జల శక్తి మంత్రిత్వ శాఖ
గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్ కింద ఫంక్షనల్ గృహ ట్యాప్ కనెక్షన్లను అందించడం ద్వారా స్వస్థలాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు జీవనోపాధి అవకాశాలు
Posted On:
05 JUL 2020 1:56PM by PIB Hyderabad
ప్రపంచం మొత్తం కరోనావైరస్‌తో పోరాడుతుండగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ భారీ సవాలును అవకాశంగా మార్చుకుంటోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు జీవనోపాధి కల్పించడం మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి ప్రణాళికలు రూపొందించడం ద్వారా అవకాశాలను సృష్టించుకుంటోంది. ఈ సందర్భంగా, 20.06.2020 తేదీన ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్ (జి.కే.ఆర్.ఏ) ను ప్రారంభించింది. జీవనోపాధి అవకాశాలను అందించడానికి వీలుగా విస్తృతమైన ప్రజా పనులను ప్రారంభించడం కోసం మరియు స్వస్థలాలకు తిరిగి వచ్చిన వలసదారులతో పాటు జీవనోపాధి కోల్పోయిన గ్రామీణ పౌరులకు స్థానికంగా ఉపాధి కల్పించడానికి, 20.06.2020 తేదీన ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్ (జి.కే.ఆర్.ఏ) ను ప్రారంభించింది. బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ వంటి 6 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 27 ఆశాజనక జిల్లాలతో సహా 116 జిల్లాల్లో 125 రోజుల నిర్ణీత కాలపరిమితితో ఈ కార్యక్రమం అమలులో ఉంటుంది.
ఈ పధకంలో భాగంగా, జల్ జీవన్ మిషన్ ప్రతి గ్రామీణ గృహాలకు గృహ ట్యాప్ కనెక్షన్లను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. తాగునీటి సరఫరా సంబంధిత పనులలో నైపుణ్యం, తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులతో పాటు తిరిగి వచ్చిన వలస కార్మికులను నిమగ్నం చేయడానికి ఇది ఒక భారీ అవకాశాన్ని కల్పించింది. ఈ జిల్లాలలోని అన్ని గ్రామాల్లో పనులు ప్రారంభించాలని రాష్ట్రాలను అభ్యర్థించారు. తద్వారా ఇది ప్రతి గ్రామీణ కుటుంబానికీ తగిన పరిమాణంలో నీటిని నిర్ధారించడంలో సహాయపడటంతో పాటు స్వస్ధలాలకు తిరిగి వచ్చినా వలస కూలీలకు తగిన ఉపాధి కల్పించడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం నీటి సరఫరా పథకాలు ఉన్న గ్రామాలకు ప్రాధాన్యమిచ్చి వాటిని పెంచడం లేదా తిరిగి అమర్చడం ద్వారా ఆ గ్రామాలను ‘హర్ ఘర్ జల్ గావ్’, అంటే 100 శాతం ఫంక్షనల్ గృహ ట్యాప్ కనెక్షన్ (ఎఫ్.హెచ్.టి.సి) గ్రామాలుగా రూపొందించాలని రాష్ట్రాలకు సూచించడం జరిగింది. ఇప్పటికే ఉన్న పైపుల ద్వారా నీటి సరఫరా చేసే వ్యవస్థలను రెట్రో-ఫిట్టింగ్ చేయడం ద్వారా పేద మరియు అట్టడుగు ప్రజలకు చెందిన గ్రామాల్లో మిగిలిన గృహాలకు ట్యాప్ కనెక్షన్ల ద్వారా నీటి సరఫరా చేసే భారీ అవకాశం ఉంది.
ఈ కార్యక్రమాన్ని నిర్ణీత సమయంలో పూర్తిచేయవలసి ఉన్నందున, నిర్దిష్ట పరిమాణంలో పని పూర్తికావలసి ఉన్నందున, ఈ పధకాన్ని విజయవంతంగా అమలుచేయడం కోసం ఒక లక్ష్య ప్రణాళికను రూపొందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి జి.కే.ఆర్.ఐ. గ్రామంలో నిర్ధారించిన ఎఫ్.హెచ్.టి.సి. ల సంఖ్యను తెలియజేయాలి. సంబంధిత నిధి వినియోగ ప్రణాళిక, గ్రామాలకు 100 శాతం ఎఫ్.హెచ్.టి.సి. కవరేజ్ ప్రణాళిక, నైపుణ్యం లేని, తక్కువగా నైపుణ్యం కలిగిన, నైపుణ్యం కలిగి స్వస్థలాలకు తిరిగి వచ్చిన వలస కూలీలతో పాటు గ్రామస్తులకు ఉపాధి అవకాశాలను కల్పించే బ్లాకులు, జిల్లాలు వంటి ప్రధాన ఉత్పాదనలు / కీలక పనితీరు సూచికలు (కే.పి.ఐ.లు) కు సంబంధించిన ఈ అంశాలపై పనిచేయాలని రాష్ట్రాలను అభ్యర్ధించడం జరిగింది. ప్లంబింగు, తాపీపని, ఎలక్ట్రికల్ అంశాలు, పంప్ ఆపరేషన్ మొదలైన వాటిలో స్వస్థలాలకు తిరిగి వచ్చిన వలసదారులతో సహా స్థానిక ప్రజలకు తగిన నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడానికి అవసరమైన కార్యక్రమాలను ప్రారంభించాలి. తద్వారా నీటి సరఫరా సంబంధిత పనులకు నైపుణ్యం కలిగిన మానవశక్తి లభిస్తుంది. వీటితో పాటు, గ్రామ కార్యాచరణ ప్రణాళికలు (వీ.ఏ.పీ.లు) పూర్తి చేయడం, గ్రామ పంచాయతీ / గ్రామ స్థాయి నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య కమిటీ / జల సమితి, ఐ.ఇ.సి కార్యకలాపాలు మొదలైన వాటి సామర్ధ్యాలను పెంపొందించడం జరుగుతుంది. ఈ పధకం కోసం, గుర్తించిన ‘ఆకాంక్ష జిల్లాలపై’ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.
గుర్తించబడిన ఈ రాష్ట్రాలతో జె.జె.ఎం. కింద పనుల కోసం మొదటి సమీక్షా సమావేశం జరిగింది. ఆశాజనక జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ‘అభియాన్’ అమలు చేయడానికి జిల్లాలు, గ్రామాల వారీగా 15 రోజుల కవరేజ్ ప్రణాళికను సిద్ధం చేయాలని వారికి సూచించారు.
గృహ ట్యాప్ కనెక్షన్లను అందించడం ద్వారా గ్రామీణ ప్రజల జీవితాలను మెరుగుపరచడంతో పాటు, ఈ ప్రతిష్టాత్మకమైన జల్ జీవన్ మిషన్ - గ్రామీణ ఉపాధిని కల్పిస్తుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.
*****
(Release ID: 1636655)
Visitor Counter : 325
Read this release in:
Urdu
,
Punjabi
,
English
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Odia
,
Tamil
,
Malayalam