సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

జ్ఞానాన్ని సంపదగా మార్చటమే తయారీరంగ అభివృద్ధిలో కీలకం: శ్రీ నితిన్ గడ్కరీ


Posted On: 26 JUN 2020 12:37PM by PIB Hyderabad

ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి కోవిడ్ సంక్షోభానికి ముందు, తరువాత ఎదుగుదల గురించి చర్చించేందుకు ఎం ఎస్ ఎం ఇ, రోడ్డు రవాణా, హైవేల శాఖామంత్రి నితిన్ గడ్కరీ నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  మండలి ప్రతినిధులతో మాట్లాడారు. లాక్ దౌన్ కారణంగా  ప్రతి రంగానికీ ఆర్థికపరమైన స్వల్పకాలిక సమస్యలున్నప్పటికీ సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం ద్వారా అలాంటి సమస్యలన్నిటినీ అధిగమించాలని హితవు చెప్పారు. సంబంధితులందరి పరస్పర సహకారం  ద్వారా సమర్థంగా ఇలాంటి సమస్యలకు పరిష్కారం వెతుక్కోవాలన్నారు.

ఈ చర్చా గోష్ఠి సందర్భంగా మంత్రి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా రంగపు ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. దేశ స్థూల జాతీయోత్పత్తిని పెంచటంలో, ఉపాధి కల్పనలో, ఎగుమతులలో ఈ రంగం పాత్రను ప్రత్యేకంగా అభినందించారు. దేస ఎగుమతులలో ప్రస్తుతం 48%   సూక్ష్మ, చిన్న, మధ్యతరహా  రంగమే తన వాటాగా అందిస్తోందన్నారు. సాంకేతికంగా మెరుగైన పరిజ్ఞానాన్ని వినియోగించుకోవటం ద్వారా ఈ వాటాను మరింత పెంచుకోవలసిన అవసరం ఉందన్నారు.  రవాణా వ్యయాన్ని, కార్మికుల వేతనాలను కూడా తగినంతగా తగ్గించుకోవటం ద్వారా భారత్ లో తయారీ రంగం బాగా పుంజుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్దారు. పాకేజింగ్, సౌకర్యాల ప్రామాణీకరణ లాంటి అంశాల్లో బాగా మెరుగుపడినప్పుడే ఎగుమతులు పెరుగుతాయన్నారు. ప్రపంచం ఇప్పుడిప్పుడే కోవిడ్ సంక్షోభ ప్రభావం నుంచి బైటపడుతున్నందున ఎగుమతుల మీద దృష్టి సారించాలని సూచించారు.

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా యూనిట్లకోసం ఈ మంత్రిత్వశాఖ  ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ఆ యూనిట్లు కోలుకోవటానికి అండగా నిలబడ్డ విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మంచి టర్నోవర్ ఉన్న ఎం ఎస్ ఎం ఇ సమ్స్థల జిఎస్టీ, రిటుర్న్ లు, ఆదాయపు పన్ను రిటర్న్ ల రికార్డులను మళ్లీ మదింపు చేసి రేటింగ్ ఇచ్చిన మీదట  ప్రభుత్వం 15%  వాటా తీసుకొని ఆదుకుంటుందని చెప్పారు. దీనివలన కాపిటల్ మార్కెట్ నుంచి  క్రమంగా డబ్బు పొందటానికి వీలవుతుందని, విదేశీ పెట్టుబడులను సైతం ఆకర్షించవచ్చునని చెప్పారు.

పరిశ్రమలు తమ వార్షిక లాభాలలో  2 నుంచి 3% పరిశోధనమీద ఖర్చు చేయాలన్నారు. జ్ఞానాన్ని సంపదగా మార్చినప్పుడే పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్దారు. ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి సభ్యులు ఏవైనా నిర్దిష్టమైన సూచనలు ఉంటే మంత్రిత్వశాఖకు తెలియజేయటం ద్వారా ప్రభుత్వం నుంచి సహాయం పొందవచ్చునన్నారు.

*****



(Release ID: 1634489) Visitor Counter : 196