శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

'సీఎస్‌ఐఆర్‌-నీరి'లో మూడు వేలకు పైగా కొవిడ్‌ నమూనాల పరీక్ష

Posted On: 24 JUN 2020 12:46PM by PIB Hyderabad

"సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌" (సీఎస్‌ఐఆర్‌-నీరి) లో కొవిడ్‌ నమూనా పరీక్ష కేంద్రం గత ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి దాదాపు 3 వేలకు పైగా పరీక్షలు జరిగాయి.

 

        ఇక్కడ రోజుకు 50 నమూనాలను పరీక్షించవచ్చు. నమూనాలను పరీక్షించడానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. పరీక్షకు ముందు భద్రతపరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. పరీక్ష కేంద్రంలో నమూనాలను పరీక్షించేందుకు కావలసిన అన్ని అనుమతులు తీసుకున్నట్లు సీఎస్‌ఐఆర్‌-నీరి డైరెక్టర్‌ డా.రమేష్‌ కుమార్‌ చెప్పారు.

 

        "నాగ్‌పుర్‌, విదర్భ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే నమూనాలను ఇక్కడ పరీక్షిస్తాం. రోగులకు చికిత్స చేసేటప్పడు వైద్య నిపుణులు వైరస్‌ బారిన పడకుండా వారికి వ్యక్తిగత రక్షణ పరికరాలను కూడా పంపిణీ చేస్తున్నాం" అని సీఎస్‌ఐఆర్‌-నీరి శాస్త్రవేత్త డా.ప్రకాశ్‌  చెప్పారు.

 

 

******


(Release ID: 1633877) Visitor Counter : 228