హోం మంత్రిత్వ శాఖ
సర్దార్ పటేల్ జాతీయ సమైక్యతా అవార్డు -2020 నామినేషన్లకు గడువు 2020 ఆగస్టు 15 వరకు పెంపు
Posted On:
26 JUN 2020 4:11PM by PIB Hyderabad
దేశ సమైక్యత , సమగ్రతా రంగంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం, సర్దార్ పటేల్ జాతీయ సమైక్యతా అవార్డుకు ఆన్‌లైన్ ద్వారా నామినేషన్ల సమర్ఫణకు గడువును 2020 ఆగస్టు 15 వరకు పొడిగించారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆన్‌లైన్ ద్వారా నామినేషన్లను https://nationalunityawards.mha.gov.in వెబ్ సైట్ ద్వారా స్వీకరిస్తుంది.
భారత ప్రభుత్వం ఈ అవార్డును సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుమీద ఏర్పాటు చేసింది. జాతీయ సమైక్యత, సమగ్రత, బలమైన, ఐక్య భారతావనిని ప్రోత్సహించేందుకు,చెప్పుకోదగిన, ప్రేరణాత్మక కృషి చేసిన వారిని గుర్తించి గౌరవించేందుకు భారత ప్రభుత్వం ఈ అవార్డును ఏర్పాటు చేసింది.
అవార్డు చిత్రం కింద ఇవ్వబడింది
****
(Release ID: 1634649)
Visitor Counter : 279