ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 తాజా సమాచారం


మరింత మెరుగై 58.67% చేరుకున్న కోలుకున్నవారి శాతం

కోలుకున్న, చికిత్సలో ఉన్నవారి మధ్య తేడా లక్షా 11 వేలకు పైమాటే

Posted On: 29 JUN 2020 1:13PM by PIB Hyderabad

  

భారత ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు, సానుకూల చర్యలు తగిన ఫలితాలు ఇస్తున్నాయి. చికిత్సలో ఉన్నవారి కంటే కోలుకున్నవారి సంఖ్య ప్రోత్సాహకరంగా సాగిపోతోంది.   ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారు 1,11,602  మంది ఎక్కువగా ఉన్నారు. దీంతో ఇప్పటివరకు 3,21,722 మంది కోలుకోగా కోలుకున్నవారి శాతం 58.67%  గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 12,010  మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.


ప్రస్తుతం 2,10,120  మంది కోవిడ్ బాధితులు ఉండగా వారందరికీ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. 
దేశ వ్యాప్తంగా కోవిడ్ పరీక్షల లాబ్ ల్ నెట్ వర్క్ ను విస్తృతం చేసేందుకు భారత వైద్య పరిశోధనామండలి (ఐసీఎంఆర్) చర్యలు తీసుకుంటున్నది.   ఇప్పుడు భారత్ లో మొత్తం లాబ్ ల సంఖ్య  1047   కు చేరింది. వీటిలో 760 ప్రభుత్వ లాబ్ లు, 287  ప్రయివేట్ లాబ్ లు. గడిచిన 24 గంటల్లో మొత్తం  11 లాబ్ లు అదనంగా వచ్చి చేరగా అవన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనివే కావటం గమనార్హం. ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది.

 

  • తక్షణం ఫలితాలు చూపే పరీక్షల లాబ్స్ : 567  (ప్రభుత్వ: 362  + ప్రైవేట్:  205)
  • ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 393 (ప్రభుత్వ: 366   + ప్రైవేట్: 27))
  • సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 87  (ప్రభుత్వ: 32  + ప్రైవేట్: 55)


పరీక్షలు జరుపుతున్న శాంపిల్స్ సంక్య కూడా బాగా పెరుగుతోంది; నిన్నటివరకూ వీటి సంఖ్య 1,70,560 కాగా,  ఇప్పుడు ఆ సంఖ్య 83,98,362 కు చేరింది. 

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా  https://www.mohfw.gov.in/  మరియు   @MoHFW_INDIA ను సందర్శించండి.

కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.


కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf  చూడండి.

 

******* 


(Release ID: 1635115) Visitor Counter : 249