ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 వెంటిలేటర్ల వార్తలకు ఖండన

Posted On: 01 JUL 2020 12:42PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం అందజేస్తున్న వెంటిలేటర్లలో బై లెవెల్ పాజిటివ్ ఎయిర్వే ప్రెజర్ అనే సౌకర్యం లేదంటూ మీడియాలో కథనాలు వస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాం

 

రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అందజేసిన మేకిన్ ఇండియా వెంటిలేటర్లు ఐసియు ల కోసం ఉద్దేశించినవి. ఈ విషయంలో ప్రత్యేక పరిజ్ఞానం ఉన్నవారితో ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్  నేతృత్వంలోని సాంకేతిక నిపుణులకమిటీ ఇచ్చిన సాంకేతిక అంశాలకు లోబడి కోవిడ్ బాధితుల కోసం వీటిని తయారు చేశారు. ఇదే ప్రమాణాలతో తయారైన వెంటిలేటర్లను మాత్రమే మంత్రిత్వశాఖ కొనుగోలు చేసి పంపిణీ చేసింది.

 

ఇలా  సాంకేతిక నిపుణుల కమిటీ చెప్పిన ప్రమాణాలకు లోబడి నిర్దేశిత ప్రమాణాలతో ఉన్న బిఇఎల్, అగ్వా మోడల్స్ వెంటిలేటర్లను మంత్రిత్వశాఖ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేసింది. సరసమైన ధరలతో భారత దేశంలో తయారైన ఈ వెంటిలేటర్లకు బై లెవెల్ పాజిటివ్ ఎయిర్వే ప్రెజర్ సౌకర్యం ఉంది. అదే విధంగా సాంకేతిక నిపుణుల బృందం నిర్దేశించిన ఇతర ప్రమాణాలు కూడా ఉన్నాయి. ఈ వెంటిలేటర్లతో బాటు వాటి వినియోగపు పద్ధతిని తెలిపే సమాచారం, అభిప్రాయాలను పంచుకునే వెసులుబాటు కూడా కల్పించాం

 

******



(Release ID: 1635632) Visitor Counter : 170