ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

59.43% చేరుకున్న కోవిడ్ నుంచి కోలుకున్నవారి శాతం



చికిత్సలో ఉన్నవారి కంటే లక్షా 20 వేలు అధికంగా కోలుకున్నవారు

Posted On: 01 JUL 2020 5:22PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు, సానుకూల చర్యలు తగిన ఫలితాలు ఇస్తున్నాయి. ప్రస్తుతం కోవిడ్ కు చికిత్స పొందుతున్నవారికంటే కోలుకున్నవారే 1,27,864 మంది ఎక్కువగా ఉన్నారు. దీంతో కోవిడ్ నుంచి కోలుకున్నవారి శాతం 59.43%. కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 13,157 మంది కోవిడ్ బాధితులు కోలుకోగా ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,47,978 కు చేరింది. ప్రస్తుతం ఇంకా 2,20,114 మంది బాధితులుండగా వారందరికీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది.

దేశ వ్యాప్తంగా కోవిడ్ పరీక్షల లాబ్ ల్ నెట్ వర్క్ ను విస్తృతం చేసేందుకు భారత వైద్య పరిశోధనామండలి(ఐసీఎం ఆర్) చర్యలు తీసుకుంటున్నది.  ఇప్పుడు భారత్ లో మొత్తం లాబ్ ల సంఖ్య  1056 కు చేరింది. వీటిలో  764 ప్రభుత్వ లాబ్ లు,  292 ప్రయివేట్ లాబ్ లు. ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది.

 

  •  తక్షణం ఫలితాలు చూపే పరీక్షల లాబ్స్ : 576 (ప్రభుత్వ: 365  + ప్రైవేట్:  211)
  • ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 394 (ప్రభుత్వ: 367   + ప్రైవేట్: 27)
  • సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 86  (ప్రభుత్వ: 32  + ప్రైవేట్: 54)


పరీక్షలు కూడా బాగా పుంజుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,17,931 శాంపిల్స్ కు పరీక్షలు జరిగాయి. దీంతో ఇప్పటివరలు జరిపిన పరీక్షల సంఖ్య 88,26,585 కు చేరింది 

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి.


కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.


కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf  చూడండి

 


****



(Release ID: 1635721) Visitor Counter : 218