మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

6వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ముక్తార్ అబ్బాస్ నఖ్వీ


త‌న నివాసంలో వివిధ వర్గాల వారితో కలిసి యోగా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ కేంద్ర మంత్రి

Posted On: 21 JUN 2020 1:36PM by PIB Hyderabad

6వ‌ అంతర్జాతీయ యోగా దినోత్సవం పుర‌స్క‌రించుకొని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ రోజు త‌న నివాసంలో వివిధ వర్గాలకు చెందిన వారితో కలిసి యోగా కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. కోవిడ్-19 మ‌హ‌మ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో సామూహిక సమావేశాలు నిర్వ‌హించ‌డం మంచిది కానందున.. ఈ సంవత్సరం అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని‘యోగా విత్ ఫ్యామిలీ’ అనే ఇతివృత్తంతో చేప‌ట్ట‌డాన్ని మంత్రి సమర్థించారు. ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియా ద్వారా దేశ వ్యాప్తంగా అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని ఆదివారం ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్రజలు ఆన్‌లైన్ ద్వారా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనడానికి వీలుగా సామాజిక మరియు డిజిటల్ మీడియా ప్లాట్‌ఫాంల వినియోగాన్ని ప్రభుత్వం గరిష్టంగా పెంచింది. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా శ్రీ నఖ్వీ స్వయంగా యోగా సాధన చేస్తున్నారు. యోగా అన్ని వయసుల వారికి ప్రయోజనం చేకూరుస్తుందని మంత్రి తెలిపారు. యోగా ఇప్పుడు "ప్రపంచ ఆరోగ్యానికి కిరీటం" గా మారిందని ఆయన అన్నారు. భారతదేశ‌పు వేల సంవత్సరాల పురాతన సంస్కృతి నేడు స‌ర్వ‌ ప్రపంచానికి మరియు ప్రజలకు "ఆరోగ్య వనరుగా" నిరూపితమైంద‌ని చెప్ప‌డానికి గ‌ర్వంగా ఉంద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌స్తుత కాలంలో ఒత్తిడి మరియు కాలుష్యం వల్ల మానవ మనస్సు మరియు శరీరం బాగా ప్రభావితం అవుతున్నాయ‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో యోగా మేటి ఆరోగ్యానికి బంగారు తాళంచెవిగా మారింది అని వివ‌రించారు. "మంచి ఆరోగ్యమే.. నిజమైన సంపద" అని శ్రీ నఖ్వీ అభిప్రాయపడ్డారు.

 

( ఫొటోలుః 6వ‌ అంతర్జాతీయ యోగా దినోత్సవం పుర‌స్క‌రించుకొని ఆదివారం (21వ తేదీన‌) త‌న నివాసంలో వివిధ వర్గాలకు చెందిన వారితో కలిసి యోగా కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్న కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ ముక్తార్ అబ్బాస్ నఖ్వీ)

 

      


(Release ID: 1633176) Visitor Counter : 197