నౌకారవాణా మంత్రిత్వ శాఖ

తవ్వకం వల్ల బయటపడిన సామాగ్రిని తిరిగి వాడే విషయాన్ని పరిశోధించాలని శ్రీ మాండవీయ పిలుపు



'వ్యర్ధాల నుంచి సంపదను' సృష్టించడం ద్వారా సుస్థిర అభివృద్ధి సాధించాలన్నది భారత ప్రగతి గాథలో ప్రభుత్వ లక్ష్యమని శ్రీ మాండవీయ అన్నారు

Posted On: 24 JUN 2020 2:56PM by PIB Hyderabad

నౌకానిర్మాణం, డ్రెడ్గింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా,  ఇండియాన్ పోర్ట్ అసోసియేషన్, భారత జల మార్గాల అధికార సంస్థ,  ప్రధాన ఓడరేవుల చైర్మన్లు మరియు ఈ రంగానికి చెందిన నిపుణులతో  నౌకా నిర్మాణ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర)  శ్రీ మనసుఖ్ మాండవీయ బుధవారం తవ్వకం వ్యర్ధాలను రీ సైకిల్ చేయడాన్ని గురించి జరిగిన వీడియో కాన్ఫరెన్సుకు అధ్యక్షత వహించారు. 

 

 

అధికారులు, నిపుణుల సూచనలకు స్పందించిన శ్రీ మాండవీయ మాట్లాడుతూ తవ్వకం వ్యర్ధాలను రీ సైకిల్ చేయడం ద్వారా తవ్వకం ఖర్చులను తగ్గించవచ్చని అన్నారు.   తవ్వకాల ద్వారా వ్యర్ధాలను తొలగించడం వల్ల జలమార్గ రవాణా సురక్షితం, సులభతరం కాగలదని అన్నారు.   చౌకలో తవ్వకాలు జరిపేందుకు ప్రైవేట్ సంస్థలు పర్యావరణ హితమైన పద్ధతులను రూపొందించాలని అన్నారు. 

 

తవ్వకం వ్యర్ధాలను ఉపయోగించి పర్యావరణ హితమైన పదార్థాలు తయారు చేయడం ద్వారా సుస్థిర అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో  భారత ప్రభుత్వం ఉందని శ్రీ మాండవీయ అన్నారు.    'వ్యర్ధాల నుంచి సంపదను'  సృష్టించడం ద్వారా సుస్థిర అభివృద్ధి సాధించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు ఇది అనుగుణమని ,  భారత ప్రగతి గాథలో ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. 

 

*******



(Release ID: 1634113) Visitor Counter : 160