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. సంబంధింత వర్గాలు, సాధారణ ప్రజల నుంచి సూచనలు కోరింది.
ప్రపంచస్థాయి అత్యుత్తమ విధానాలు, సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి, 'సముద్రయానానికి సహాయాల రంగం'లో భారతదేశ అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చడానికి... దాదాపు తొమ్మిది దశాబ్దాల పాతదైన లైట్‌హౌస్ చట్టం-1927ను మార్చి కొత్త చట్టాన్ని తెచ్చేందుకు ఈ ముసాయిదా బిల్లును తీసుకొచ్చారు.
సముద్ర రంగానికి సంబంధించిన పురాతన వలస చట్టాలను మార్చి, ఆధునిక అవసరాలకు తగినట్లు కొత్త చట్టాలను తీసుకురావడానికి నౌకా రవాణా మంత్రిత్వ శాఖ అనుసరించిన చురుకైన విధానంలో ఈ ముసాయిదా బిల్లు ఒక భాగం అని
కేంద్ర నౌకా రవాణా శాఖ మంత్రి శ్రీ మన్సుక్ మాండవీయ (స్వతంత్ర బాధ్యత) చెప్పారు. ప్రజలు, సంబంధిత వర్గాల నుంచి వచ్చే సూచనలు చట్ట నిబంధనలను బలోపేతం చేస్తాయన్నారు. సముద్రయాన రంగ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నియంత్రించడమే బిల్లు లక్ష్యమని మాండవీయ వివరించారు.
వెసెల్ ట్రాఫిక్ సర్వీస్, శిక్షణ&ధృవీకరణ, అంతర్జాతీయ సమావేశాలకు సంబంధించిన ఇతర బాధ్యతల అమలు వంటి వాటి విషయంలో "డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లైట్‌హౌసెస్ అండ్ లైట్ షిప్స్" (డీజీఎల్ఎల్)కు అదనపు అధికారాలను, విధులను ఈ బిల్లు కల్పిస్తుంది. వారసత్వ లైట్‌హౌస్‌ల గుర్తింపునకు, అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది.
నేరాల కొత్త షెడ్యూల్; సముద్రయాన రంగానికి సహాయాలను అడ్డుకోవడంపై జరిమానాలు, కేంద్ర ప్రభుత్వం, ఇతర సంస్థలు జారీ చేసిన ఆదేశాలను పాటించకపోవడంపై జరిమానాలు ముసాయిదా బిల్లులో ఉన్నాయి.
సముద్రయాన రంగం ఆధునిక సాంకేతికతో మెరుగుపడడంతో, సముద్రయానాన్ని నియంత్రించే, నిర్వహించే అధికారుల పాత్ర మారిపోయింది. అందువల్లే, లైట్‌హౌస్‌ల నుంచి సముద్రయాన ఆధునిక సహాయాల మార్పులను కొత్త చట్టం కలిగివుంది.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ లైట్‌హౌసెస్ అండ్ లైట్‌షిప్స్ వెబ్‌సైట్ http://www.dgll.nic.in/Content/926_3_dgll.gov.in.aspx లో ముసాయిదా బిల్లును ఉంచారు. ఈ బిల్లుకు సంబంధించి, పౌరులు వారి సలహాలు, అభిప్రాయాలను atonbill2020[at]gmail[dot]com కు, ఈనెల 24వ తేదీలోగా పంపవచ్చు.
(Release ID: 1637757)
Visitor Counter : 254
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Malayalam