ఆర్థిక మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                
                    
                    
                        జూన్ నెల స్థూల జీఎస్టీ ఆదాయం రూ.90,917 కోట్లు
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                01 JUL 2020 12:51PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                జూన్ నెలలో వసూలైన స్థూల వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఆదాయం రూ. 90,917 కోట్లుగా నిలిచింది. ఇందులో సీజీఎస్‌టీ రూ.18,980 కోట్లు గాను.. ఎస్‌జీఎస్‌టీ రూ.23,970 కోట్లుగాను.. ఐజీఎస్‌టీ రూ.40,302 కోట్లుగాను (వస్తువుల దిగుమతిపై సేకరించిన దాదాపు రూ .15,709 కోట్లతో సహా), సెస్ రూ .7,665 కోట్లుగా (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.607 కోట్లతో సహా) నిలిచింది. కాగా ప్రభుత్వం రూ.13,325 కోట్ల సీజీఎస్‌టీని ఐజీఎస్‌టీ నుంచి రూ.11,117 కోట్ల మేర ఎస్‌జీఎస్‌టీని సెటిల్ చేసింది. జూన్ నెలలో రెగ్యూలర్ సెటిల్మెంట్ తర్వాత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్జించిన మొత్తం ఆదాయం సీజీఎస్‌టీకి కింద రూ.32,305 కోట్లు గాను ఎస్‌జీఎస్‌టీకి దాదాపు రూ.35,087 కోట్లు గాను నిలిచింది. గత ఏడాది ఇదే నెలలో జీఎస్టీ ఆదాయంతో పోలిస్తే ఈ ఏడాది జూన్ ఆదాయం 91 శాతంగా ఉంది.
 ఈ నెలలో, వస్తువుల దిగుమతి ద్వారా వచ్చే ఆదాయాలు 71 శాతం మరియు దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయం (సేవల దిగుమతితో సహా) గత ఏడాది ఇదే నెలలో ఈ తరహా వనరుల ద్వారా వచ్చిన ఆదాయంలో 97 శాతంగా నిలిచాయి. జూన్ మసాపు జీఎస్టీ రిటర్నులను దాఖలునకు కేంద్రం కొంత ఉపశమనం కలిగించేలా అనుమతులనిచ్చింది. దీంతో మే మాసానికి సంబంధించిన రిటర్నులతో పాటుగా ఫిబ్రవరి, మార్చి,ఏప్రిల్ రిటర్నులు కూడా దాఖలు చేయబడినాయి.
మే 2020 యొక్క కొన్ని రిటర్న్‌లు జూన్ నెలలలో కూడా దాఖలు చేయబడ్డాయి. కొన్ని జూలై 2020 తొలినాళ్లలో దాఖలు చేయబడనున్నాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోవిడ్-19 కారణంగా ఆదాయాలు ప్రభావితమయ్యాయి. మొదట ఆర్థిక వ్యవస్థపై కోవిడ్- 19 మహమ్మారి వ్యాప్తి పెను ప్రభావం చూపింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో కేంద్రం పన్ను బకాయిలు, రిటర్న్‌ల దాఖలునకు గాను పలు మినహాయింపులు ఇవ్వడం వల్ల కూడా సర్కారు ఆదాయాలు కొంత వరకు ప్రభావితమయ్యాయి. అయినప్పటికీ గత మూడు నెలల గణాంకాలు చూస్తే జీఎస్టీ వసూళ్లు ఆదాయంలో కొంత రికవరీని కనబరిచింది. ఏప్రిల్ మాసపు జీఎస్టీ పన్ను వసూళ్లు రూ.32,294 కోట్లగా నిలిచాయి.
గత ఏడాది ఇదే నెలలో వచ్చిన జీఎస్టీ ఆదాయంలో ఇది 28 శాతం, మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 62,009 కోట్లుగా నమోదు అయ్యాయి. ఇది గత ఏడాది ఇదే నెలలో వసూలు చేసిన మొత్తం ఆదాయంలో ఇది దాదాపు 62 శాతానికి సమానం. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జీఎస్టీ వసూళ్లు గత ఏడాది ఇదే త్రైమాసికంలో వసూలు చేసిన ఆదాయంలో 59 శాతంగా నిలిచాయి. ఇంకా అధిక సంఖ్యలో జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు మే నెల రిటర్న్ దాఖలు చేయడానికి ఇంకా సమయం మిగిలి ఉంది.
- ప్రస్తుత సంవత్సరంలో నెలవారీగా స్థూల జీఎస్టీ పన్ను ఆదాయం పోకడలను ఈ చార్ట్ ప్రతిబింబిస్తుంది

-గతేడాది (2019) జూన్‌తో పోల్చితే ఈ ఏడాది జూన్ నెలలోనూ మరియు పూర్తి ఏడాదికి ఆయా రాష్ట్రాల వారీగా వసూలైన జీఎస్టీ గణాంకాలను ఈ కింది పట్టిక ప్రతిబింబిస్తుంది.
పట్టిక: ఈ ఏడాది ఏప్రిల్ మాసపు రాష్ట్రాల వారీగా జీఎస్టీ వసూళ్లు

 
 
[1] జీఎస్టీని జోడించని వస్తువుల దిగుమతి
 
*******
                
                
                
                
                
                (Release ID: 1635749)
                Visitor Counter : 396
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam