ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఇప్పటి వరకు ప్రధాన మంత్రి గారిబ్ కళ్యాణ్ ప్యాకేజీ పురోగతి
ప్రధాన్ మంత్రి గారిబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద 42 కోట్లకు పైగా పేదలకు రూ.65,454 కోట్ల ఆర్థిక సహాయం
Posted On:
20 JUN 2020 2:17PM by PIB Hyderabad
రూ. 1.70 లక్షల కోట్ల 'ప్రధాన మంత్రి గారిబ్ కళ్యాణ్ ప్యాకేజీ'లో భాగంగా దేశంలోని మహిళలు, పేద సీనియర్ సిటిజన్లు, రైతులకు ఉచిత ఆహార ధాన్యాలు, నగదు చెల్లింపును ప్రభుత్వం ప్రకటించింది. ప్యాకేజీ వేగవంతమైన అమలును కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.
ఇప్పటి వరకు ప్రధాన్ మంత్రి గారిబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద 42 కోట్లకు పైగా పేదలు 65,454 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం పొందారు. పీఎంజీకేపీ యొక్క వివిధ భాగాల క్రింద ఇప్పటివరకు సాధించిన పురోగతి క్రింది విధంగా ఉంది:
- మొదటి విడత పీఎం-కిసాన్ కింద దాదాపు 8.94 కోట్ల మంది లబ్ధిదారులకు చెల్లింపులు జరిపేలా రూ.17,891 కోట్ల నిధులను ఏర్పాటు చేయడమైంది.
- రూ .10,325 కోట్ల మేర నిధులను 20.65 కోట్ల (100%) మహిళా జన్ ధన్ ఖాతాదారుల ఖాతాల్లోకి మొదటి విడతగా జమ చేయడం జరిగింది.
- రూ.10,315 కోట్ల మేర నిధులను 20.62 కోట్ల (100%) మహిళలకు జన్ ధన్ ఖాతాదారులకు రెండవ విడతగా జమ చేయడం జరిగింది.
- మూడవ విడతగా 20.62 కోట్ల (100%) మహిళా జన్ ధన్ ఖాతాదారులకు రూ.10,312 కోట్ల మేర నిధులు జమ అయ్యాయి.
- మొత్తం రూ.2814.5 కోట్ల నిధులు రెండు వాయిదాలలో సుమారు 2.81 కోట్ల వృద్ధులు, వితంతువులు మరియు వికలాంగులకు పంపిణీ చేయబడ్డాయి. రెండు వాయిదాలలో మొత్తం 2.81 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ నిధులు బదిలీ అయ్యాయి.
- 2.3 కోట్ల మంది భవన మరియు నిర్మాణ కార్మికులకు రూ. 4312.82 కోట్ల మేర ఆర్థిక సహాయం లభించింది.
- ఏప్రిల్ మాసానికి గాను ఇప్పటివరకు 113 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు 36 రాష్ట్రాలు / యుటీలకు పంపించడమైంది. 37.01 ఎల్‌ఎమ్‌టీల ఆహార ధాన్యాలు పంపిణీ చేయబడ్డాయి. ఏప్రిల్‌లో దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు / యుటీలు దేశ వ్యాప్తంగా 74.03 కోట్ల మంది లబ్ధిదారులకు ఇవి అందించడం జరిగింది.
-మే 2020 లో 36 రాష్ట్రాలు / యుటీలు 72.83 కోట్ల మంది లబ్ధిదారులను కలుపుకొని మొత్తం 36.42 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలు పంపిణీ చేశారు.
- జూన్ 2020 నాటికి 29 రాష్ట్రాలు / యుటీల ద్వారా 27.18 కోట్ల మంది లబ్ధిదారులను కవర్ చేస్తూ 13.59 ఎల్‌ఎమ్‌టీల ఆహార ధాన్యాలు పంపిణీ చేయబడ్డాయి.
- ఏప్రిల్ నుంచి మూడు నెలలుగా కేటాయించిన 5.8 ఎల్‌ఎమ్‌టీల పప్పు ధాన్యాల్లో, 5.68 ఎల్‌ఎమ్‌టి పప్పుధాన్యాలు వివిధ రాష్ట్రాలు / యుటీలకు పంపించబడ్డాయి. మొత్తం 3.35 ఎల్‌ఎమ్‌టీ పప్పుధాన్యాలు ఇప్పటివరకు 19.3 కోట్ల మంది లబ్ధిదారులలో 16.3 కోట్ల గృహ లబ్ధిదారులకు పంపిణీ చేయబడ్డాయి.
