ప్రధాన మంత్రి కార్యాలయం
వారణాసి కి చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సంభాషించిన - ప్రధానమంత్రి
Posted On:
09 JUL 2020 1:42PM by PIB Hyderabad
కోవిడ్-19 సంక్షోభం కొనసాగుతున్న ప్రస్తుత సమయంలో సహాయ కార్యక్రమాలలో పాల్గొంటున్న వారణాసిలోని వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు.
కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ, ఆశతో, ఉత్సాహంతో జీవనం సాగిస్తున్న, పవిత్రమైన, ఆశీర్వదించబడిన వారణాసి నగర ప్రజలను ప్రధానమంత్రి ప్రశంసించారు.
సేవాభావంతో కూడిన ధైర్య, సాహసాలతో ప్రజలు నిరుపేదలకు ఎలా నిరంతరం సహాయం, మద్దతు ఇస్తున్నారనే దానిపై తనకు నిరంతరం సమాచారం అందుతోందని, శ్రీ మోడీ చెప్పారు. వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న వివిధ చర్యలు, వివిధ ఆసుపత్రుల పరిస్థితి, క్వారంటైన్ ఏర్పాట్లు, వలస కార్మికుల సంక్షేమానికి చేపట్టిన చర్యలపై సమాచారం అందుతున్నట్లు ఆయన చెప్పారు.
నగరాన్ని తల్లి అన్నపూర్ణమ్మ, బాబా విశ్వనాథ్ ఆశీర్వదిస్తున్నందున కాశీలో ఎవరూ ఆకలితో నిద్రపోరని పూర్వకాల విశ్వాసం ఒకటి ఉందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. పేదలకు సేవ చేసే మాధ్యమంగా భగవంతుడు ఈ సారి మనకు అవకాశం ఇవ్వడం మనందరికీ గొప్ప విశేషమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
పవిత్ర నగరంలో వివిధ మతపరమైన కార్యకలాపాలను నిలిపివేసినప్పటికీ, కరోనాకు వ్యతిరేకంగా వారు చేసిన పోరాటంలో వారు అద్వితీయులని వారణాసి ప్రజలు నిరూపించారని, పేదలు మరియు అవసరమైన వారికి నిరంతర ఆహారం మరియు వైద్య సరఫరాతో మద్దతు ఇస్తున్నారని ఆయన అన్నారు. వివిధ ప్రభుత్వ, స్థానిక పరిపాలనా సంస్థలతో కలిసి సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థల కృషిని ప్రధానమంత్రి ప్రశంసించారు.
అతి తక్కువ వ్యవధిలో ఆహార హెల్ప్ లైన్ లు మరియు కమ్యూనిటీ కిచెన్ ల యొక్క విస్తృతమైన నెట్ వర్క్ ను సృష్టించడం, హెల్ప్ లైన్ లను అభివృద్ధి చేయడం, సమాచార పరిజ్ఞానం యొక్క సహాయం తీసుకోవడం, వారణాసి స్మార్ట్ సిటీ యొక్క నియంత్రణ మరియు కమాండ్ సెంటర్‌ను పూర్తిగా ఉపయోగించుకోవడం వంటి చర్యలతో, ప్రతి స్థాయిలో పేదలకు చేయూత నందించడానికి, ప్రతి ఒక్కరికీ పూర్తి సామర్థ్యం ఉందన్న విషయం రుజువయ్యిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆహార పంపిణీ కోసం వాహనాల కొరత ఏర్పడినప్పుడు, జిల్లా యంత్రాంగానికి సహాయం చేయడానికి తపాలా శాఖ ఏ విధంగా ముందుకు వచ్చిందో ఆయన వివరించారు. భక్త కబీర్ దాస్ సూక్తి ని ఉటంకిస్తూ, "సేవ చేసేవాడు ఆ సేవ యొక్క ఫలాలను ఆశించాడు, పగలు, రాత్రి నిస్వార్థ సేవ చేస్తాడు!" అని శ్రీ మోడీ చెప్పారు.
అధిక జనాభాతో పాటు, అనేక ఇతర సవాళ్ల కారణంగా, మహమ్మారిపై పోరాడటానికి భారతదేశ సామర్థ్యాలను పలువురు నిపుణులు ప్రశ్నించారని, ప్రధానమంత్రి చెప్పారు. 23-24 కోట్ల జనాభా ఉన్న ఉత్తర ప్రదేశ్ పట్ల భయం వ్యాధి వ్యాప్తిని తగ్గించలేకపోతోందనీ, అయితే, రాష్ట్ర ప్రజల సహకారం, కృషి కారణంగా ఇది తొలగిందనీ, ఆయన వివరించారు. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు వ్యాధి వ్యాప్తి బాగా తగ్గడంతో పాటు, కరోనా వ్యాధి సోకినవారు కూడా వేగంగా కోలుకుంటున్నారని ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు వివిధ సౌకర్యాలు కల్పిస్తోందనీ, ఉచిత రేషన్ తో పాటు ఉచిత సిలిండర్లను కూడా సమకూరుస్తున్న ఈ పథకాల ద్వారా, సుమారు 80 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందబోతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
అమెరికా జనాభాకు రెట్టింపు జనాభా ఉన్న భారతదేశం ప్రజల నుండి ఒక్క పైసా కూడా తీసుకోకుండా వారికి సేవలందిస్తోందని ఆయన పేర్కొన్నారు. మరియు, ఇప్పుడు ఈ ప్రణాళికను నవంబర్ చివరి వరకు అంటే దీపావళి మరియు చాత్ పూజ వరకు కొనసాగిస్తోంది.
వారణాసిలోని వ్యాపారులు, వ్యాపారవేత్తలతో సహా, వివిధ హస్తకళాకారులు, ముఖ్యంగా చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ కష్టాలను తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. 8,000 కోట్ల రూపాయల విలువైన వివిధ మౌలిక సదుపాయాలు, ఇతర ప్రాజెక్టులను వేగంగా అమలు చేయనున్నట్లు ప్రధానమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.
****
(Release ID: 1637558)
Visitor Counter : 295
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam