ప్రధాన మంత్రి కార్యాలయం

విశ్వ మహమ్మారి కోవిడ్ -19 వ్యాప్తి వాళ్ళ సొంత ఊళ్లకు తిరిగి వచ్చిన వలస కూలీలకు ఉద్యోగాలను, జీవనోపాధిని పెంచడానికి 2020 జూన్ 20న గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ యోజన ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

సుస్థిరమైన గ్రామీణ మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేయడం మరియు గ్రామాలలో ఇంటర్నెట్ వంటి ఆధునిక సౌకర్యాలను కల్పించడంపై అభియాన్ దృష్టిని కేంద్రీకరిస్తుంది: ప్రధానమంత్రి

ఆయా ప్రాంతాల అవసరాలకు సరితూగే విధంగా గ్రామీణ వలస కూలీల నైపుణ్యాన్ని జతచేయడం ద్వారా వారు ఇంటికి దగ్గరలో పని చేసేలా చూడటం: ప్రధానమంత్రి

దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలలోని 116 జిల్లాల్లో 125 రోజుల పాటు లక్ష్యసిద్ధితో రూ. 50,000 కోట్ల వ్యయంతో అమలు చేసే ప్రాజెక్టు

Posted On: 20 JUN 2020 2:06PM by PIB Hyderabad

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన కోవిడ్ -19 ప్రభావితులై సొంత ఊళ్లకు తిరిగి వస్తున్న గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలను,  వలస కూలీలకు జీవికను పెంచడానికి ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ శనివారం  'గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్' పేరిట ఉద్యమ స్థాయిలో  బ్రహ్మాండమైన ఉద్యోగ కల్పన మరియు గ్రామీణ ప్రజా పనుల కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ కార్యక్రమం ఉద్దేశం తిరిగి వచ్చిన గ్రామీణ వలస కూలీలను సాధికారులను చేయడం.  ఈ కార్యక్రమాన్ని  బీహార్ రాష్ట్రంలోని ఖగారియా జిల్లా బేల్దార్ బ్లాకు తెలిహార్ గ్రామంలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు.  ఈ కార్యక్రమం అమలు చేస్తున్న  ఆరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు,  ప్రతినిధులు,  అనేక మంది కేంద్ర మంత్రులు మరియు ఇతరులు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.

 'గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్' ను  లాంఛనంగా ప్రారంభించిన ఖగారియా జిల్లా తెలిహార్ గ్రామస్థులతో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్సు ద్వారా  ముచ్చటించారు.  
ఇప్పుడు ఏం చేస్తున్నారు, పని దొరికిందా  అని ప్రధానమంత్రి  తిరిగివచ్చిన  వలస కూలీలలో కొందరిని  ప్రశ్నించారు.   అంతే కాక లాక్ డౌన్ సమయంలో ప్రారంభించిన సంక్షేమ పథకాలు  లభ్యమయ్యాయా అని వారిని  అడిగి తెలుసుకున్నారు.  

 

కోవిడ్ -19 పై పోరాటంలో గ్రామీణ భారతం నిబ్బరంగా నిలిచిందని,  వారితో మాట్లాడిన తరువాత తనకు ఎంతో సంతృప్తి కలిగిందని,  ఈ సంక్షోభ సమయంలో గ్రామీణ ప్రాంతాలు మొత్తం దేశానికి మరియు ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని శ్రీ మోదీ అన్నారు.  

పేదలు, వలస కూలీల సంక్షేమం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ పట్టించుకుంటున్నాయని ఆయన అన్నారు.  

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజీ ద్వారా అనేక ప్రోత్సాహకాలతో  ఆత్మ నిర్భర్ భారత్ ప్రచారోద్యమం ప్రారంభించినట్లు ప్రధాని తెలిపారు.  

సొంత ఊరికి వెళ్ళ దలచిన వలస కూలీల కోసం  కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రామిక స్పెషల్ రైళ్లను నడిపాయని కూడా ఆయన తెలిపారు.  

పేదల సంక్షేమానికి, వారి ఉపాధికి ఒక బృహత్తరమైన కార్యక్రమం ప్రారంభించిన ఈ రోజు చారిత్రాత్మకమైనదని ప్రధాని వర్ణించారు.  

బృహత్తర కార్యక్రమం మన కూలీ సోదరులు, సోదరీమణులు,  గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న యువత,  అక్కలు, చెల్లెళ్లు మరియు ఆడబిడ్డలకు అంకితమని ఆయన అన్నారు.  

 

గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్ కింద గ్రామీణ ప్రాంతాలలో దృఢమైన మౌలిక సదుపాయాలను నిర్మించడానికి రూ. 50,000 కోట్లను ఖర్చు చేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.  

వివిధ రకాల అభివృద్ధి పనులను నిర్వహించేందుకు గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కల్పనకు 25 పని ప్రాంతాలను గుర్తించారు.  ఈ 25 పనులు  గ్రామీణ గృహ నిర్మాణం, మొక్కల పెంపకం, జల జీవన్ మిషన్ ద్వారా మంచి నీటి సరఫరా, పంచాయత్ భవనాల నిర్మాణం, సామూహిక మరుగుదొడ్లు, పశువుల కోసం షెడ్ల వంటి మౌలిక వసతులు, అంగన్వాడీ భవనాల మొదలగు  గ్రామాల అవసరాలకు సంబంధించినవి.  

గ్రామీణ ప్రాంతాలలో ఆధునిక సౌకర్యాలను కూడా ఈ అభియాన్ ఆధునీకరిస్తుందని ప్రధాని తెలిపారు. యువత, పిల్లలకు సహాయ పడేందుకు గ్రామీణ కుటుంబాలకు చౌకలో   వేగవంతమైన ఇంటర్నెట్ అందించాల్సిన  అవసరం ఉందని అన్నారు.   మున్నెన్నడూ లేని విధంగా ఇప్పుడు పట్టణ ప్రాంతాల కన్నా ఎక్కువగా పల్లెల్లో ఇంటర్నెట్ వాడుతున్నారని ప్రధానమంత్రి వెల్లడించారు.  అందువల్ల ఫైబర్ కేబుళ్లు వేయడం,  ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం అభియాన్ లో  భాగంగా చేశామన్నారు.  

ఈ పనులను గ్రామీణులు తన సొంత వూళ్ళో ఉంటూ,  తమ కుటుంబంతో గడుపుతూ పూర్తి చేయవచ్చు.  

స్వయం సమృద్ధ భారత్ (ఆత్మ నిర్భర్) కోసం స్వయం సమృద్ధ రైతులు అంతే అవసరం అని ప్రధాన మంత్రి అన్నారు.   రైతులు తమ పంటను నచ్చిన చోట, మెచ్చిన ధరకు అమ్ముకునే విధంగా వర్తకులతో సంబంధాలు ఏర్పాటు చేసుకునేందుకు అన్ని నియంత్రణలు అవరోధాలు  తొలగించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుందని, తద్వారా రైతులకు మార్గం సుగమమైందని అన్నారు.   

 

రైతులకు మార్కెట్లతో నేరుగా సంబంధాలు ఏర్పడటమే కాక వ్యవసాయ క్షేత్రానికి,  మార్కెట్ కు మధ్య సంధాన సౌకర్యం కలుగుతుందని అన్నారు.  కోల్డ్ స్టోరేజీల వంటి సంధానాల కల్పనకు ప్రభుత్వం  లక్ష కోట్ల రూపాయల పెట్టుబడిని సమకూర్చింది.    

 

ఉద్యమ సరళిలో 125 రోజుల పాటు సాగే ఈ అభియాన్ మిషన్ మోడ్ లో పని చేస్తుంది.  వలస కూలీలు ఎక్కువగా తిరిగి వచ్చిన  ఆరు రాష్ట్రాలలోని 116 జిల్లాలలో 25 రకాల పనులను అమలు చేస్తారు.   ఆ ఆరు రాష్ట్రాలు బీహార్, ఉత్తరప్రదేశ్,  మధ్య ప్రదేశ్,  రాజస్థాన్, ఝార్ఖండ్ మరియు ఒడిశా.   ఈ అభియాన్ కింద చేపట్టే పనుల కోసం రూ. 50,000 కోట్ల వనరులను ప్రభుత్వం సమకూరుస్తుంది.   

 

ఈ అభియాన్ 12 వివిధ మంత్రిత్వ శాఖలు / శాఖలు ఏకాభిముఖంగా పనిచేసే కార్యక్రమం.  అవి:  గ్రామీణాభివృద్ధి, పంచాయతి రాజ్, రోడ్డు రవాణా మరియు రహదారులు,  గనులు, మంచి నీటి సరఫరా & పారిశుద్ధ్యం, పర్యావరణం, రైల్వేలు, పెట్రోలియం  &  సహజ వాయువు,  కొత్త మరియు అక్షయ ఇంధనం,  సరిహద్దు రోడ్లు,  టెలికాం & వ్యవసాయం శాఖలు  25 ప్రజా మౌలిక సదుపాయాల పనులను మరియు  జీవనోపాధి పెంచే అవకాశాలను పెంచే పనులు చేస్తాయి.  

