ప్రధాన మంత్రి కార్యాలయం
ధర్మచక్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ ప్రసంగానికి తెలుగు అనువాదం
Posted On:
04 JUL 2020 10:43AM by PIB Hyderabad
గౌరవనీయ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ జి, ఇతర విశిష్ట అతిదులకు నమస్కారం. ఆషాఢపూర్ణిమ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. దీనినే గురుపూర్ణిమ అని కూడా అంటారు. మనకు జ్ఞానప్రదాతలైన గురువులను స్మరించుకునే పవిత్రమైన రోజు ఇది. ఈ స్ఫూర్తితోనే మనం బుద్ధ భగవానుడికి అంజలి ఘటిస్తాం.
మంజోలియన్ కంజూర్ కాపీలు మంగోలియా ప్రభుత్వానికి సమర్పించనున్నందుకు నాకు సంతోషంగా ఉంది. మంగోలియన్ కంజూర్‌ను మంగోలియాలో ఎంతగానో గౌరవిస్తారు. చాలా మొనాస్టరీలు దీని కాపీని కలిగి ఉన్నాయి.
మిత్రులారా, బుద్ధ భగవానుడి అష్టాంగ మార్గం ఎన్నో దేశాలు, సమాజాల శ్రేయస్సుకు మార్గం చూపింది.ఇది దయ, కరుణల ప్రాధాన్యతను నొక్కి చెబుతుంది. బుద్ధ భగవానుడి బొధనలు , ఆలోచనలోను ,ఆచరణలోను నిరాడంబరతను సూచిస్తాయి. బౌద్ధం ఇతరుల పట్ల చూపాల్సిన గౌరవాన్ని తెలియజేస్తుంది. ప్రజల పట్ల గౌరవం, పేదల పట్ల గౌరవం, మహిళల పట్ల గౌరవం, శాంతి, అహింసల పట్ల గౌరవాన్ని ఇది సూచిస్తుంది. అందువల్ల బౌద్ధం బోధనలు సుస్థిర విశ్వానికి సాధనాలు.
మిత్రులారా, సారనాథ్ లో బుద్ద భగవానునుడు చేసిన తొలి బొధనలోను, ఆ తర్వాత వారి బోధనలలోను వారు రెండు విషయాల గురించి మాట్లాడారు. అవి ఒకటి దృఢవిశ్వాసం, రెండు ప్రయోజనం. ఈరెండింటి మధ్య బలమైన బంధాన్ని ఆయన చూశారు. విశ్వాసం నుంచే ప్రయోజనానికి సంబంధించిన ప్రేరణ లభిస్తుంది. బుద్ధ భగవానుడి ఆకాంక్ష మానవుడి కష్టాలు తొలగించడం. మనం ప్రస్తుత సమయానికి తగినట్టు స్పందించాలి. అలాగే ప్రజలలో దృఢవిశ్వాసం పెంపొందించేందుకు కృషి చేయాలి.
మిత్రులారా, 21 వ శతాబ్దం గురించి నేను ఎంతో ఆశాజనకంగా ఉన్నాను. ఆ విశ్వాసం నాకు నా యువ మిత్రుల నుంచి , మన యువత నుంచి వస్తోంది. దృఢవిశ్వాసం, నూతన ఆవిష్కరణలు, కరుణ లు ప్రజల కష్టాలను ఎలా తొలగించగలవొ మీరు ఇందుకు సంబంధించిన ఉదాహరణలను చూడదలచినట్టయితే మన స్టార్టప్ రంగాన్ని చూడాలి. అద్బుతమైన ప్రతిభ గల మన యువత మెదళ్లలోని ఆలోచనలు ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను కనుగొంటున్నాయి. అతిపెద్ద స్టార్టప్ వాతావరణ కలిగిన దేశం మన ఇండియా.
బుద్ధుడి ఆలోచనలతో అనుసంధానమై ఉండాల్సిందిగా నేను మన యువ మిత్రులను కోరుతున్నాను. ఇవి మనకు ప్రేరణనిచ్చి ముందుకు వెళ్ళడానికి మార్గం చూపుతాయి. కొన్ని సమయాలలలో అవి మిమ్మల్ని శాంత పరుస్తాయి, మరికొన్ని సందర్భాలలో మిమ్మల్ని అభినందనలలో మంచెత్తుతాయి. బుద్ధిడి బోధనలైన अप्प: दीपो भव: అంటే, నీకు నీవే ఒక మార్గదర్శక దీపంగా వెలుగొందు అన్నది గొప్ప మేనేజ్ మెంట్ పాఠం.
మిత్రులారా, ఇవాళ ప్రపంచం అసాధారణమైన సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఈ సవాళ్లకు శాశ్వత పరిష్కారాలు బుద్ధ భగవానుడి బోధనల నుంచి రాగలవు. ఇవి గతంలో ఉపయోగపడ్డాయి, వర్తమానంలోనూ పనికివస్తున్నాయి, రేపటికీ ఇవి ఉపయుక్తమే.
మిత్రులారా,బౌద్ధ వారసత్వ స్థలాలతో ప్రజలు మరింత ఎక్కువ మంది అనుసంధానం కావలసి ఉంది. మన భారతదేశంలో ఇలాంటి ఎన్నో స్థలాలు ఉన్నాయి.సారనాథ్ కు నిలయంగా కూడా ప్రజలకు నా పార్లమెంటరీ నియోజకవర్గం వారణాశి తెలుసు. మనం బౌద్ధ ప్రముఖ స్థలాలను అనుసంధానం చేయడంపై దృష్టిపెట్టాలనుకున్నాం. కొద్దిరోజుల క్రితం భారత కేబినెట్ కుషినగర్ విమానాశ్రాయం, అంతర్జాతీయ విమానాశ్రయం కానున్నదని ప్రకటించింది. ఇంది ఎంతోమంతి ప్రజలను , యాత్రికులను, పర్యాటకులను తీసుకురానున్నది. ఇది ఎంతో మందికి ఆర్థిక అవకాశాలు కల్పించనుంది.
ఇండియా మీ కోసం వేచి ఉంది!
మిత్రులారా, మరోసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు. బుద్ధ భగవానుడి ఆలోచనలు మన జీవితాలలో మరింత ప్రకాశం, సమైక్యత, సోదరభావాన్ని తీసుకురాగలదని ఆకాంక్షిస్తున్నాను. మనం మంచి చేయడానికి బుద్ద భగవానుడి ఆశీస్సులు ప్రేరణనిచ్చుగాక.
ధన్యవాదాలు.
***
(Release ID: 1636575)
Visitor Counter : 249
Read this release in:
Gujarati
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Malayalam