హోం మంత్రిత్వ శాఖ

పూరి జగన్నాథ రథయాత్ర సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌ షా


జగన్నాథ రథయాత్ర పవిత్ర సమయాన ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు: అమిత్‌ షా

మంచి ఆరోగ్యం, ఆనందం, సంక్షేమం కోసం అందరికీ జగన్నాథుడి ఆశీస్సులు లభించాలి: అమిత్‌ షా

జగన్నాథుడు ప్రజలందరిపై కరుణ కురిపించాలి, దేశానికి కరోనా నుంచి త్వరగా విముక్తి ప్రసాదించాలి. జై జగన్నాథ్: అమిత్‌ షా

Posted On: 23 JUN 2020 11:26AM by PIB Hyderabad

పూరి జగన్నాథ రథయాత్ర సందర్భంగా... కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. "జగన్నాథ రథయాత్ర పవిత్ర సమయం సందర్భంగా ప్రజలందరికి హార్దిక శుభాకాంక్షలు. చక్కటి ఆరోగ్యం, సంతోషం, సంక్షేమం కోసం ప్రజలందరికీ జగన్నాథుడి ఆశీస్సులు లభించాలి. జగన్నాథుడి కరుణాధార ప్రజలందరిపై కురవాలి, దేశానికి కరోనా మహమ్మారి నుంచి త్వరగా విముక్తి ప్రసాదించాలి. జై జగన్నాథ్" అంటూ అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.

    రథయాత్ర నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు అనుమతించడాన్ని అమిత్‌ షా స్వాగతిస్తూ నిన్న (సోమవారం) కూడా  ట్వీట్‌ చేశారు. కోర్టు తీర్పుతో యావత్‌ దేశం సంతోషం వ్యక్తం చేసిందన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భక్తుల మనోభావాలను అర్థం చేసుకోవడమేగాక, మన కర్మభూమి సంప్రదాయాలను కొనసాగించేలా సంప్రదింపులు జరిపినందుకు తనతోపాటు, దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తులందరినీ సంతోషంలో ముంచెత్తిందని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

 

Amit Shah@AmitShah

I extend my warm greetings to all, on the auspicious occasion of Rath Yatra. May Maha Prabhu Jagannath bless everyone with good heath, joy and prosperity.

Jai Jagannath!

34.8K

7:00 AM - Jun 23, 2020

Twitter Ads info and privacy

4,728 people are talking about this

 

*****



(Release ID: 1633580) Visitor Counter : 145