ఈ యత్నం ద్వారా సాధించనున్న ప్రధాన లక్ష్యాలు:   సొంత ఊళ్లకు తిరిగి వస్తున్న వలస కూలీలకు మరియు గ్రామీణులకు  జీవనోపాధి అవకాశాలు కల్పించడం.  
రోడ్లు, గృహాలు, అంగన్వాడీలు, పంచాయత్ భవనాలు, జీవనోపాధికి తోడ్పడే వివిధ రకాల ఆస్తులు మరియు సామాజిక భవనాల నిర్మాణం ద్వారా ప్రజా మౌలిక సదుపాయాలతో గ్రామాలను నింపివేస్తారు.

వివిధ రకాల పనులను ఒకే సారి ప్రారంభించడం వల్ల రానున్న  125 రోజుల్లో ప్రతి వలస కూలీలకు వారి నైపుణ్యానికి సరిపడే పని దొరికే అవకాశాము ఉంటుంది.  అంతేకాక దీర్ఘ కాలంలో జీవనోపాధి విస్తరణ మరియు అభివృద్ధికి ఈ  కార్యక్రమం సిద్ధం చేస్తుంది.

ఈ కార్యక్రమానికి గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కేంద్రకంగా ఉంటుంది.   రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి సమన్వయంతో  నిర్వహిస్తారు.  ఎంపిక చేసిన జిల్లాలలో ఈ కార్యక్రమం అమలు జరుగుతున్న తీరును పర్యవేక్షించడానికి జాయింట్ సెక్రెటరీ స్థాయి అధికారిని సెంట్రల్ నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తారు.  

గ్రామీణ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్  అమలు చేసే రాష్ట్రాల జాబితా

 

క్రమ సంఖ్య

రాష్ట్రం పేరు

జిల్లాలు

ఆకాంక్షగల జిల్లాలు

1

బీహార్

32

12

2

ఉత్తరప్రదేశ్

31

5

3

మధ్యప్రదేశ్

24

4

4

రాజస్థాన్

22

2

5

ఒడిశా

4

1

6

ఝార్ఖండ్

3

3

మొత్తం జిల్లాలు

116

27
ఈ కార్యక్రమం కింద ప్రాధాన్యత క్రమంలో చేపట్టే 25  పనులు,  కార్యకలాపాల జాబితా పట్టిక
 

 

క్రమ సంఖ్య.

పని / కార్యకలాపం

క్రమ సంఖ్య

పని / కార్యకలాపం

1

సామాజిక పారిశుద్ధ్య కేంద్రం (సి ఎస్ సి)

14

పశువుల కొట్టాల నిర్మాణం

2

గ్రామ పంచాయత్ భవనాల నిర్మాణం

15

కోళ్ల ఫారాల నిర్మాణం

3

14వ ఆర్ధిక కమిషన్ నిధుల కింద చేపట్టే పనులు

16

మేకల షెడ్ల నిర్మాణం

4

జాతీయ రహదారి పనుల నిర్మాణం

17

వానపాముల తయారీకి నిర్మాణాల ఏర్పాటు

5

జల సంరక్షణ మరియు సంగ్రహణ పనులు

18

రైల్వేలు

6

బావుల నిర్మాణం

19

రూర్బన్

7

మొక్కల పెంపకం పనులు

20

పి ఎం కుసుమ్

8

ఉద్యాన వనాల పెంపకం

21

భారత్ నెట్

9

అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం

22

కంపా ప్లాంటేషన్

10

గ్రామీణ గృహ నిర్మాణ పనులు

23

పి ఎం ఊర్జా గంగ ప్రాజెక్ట్

11

గ్రామీణ సంధాయకత పనులు

24

జీవిక కోసం కృషి విజ్ఞాన కేంద్రాల శిక్షణ

12

ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణ పనులు

25

జిల్లా ఖనిజ సంస్థ ట్రస్ట్ పనులు

13

వ్యవసాయ క్షేత్రాలలో కుంటల నిర్మాణం

 

 

******(Release ID: 1633002) Visitor Counter : 336