- 28 రాష్ట్రాలు / యుటీలు ఏప్రిల్‌లో 100% పప్పుధాన్యాలు పంపిణీ చేశాయి, 20 రాష్ట్రాలు / యుటీలు పప్పు ధాన్యాల కోసం మే నెలకు 100% పంపిణీని పూర్తి చేశాయి. 7 రాష్ట్రాలు / యుటీలు జూన్ నెలలో 100% పంపిణీని పూర్తి చేశాయి.
-ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం 2 నెలల పాటు ఉచిత ఆహార ధాన్యాలు,శనగల సరఫరాను ప్రకటించింది.
- జూన్ 19, 2020 నాటికి, 6.3 ఎల్‌ఎమ్‌టీ ఆహార ధాన్యాలు 36 రాష్ట్రాలు / యుటీలు పంపడమైంది. 34,074 మెట్రిక్ టన్నుల చనాను కూడా పంపించారు.
- పీఎంయూవై పథకం కింద మొత్తం 8.52 కోట్ల గ్యాస్ సిలిండర్లు బుక్ చేయబడ్డాయి.. ఇవి ఇప్పటికే ఏప్రిల్ మరియు మే మాసాలలో పంపిణీ చేయబడ్డాయి.
- జూన్ నెలలో 2.1 కోట్ల పీఎంయువై సిలిండర్లకు బుకింగ్ లభించగా.. జూన్ మాసానికి గాను 1.87 కోట్ల పీఎంయువై ఉచిత సిలిండర్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.
- ఈపీఎఫ్ఓకు చెందిన 20.22 లక్షల మంది చందాదారులు తిరిగి చెల్లించని అడ్వాన్స్‌ను ఆన్‌లైన్ ఉపసంహరించుకున్నారు. దీని ద్వారా రూ.5767 కోట్ల మేర సొమ్మును లబ్ధిదారులు అందుకున్నారు.
- పెరిగిన రేటు 01-04-2020 నుంచి నోటిఫై చేయబడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 88.73 కోట్ల వ్యక్తి పనిదినాలు సృష్టించబడ్డాయి. ఇంకా, వేతనం మరియు సామగ్రి రెండింటి పెండింగ్ బకాయిలను రద్దు చేయడానికి రాష్ట్రాలకు రూ.36,379 కోట్లు విడుదల చేశారు.
- 24% ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను 65.74 లక్షల ఉద్యోగుల ఖాతాలకు జమ చేయడమైంది. ఈ మొత్తం రూ.996.46 కోట్లుగా నిలిచింది.
- జిల్లా మినరల్ ఫండ్ (డీఎంఎఫ్) కింద 30% నిధులను ఖర్చు చేయాలని రాష్ట్రాలను కోరడమైంది. ఈ మొత్తం రూ.3,787 కోట్లుగా ఉంది. ఇప్పటివరకు ఇందులో రూ.183.65 కోట్లు ఖర్చు చేయడమైంది.
- ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో ఆరోగ్య కార్యకర్తలకు బీమా పథకంను మార్చి 30వ తేదీ నుంచి అమలులోకి తేవడం జరిగింది. న్యూ ఇండియా అష్యూరెన్స్ స్కీమ్ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకాన్ని సెప్టెంబర్ వరకు పొడిగించారు.
ప్రధాన్ మంత్రి గారిబ్ కళ్యాణ్ ప్యాకేజీ
19/06/2020 వరకు మొత్తం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ
పథకం
|
లబ్ధిదారుల సంఖ్య
|
మొత్తం
|
పీఎంజేడీవై మహిళా ఖాతాదారులకు మద్దతు
|
1 వ విడత - 20.65 కోట్లు (100%)
2 వ విడత – 20.63 కోట్లు
3 వ విడత - 20.62 కోట్లు (100%)
|
1 వ కిస్తీ –10,325 కోట్లు
2 వ కిస్తీ - 10,315 కోట్లు
3 వ కిస్తీ –10,312 కోట్లు
|
ఎన్ఎస్ఏపీ కి మద్దతు (వృద్ధ వితంతువులు, దివ్యాంగలు, వయో వృద్దులు)
|
2.81 కోట్లు (100%)
|
2814 కోట్లు
|
పీఎం-కిసాన్ కింద రైతులకు మందస్తుగా చేసిన చెల్లింపులు
|
8.94 కోట్లు
|
17891 కోట్లు
|
భవనం & ఇతర నిర్మాణ కార్మికులకు మద్దతు
|
2.3 కోట్లు
|
4313 కోట్లు
|
ఈపీఎఫ్ఓకు 24% సహకారం
|
.66 కోట్లు
|
996 కోట్లు
|
ఉజ్వలా
|
1 వ విడత - 7.48 కోట్లు
2 వ విడత - 4.48 కోట్లు
|
8488 కోట్లు
|
మొత్తం
|
42.84 కోట్లు
|
65,454 కోట్లు
|
(Release ID: 1633063)
Visitor Counter : 274
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Tamil
,
Kannada