రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

లెహ్‌ జనరల్‌ ఆస్పత్రిలో సౌకర్యాలపై భారత సైన్యం స్పష్టీకరణ

Posted On: 04 JUL 2020 1:47PM by PIB Hyderabad

గాల్వన్‌ ఘర్షణలో గాయపడి లెహ్‌ జనరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీర సైనికులను ప్రధాని మోదీ లద్ధాఖ్‌ పర్యటన సందర్భంగా పరామర్శించారు. ఆ సందర్భంగా విడుదల చేసిన ఫొటోలపై సామాజిక మాధ్యమాల్లో కొందరు విమర్శలు చేశారు. అది అసలు ఆసుపత్రేనా అంటూ ఆధారాలు లేని ఆరోపణలు చేశారు. పుకార్లు పుట్టించారు. వాటిని ఖండిస్తూ భారత సైన్యం ప్రకటన విడుదల చేసింది.

                సైనికులకు అందిస్తున్న చికిత్సపై వదంతులు పుట్టించడం దురదృష్టకరమని సైన్యం వ్యాఖ్యానించింది. సైనిక సిబ్బందికి సాధ్యమైనంత ఉత్తమ చికిత్సను అందుస్తున్నట్లు పేర్కొంది.

                సైనికులు చికిత్స పొందుతున్న హాల్‌ ఆసుపత్రిలోనిదేనని, 100 పడకల విస్తరణలో భాగమని తెలిపింది. కొవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం జనరల్ ఆసుపత్రి కొన్ని వార్డులను ఐసోలేషన్ సౌకర్యాలుగా మార్చారని; అందువల్ల, ఆడియో, వీడియో శిక్షణ హాలుగా ఉపయోగించే గదిని వార్డుగా మార్చారని, ఆసుపత్రిని కూడా కొవిడ్‌ చికిత్స ఆసుపత్రిగా మార్చారని వివరించింది.

                కొవిడ్ వార్డుల నుంచి దూరంగా ఉంచడానికి, గాల్వన్ నుంచి సైనికులు వచ్చినప్పటి నుంచి ఈ హాలులోనే చికిత్స అందిస్తున్నారని సైన్యం తన ప్రకటనలో వెల్లడించింది. ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణె, ఆర్మీ కమాండర్ కూడా అదే ప్రాంతంలో సైనికులను పరామర్శించారని తెలిపింది.

***(Release ID: 1636474) Visitor Counter : 242