ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 తాజా సమాచారం
కోవిడ్ మీద పోరుకు ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం ఆపన్నహస్తం
Posted On:
26 JUN 2020 12:22PM by PIB Hyderabad
కోవిడ్ సంక్షోభం మీద పోరాటానికి దేశమంతా ఉమ్మడి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఈశాన్య రాష్ట్రాల కోవిడ్ పోరుకు కేంద్రం మరింత బలంగా మద్దతునిస్తోంది. నిజానికి దేశ సగటుతో పోల్చుకున్నప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు చాలా తక్కువగానే నమోదయ్యాయి.
ఈ క్రింది పట్టికలో పేర్కొన్నట్టుగా ప్రస్తుతం 3731 మందికి చికిత్స జరుగుతుండగా కోలుకున్నవారి సంఖ్య 5715. మరణాల శాతం కూడా తక్కువగానే నమోదవుతూ ఉంది. మణిపూర్, మిజోరం, నాగాలాండ్, సిక్కింలలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.
సంఖ్య
|
రాష్ట్రం
|
చికిత్సలో ఉన్నవారు
|
కోలుకున్నవారు
|
మరణాలు
|
1
|
అరుణాచల ప్రదేశ్
|
121
|
38
|
1
|
2
|
అస్సాం
|
2279
|
4033
|
9
|
3
|
మణిపూర్
|
702
|
354
|
0
|
4
|
మేఘాలయ
|
3
|
42
|
1
|
5
|
మిజోరం
|
115
|
30
|
0
|
6
|
నాగాలాండ్
|
195
|
160
|
0
|
7
|
సిక్కిం
|
46
|
39
|
0
|
8
|
త్రిపుర
|
270
|
1019
|
1
|
మొత్తం
|
3731
|
5715
|
12
|
ఈశాన్య రాష్ట్రాల్లో ఈ వ్యాధి ప్రబలటానికి ప్రధాన కారణం అక్కడ వ్యాధి నిర్థారణ పరీక్షా పరికరాలు అందుబాటులో లేకపోవటం. కానీ నేడు కేంద్రం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ద్వారా ప్రత్యేకంగా దృష్టి సారించటం వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో పరీక్షలకోసం 39 లాబ్ లు ప్రభుత్వ రంగంలోను, 42 ప్రైవేట్ రంగంలోను అందుబాటులోకి వచ్చాయి.
సంఖ్య.
|
రాష్ట్రం
|
ప్రభుత్వ లాబ్ లు
|
ప్రైవేట్ లాబ్ లు
|
మొత్తంలాబ్ లు
|
1
|
అరుణాచల ప్రదేశ్
|
3
|
0
|
3
|
2
|
అస్సాం
|
10
|
2
|
12
|
3
|
మణిపూర్
|
2
|
0
|
2
|
4
|
మేఘాలయ
|
6
|
1
|
7
|
5
|
మిజోరం
|
2
|
0
|
2
|
6
|
నాగాలాండ్
|
13
|
0
|
13
|
7
|
సిక్కిం
|
2
|
0
|
2
|
8
|
త్రిపుర
|
1
|
0
|
1
|
మొత్తం
|
39
|
3
|
42
|
కోవిడ్ కోసం ప్రత్యేకంగా నిర్దేశించిన ఆస్పత్రులు లేకపోవటం కూడా ఈశాన్య రాష్ట్రాలకు ఇబ్బందికరంగా తయారైంది. అయితే, ఆ తరువాత కేంద్ర సహాయంతో మౌలిక సదుపాయాలకల్పన పెద్ద ఎత్తున జరిగింది. ప్రస్తుతం ఆస్పత్రుల, మౌలిక సదుపాయాల పరిస్థితి ఇలా ఉంది.
సంఖ్య
|
రాష్ట్రం
|
ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులు
|
ప్రత్యేక కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు
|
ప్రత్యేక కోవిడ్ వైద్య కేంద్రాలు
|
మొత్తం సౌకర్యాలు
|
1
|
అరుణాచల ప్రదేశ్
|
4
|
31
|
51
|
86
|
2
|
అస్సాం
|
32
|
267
|
1001
|
1300
|
3
|
మణిపూర్
|
2
|
18
|
1
|
21
|
4
|
మేఘాలయ
|
7
|
24
|
14
|
45
|
5
|
మిజోరం
|
1
|
15
|
15
|
31
|
6
|
నాగాలాండ్
|
12
|
1
|
1
|
14
|
7
|
సిక్కిం
|
1
|
2
|
2
|
5
|
8
|
త్రిపుర
|
1
|
2
|
13
|
16
|
మొత్తం
|
60
|
360
|
1098
|
1518
|
అదే విధంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఐసియు పడకలు, ఆక్సిజెన్ తో కూడిన పడకలు, వెంటిలేటర్లు పెంచటంలో కూడా భారత ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించింది. ఆ విధంగా కోవిడ్ ను సమర్థంగా నియంత్రించటంలో ఈ చర్యలు కీలకపాత్ర పోషించాయి.
సంఖ్య
|
రాష్ట్రం
|
మొత్తం ఐసొలేషన్ పడకలు
|
ఆక్సిజెన్ తో కూడిన పడకలు
|
మొత్తం ఐసియు పడకలు
|
వెంటిలేటర్లు
|
1
|
అరుణాచల ప్రదేశ్
|
1998
|
178
|
60
|
16
|
2
|
అస్సాం
|
67833
|
1841
|
598
|
350
|
3
|
మణిపూర్
|
829
|
317
|
48
|
45
|
4
|
మేఘాలయ
|
1231
|
345
|
83
|
95
|
5
|
మిజోరం
|
709
|
213
|
37
|
27
|
6
|
నాగాలాండ్
|
681
|
142
|
54
|
28
|
7
|
సిక్కిం
|
251
|
224
|
20
|
59
|
8
|
త్రిపుర
|
1277
|
10
|
13
|
7
|
ఎన్ 95 మాస్కులు, పిపిఇ కిట్స్, హెచ్ సి క్యు మాత్రల అందుబాటును సైతం కేంద్రం బాగా పెంచింది.
*****
(Release ID: 1634466)
Visitor Counter : 271