పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ఫరీదాబాద్‌లో ఇండియన్ ఆయిల్ సంస్థ కు చెందిన కొత్త ఆర్ అండ్ డి కేంద్రానికి శంఖుస్థాపన చేసిన - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
ఆత్మనిర్భర్ భారత్ కు ఆర్ & డి కీలకమైన అంశం
హర్యానాను దేశంలో ప్రముఖ ఆర్ & డి కేంద్రంగా మార్చడానికి కట్టుబడి ఉన్నాము - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
29 JUN 2020 1:31PM by PIB Hyderabad
కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు, ఉక్కు శాఖల మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ తో కలిసి, ఫరీదాబాద్, సెక్టార్-67, ఐ.ఎం.టి. వద్ద ఇండియన్ ఆయిల్ సంస్థ కు చెందిన రెండవ ఆర్ & డి ప్రాంగణంలో అత్యాధునిక సాంకేతికాభివృద్ధి మరియు అభివృద్ధి కేంద్రానికి శంఖుస్థాపన చేశారు. ఈ కొత్త కేంద్రాన్ని, సుమారు 59 ఎకరాల విస్తీర్ణంలో, 2,282 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నారు. ఫరీదాబాద్ లోని సెక్టార్ -13 వద్ద ఉన్న ప్రాంగణంతో కలిసి పనిచేసే, కొత్త కేంద్రం, ఇండియన్ ఆయిల్ సంస్థకు చెందిన ఆర్ & డి విభాగంచే అభివృద్ధి చేయబడిన వివిధ సాంకేతిక పరిజ్ఞానాల ప్రదర్శన మరియు విస్తరణపై దృష్టి పెడుతుంది.
కొత్త ప్రాంగణంలోని పరిశోధనా మౌలికసదుపాయాలలో, ప్రత్యామ్నాయ మరియు పునరుత్పాదక శక్తి పరిధిలో అత్యాధునిక ప్రయోగశాలలు, పైలట్ ప్లాంట్లు ఉంటాయి. ఉదా., ఇంధన సెల్, హైడ్రోజన్, గ్యాసిఫికేషన్ & సౌర శక్తి పరిశోధన, సెమీ-కమర్షియల్ నానో-మెటీరియల్ ప్రొడక్షన్ యూనిట్, పెట్రోకెమికల్స్, ఉత్ప్రేరకాలు, బయోటెక్నాలజీ మొదలైన వాటిలో ప్రమాణాలను పెంపొందించడంతో పాటు పైలట్ ప్లాంట్లు ఉంటాయి. ఇండియన్ ఆయిల్ కు చెందిన ఆర్ & డి. కేంద్రం యొక్క ఈ కొత్త విభాగం, సాంప్రదాయ, సాంప్రదాయేతర ఇంధన విషయాలపై దృష్టి సారిస్తుంది. పెట్రోకెమికల్స్, బ్యాటరీలు / ఎనర్జీ స్టోరేజ్ పరికరాలు, బయో-ఎనర్జీ-గ్రీన్ హౌస్ గ్యాస్ (సి.ఓ.2) వంటి అనేక ఫ్రంట్ లైన్ మరియు సౌర సాంకేతిక పరిజ్ఞానాలు, సంగ్రహణ, ఉత్ప్రేరకాలు లేదా ఇంధన కణాల కోసం నోవెల్ నానో పదార్థాలు, చలనశీలత మరియు స్థిర అనువర్తనాల కోసం హైడ్రోజన్ ఉత్పత్తి మార్గాలు మరియు ఇంధన కణాలు వంటి అంశాలలో స్వదేశీకరణను లక్ష్యంగా పెట్టుకుంటుంది.
