ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 తాజా సమాచారం
ఇప్పటివరకు కోవిడ్ నుంచి కోలుకున్నవారు 2,13,830 మంది
కోలుకున్నశాతం 54.13
Posted On:
20 JUN 2020 3:35PM by PIB Hyderabad
గడిచిన 24 గంటల్లో మొత్తం 9,120 మంది కోవిడ్-19 బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 2,13,830 కు చేరింది. బాధితులలో కోలుకున్నవారి శాతం 54.13% గా నమోదైంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,68,269 . వీరందరికీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది
కరోనా వైరస్ సోకిన వారిని పరీక్షించేందుకు పరీక్షల సామర్థ్యాన్ని భారతీయ వైద్య పరిశోధనామండలి (ఐసిఎంఆర్) పెంచుతూ వస్తోంది. ప్రభుత్వ లేబరేటరీల సంఖ్య ఇప్పుడు 715 కి చేరుకోగా ప్రైవేట్ లాబ్స్ సంఖ్య 259 కి పెరిగింది. దీంతో మొత్తం లాబ్స్ సంఖ్య 974 అయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
తక్షణం ఫలితాలు చూపే పరీక్షల లాబ్స్ : 543 (ప్రభుత్వ: 350 + ప్రైవేట్: 193)
ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 356 (ప్రభుత్వ: 338 + ప్రైవేట్: 18)
సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 75 (ప్రభుత్వ: 27 + ప్రైవేట్: 48)
గడిచిన 24 గంటల్లో 1,89,869 శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటివరకు మొత్తం పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 66,16,496.కు చేరింది.
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి.
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf చూడండి.
(Release ID: 1632917)
Visitor Counter : 218
Read this release in:
Punjabi
,
English
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam