ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఈసిఎల్జిఎస్ కింద రూ.ఒక లక్ష కోట్లకు పైగా రుణాలు మంజూరు


30 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు, ఇతర వ్యాపారాలకు ఈ పథకం ద్వారా లబ్ది

Posted On: 30 JUN 2020 5:50PM by PIB Hyderabad

ప్రభుత్వ హామీతో 100% ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఇసిఎల్‌జిఎస్) కింద, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన బ్యాంకులు 2020 జూన్ 26 నాటికి రూ.1 లక్ష కోట్ల విలువైన రుణాలను మంజూరు చేశాయి, వీటిలో ఇప్పటికే రూ .45,000 కోట్లకు పైగా పంపిణీ అయ్యాయి . ఇది 30 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈ లు, ఇతర వ్యాపారాలు లాక్ డౌన్  తర్వాత వారి వ్యాపారాలను పునఃప్రారంభించటానికి సహాయపడుతుంది.

 

పిఎస్‌బిలు రూ. 57,525.47 కోట్ల రుణాలను మంజూరు చేయగా, ప్రైవేటు రంగ బ్యాంకులు ఇసిఎల్‌జిఎస్ కింద రూ .44,335.52 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. ఈ పథకం కింద అగ్రభాగాన ఉన్న  రుణ దాతలు ఎస్బిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి, కెనరా బ్యాంక్, హెచ్డిఎఫ్సి.

12 పిఎస్‌బిలు మంజూరు చేసిన రుణాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

ఆత్మనీర్భర్ ప్యాకేజీలో భాగంగా ఎంఎస్‌ఎంఇలు, చిన్న వ్యాపారాలకు అదనపు రుణంగా రూ .3 లక్షల కోట్ల ప్రణాళికలను ప్రభుత్వం ప్రకటించింది. అటువంటి సంస్థలు తమ ప్రస్తుత రుణాలలో 20% వరకు క్యాప్ అయిన వడ్డీ రేట్ల వద్ద అదనపు రుణాలు పొందటానికి అర్హులు.


పిఎస్‌బిలు ఇసిఎల్‌జిఎస్ కింద మంజూరు చేసిన, పంపిణీ చేసిన రుణాల గురించి రాష్ట్రాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

****


(Release ID: 1635438) Visitor Counter : 316