నీతి ఆయోగ్

డీ-కార్బనైజింగ్ ట్రాన్స్ పోర్ట్ : భారతదేశంలో తక్కువ కార్బన్ డయాక్సయిడ్ తో రవాణా అభివృద్ధి కి అంతర్జాతీయ ప్రాజెక్టు

Posted On: 22 JUN 2020 12:50PM by PIB Hyderabad

అంతర్జాతీయ రవాణా ఫోరమ్ (ఐ.టి.ఎఫ్) సహకారంతో భారతదేశానికి తక్కువ కార్బన్ వెలువడే రవాణా వ్యవస్థ వైపు ఒక మార్గాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో నీతీ ఆయోగ్, జూన్ 24వ తేదీన “భారతదేశంలో డీ-కార్బనైజింగ్ రవాణా” అనే  ప్రాజెక్టును ప్రారంభించనుంది.

 

రవాణా విధానం కోసం అంతర్ ప్రభుత్వ సంస్థ అయిన ఐ.టి.ఎఫ్.‌లో భారతదేశం, 2008 నుండి సభ్యదేశంగా ఉంది. 

 

ఐ.టి.ఎఫ్. సెక్రటరీ జనరల్ యంగ్ టే కిమ్ మరియు నీతీ ఆయోగ్ సీ.ఈ.ఓ. అమితాబ్ కాంత్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును ఆన్ లైన్ ద్వారా ప్రారంభిస్తారు. గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ; రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తో పాటు ఐ.టి.ఎఫ్. కు చెందిన  సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో హాజరుకానున్నారు.

 

భారతదేశంలోని రవాణా మరియు వాతావరణ భాగస్వాములకు, ప్రణాళికాబద్ధమైన ప్రాజెక్టు కార్యకలాపాల గురించి ఈ ఆన్ లైన్ ఈవెంట్ తెలియజేస్తుంది.  భారతదేశంలో రవాణా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లకు సంబంధించిన సమాచారాన్ని అందించే అవకాశంతో పాటు కార్బన్ డయాక్సయిడ్ (సి.ఓ-2) తగ్గింపు ఆశయాలకు వాటిని ఎలా అనుసంధానం చేయాలో కూడా ఇది తెలియజేస్తుంది.   భారతదేశం యొక్క నిర్దిష్ట అవసరాలు మరియు పరిస్థితులపై ఈ ప్రాజెక్టు మరింత దృష్టి పెట్టడానికి చర్చ సహాయపడుతుంది.

 

"భారతదేశంలో డి-కార్బోనైజింగ్ రవాణా" ప్రాజెక్టు, భారతదేశానికి అనువైన రవాణా ఉద్గారాల అంచనా ఫ్రేమ్‌ వర్క్ ‌ను రూపొందిస్తుంది.  ప్రస్తుత, భవిష్యత్ రవాణా కార్యకలాపాలు మరియు సంబంధిత కర్బన ఉద్గారాలపై సరైన నిర్ణయాలు తీసుకోడానికి ఇది ఒక వివరణాత్మక అవగాహనను ప్రభుత్వానికి అందిస్తుంది.

 

*          ఏమిటి   :   "భారతదేశంలో డీ-కార్బనైజింగ్ రవాణా" ప్రారంభం. 

*         ఎప్పుడు :  బుధవారం, జూన్ 24వ తేదీ, 17:00 - 19:00 ఐ.ఎస్.టి. 

*          ఎక్కడ   :  యు ట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్  https://youtu.be/l2G5x5RdBUM

 

అంతర్జాతీయ రవాణా ఫోరం చేపట్టిన "డీ-కార్బనైజింగ్ రవాణా" అనే కార్యక్రమం “Decarbonising Transport” initiative     యొక్క ప్రేరణతో భారతదేశంలో ఈ ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో రవాణాలో కర్బన ఉద్గారాల తగ్గింపు కోసం అనుసరిస్తున్న "ప్రస్తుతం నెలకొన్న ఆర్ధికవ్యవస్థలలో డీ-కార్బనైజింగ్ రవాణా" (డి.టి.ఈ.ఈ) అనే   “Decarbonising Transport in Emerging Economies” (DTEE)   కార్యక్రమాల సముదాయంలో ఇది ఒక భాగం.   భారతదేశంతో పాటు, అర్జెంటీనా, అజర్బైజాన్, మొరాకో దేశాలు ప్రస్తుతం పాల్గొంటున్నాయి. డి.టి.ఈ.ఈ. అనేది ఐ.టి.ఎఫ్.  మరియు వుప్పెర్టల్ ఇన్స్టిట్యూట్ మధ్య సహకారంతో పాటు జర్మన్ ఫెడరల్ మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్, నేచర్ కన్జర్వేషన్ మరియు న్యూక్లియర్ సేఫ్టీ కి చెందిన ఇంటర్నేషనల్ క్లైమేట్ ఇనిషియేటివ్ (ఐ.కే.ఐ) మద్దతుతో  స్థాపించబడింది. 

 

*****



(Release ID: 1633313) Visitor Counter : 259