ఈ సందర్భంగా శ్రీ ప్రధాన్ మాట్లాడుతూ, "ఇండియన్ ఆయిల్ సంస్థకు చెందిన ఆర్ అండ్ డి కేంద్రం, అనేక సంవత్సరాలుగా, పెట్రోలియం రంగంలో పరిశోధన, అభివృధి కోసం అత్యాధునిక పరోశోధనా కేంద్రంగా వికసించింది, భారతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానాలు మరియు ప్రక్రియలపై దృష్టి సారించింది. ఇండియన్ ఆయిల్ సంస్థకు చెందిన ఆర్ & డి కేంద్రం గౌరవనీయులైన ప్రధానమంత్రి ఆత్మనీర్భర్ భారత్ స్వప్నానికి గణనీయంగా దోహదపడింది. ” అని పేర్కొన్నారు. ఈ ఆర్ & డి కేంద్రం, ప్రత్యామ్నాయ, స్వచ్ఛమైన, స్వదేశీ ఇంధన పరిష్కారాల కోసం ఒక ప్రయోగశాలగా రూపొందుతుందనీ, ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వావలంబన దిశ గా మార్చడంతో పాటు, ఆత్మ నిర్భర్ భారత్ గురించి గౌరవనీయులైన ప్రధానమంత్రి లక్ష్యాన్ని సాకారం చేయడానికి ఇది ఒక పెద్ద ముందడుగు, అని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యకలాపాలకు సహకరించినందుకు హర్యానా ప్రభుత్వానికి అయన కృతజ్ఞతలు తెలియజేస్తూ, హర్యానాను కిరోసిన్ లేని రాష్ట్రంగా మార్చిన ముఖ్యమంత్రిని అభినందించారు. వ్యవసాయ అవశేషాలను స్వచ్ఛమైన ఇంధనంగా మార్చడంలో రాష్ట్రం ప్రధాన పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. శ్రీ మనోహర్ లాల్ నాయకత్వంలో హర్యాణా రాష్ట్రం, సామాజిక-ఆర్థికాభివృద్ధితో పాటు వివిధ రంగాలలోఅద్భుతమైన అభివృద్ధిని సాధించిందని ఆయన పేర్కొన్నారు. హర్యానా రాష్ట్రాన్ని దేశంలో ప్రముఖ ఆర్ & డి హబ్‌గా మార్చడానికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ యొక్క ముఖ్య అంశంగా ఆర్ & డి ని పేర్కొంటూ, రాష్ట్రంలో వ్యర్థాల నుండి ఇంధన కార్యక్రమాలకు మరింత ప్రోత్సాహాన్ని అందించాలనీ, ప్రత్యామ్నాయ ఇంధన పరిష్కారాలలో రాష్ట్రాన్ని ప్రపంచ నమూనాగా మార్చడానికి కృషి చేయాలనీ ఆయన ఇండియన్ ఆయిల్ సంస్థను కోరారు. వ్యర్థాలను శక్తిగా మార్చడానికి సమాజ-ఆధారిత నమూనా అందరికీ విజయాన్ని చేకూరుస్తుందని, ఆయన అన్నారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగించుకునే సామర్థ్యం రాష్ట్రానికి ఎక్కువగా ఉందని ఆయన అన్నారు.
కరోనా సంక్షోభ సమయంలో ప్రపంచానికి ఔషధాలను సరఫరా చేయడంలో భారతదేశం ముఖ్యమైన పాత్ర పోషించిందని మంత్రి చెప్పారు. దేశంలో పెట్రోకెమికల్ ఉత్పత్తుల అవసరం పెరుగుతోందనీ, పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతిని తగ్గించుకోవాలనీ, ఆయన పేర్కొన్నారు. భారతదేశాన్ని పెట్రోకెమికల్ హబ్‌గా మార్చడానికీ, దేశాన్ని స్వావలంబన దిశగా మార్చడానికీ, కృషి చేయాలని ఆయన పరిశ్రమలకు పిలుపునిచ్చారు.
హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ మాట్లాడుతూ, కరోనా మహమ్మారి సమయంలో, రాష్ట్రంలో సంక్షోభాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా పరిష్కరించిందనీ, బాధిత కార్మికులకు సహాయం అందించడం ద్వారా వారికి ఉపశమనం కలిగించిందనీ, చెప్పారు. ఇండియన్భా ఆయిల్ సంస్థకు చెందిన నూతన పరిశోధనా విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు హర్యానాను ఎన్నుకున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు . వ్యవసాయ రంగంతో పాటు, క్రీడా రంగం, ఆటోమొబైల్ రంగంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ, రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కిరోసిన్ లేని రాష్ట్రంగా మార్చడంలో రాష్ట్రం చురుకైన పాత్ర పోషించిందనీ, కొన్ని అనాలోచిత శక్తులు, దీన్ని కల్తీ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాయని భావించామనీ, అందువల్ల దీనిని అమలు చేసినప్పుడు వ్యతిరేకత లేదని ఆయన వివరించారు. గృహాలకు ఎల్.పి.జి. కనెక్షన్లు అందిస్తున్నామని చెప్పారు. ఎల్.ఎన్.జి. మరియు వ్యవసాయ పరిశ్రమ రంగాల్లో రాష్ట్రం కచ్చితంగా ముందుకు సాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
*****
(Release ID: 1635165)
Visitor Counter : 251