పర్యటక మంత్రిత్వ శాఖ

పర్యాటక మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా వారం రోజుల పాటు ఉత్సవాల నిర్వహణ

"యోగా @ హోమ్ & యోగా విత్ ఫ్యామిలీ" అనే కేంద్ర ఇతివృత్తం కింద సోషల్ మీడియా కార్యకలాపాలు ప్రారంభం

పర్యాటక మంత్రి 2020 జూన్ 20 న దేఖో అప్నా దేశ్ వెబ్నార్ ఆధ్వర్యంలో 'భారత్: ఎ కల్చరల్ ట్రెజర్' పేరుతో
ప్రత్యేక సమావేశంలో పాల్గొననున్నారు.

Posted On: 19 JUN 2020 1:40PM by PIB Hyderabad
పర్యాటక మంత్రిత్వ శాఖ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవం 2020  వారం రోజుల ఉత్సవాలను జూన్ 15 న దేశవ్యాప్తంగా తన ప్రాంతీయ కార్యాలయాలు ప్రారంభించింది.  సోషల్ మీడియా కార్యకలాపాలను కేంద్ర ఇతివృత్తం “ ఇంటి వద్ద యోగా - కుటుంబంతో యోగా ” తో ప్రారంభించారు . లాక్డౌన్ సమయంలో ఆరోగ్యకరమైన మనస్సు, శరీరం స్వీయ-చేతన స్థితిని నడిపించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యకలాపాలు రూపొందించారు.  వర్చువల్ మాధ్యమం ద్వారా కార్యకలాపాలు అందుబాటులోకి వచ్చాయి.
 

ఈ వేడుకల యొక్క ముఖ్యాంశం పర్యాటక మంత్రిత్వశాఖ 20 జూన్ 2020 న నిర్వహించే దేఖో అప్నా దేశ్ వెబినార్ లో పర్యాటక మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ హాజరవుతారు, సద్గురు జగ్గీ వాసుదేవ్ జితో సంభాషణ ఉంటుంది. 'భారత్: ఎ కల్చరల్ ట్రెజర్' పేరుతో ఈ సెషన్ 2020 జూన్ 20 న మధ్యాహ్నం 2-3 గంటల  మధ్య జరుగుతుంది. శ్రీ ప్రహ్లాద్ సింగ్ పాటెల్ నేతృత్వం వహించే సంభాషణ కార్యక్రమంలో 5 మంది ప్రఖ్యాత ప్యానెలిస్టుల నుండి పాల్గొనవచ్చు, వారు  శ్రీ అజయ్ సింగ్, సిఎండి, స్పైస్ జెట్; శ్రీ రితేష్ అగర్వాల్, ఓయో; శ్రీమతి అనితా డోంగ్రే, ఫ్యాషన్ డిజైనర్; శ్రీ రణవీర్ బ్రార్, సెలబ్రిటీ చెఫ్; శ్రీమతి రంజు అలెక్స్, వైస్ ప్రెసిడెంట్ - మారియట్ మార్కెటింగ్. దేఖో అప్నా దేశ్ వెబ్నార్ సిరీస్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద భారతదేశం గొప్ప వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నమిది. ఈ సెషన్ ఇన్క్రెడిబుల్ ఇండియా సామజిక మాధ్యమాల హ్యాండిల్స్ లో ఉంటుంది.  facebook.com/incredibleindia/ and Youtube.com/incredibleindia

 

యోగ - వెల్ నెస్ ఆధారంగా ఇంకా దేఖో అప్నా దేశ్ వెబినార్ ల కు ప్రణాళిక :

19/06/2020 – 1100-1200 గంటలకు  – యోగ-వెల్ నెస్ – యోగా గురు భారత్ ఠాకూర్ - ఇంటర్నేషనల్ యోగా ప్రాక్టీషనర్ & ఆధ్యాత్మిక మాస్టర్, డాక్టర్ చిన్మయ్ పాండ్యా - ప్రో వైస్ ఛాన్సలర్ - దేవ్ సంస్కృత విశ్వవిద్యాలయ, డాక్టర్ లక్ష్మీనారాయణ్ జోషి - నాడి విజ్ఞాన్, యోగా థెరపీ మరియు హీలింగ్ సైన్సెస్ నిపుణులు సమర్పిస్తారు.

20/06/2020 – 1400-1500 గంటలకు  – "భారత్ - సుసంపన్నమైన ఒక సంస్కృతి" పేరుతో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి (ఇంచార్జి) శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ అయిదుగురు పృముఖ వ్యక్తులతో కలిపి వెబినార్ లో పాల్గొంటారు.  

21/06/2020 – 1100-1200 గంటలకు  – యోగా గమ్యస్థానంగా భారతదేశం అనే అంశాన్ని సమర్పించేది: శ్రీ అచల్ మెహ్రా - సీఈఓ, గ్రీన్వే (ఒక సామాజిక ప్రభావ సంస్థ), వ్యవస్థాపకుడు - మహువా వాన్ రిసార్ట్, పెంచ్ & సహ వ్యవస్థాపకుడు - ముంబైలోని యోగాహౌస్

ఇన్క్రెడిబుల్ ఇండియా సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా కుటుంబాలతో యోగా సాధన చేసే యోగా ఔత్సాహికులతో సహకరించడం. రోజువారీ పోస్ట్‌లలో చిత్రాలు లేదా వీడియోల ద్వారా వారి నిజ జీవిత అనువర్తనాలతో విభిన్న ఆసనాలు ఒకే రోజు ఉంటుంది. మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్‌లో ఎంగేజ్‌మెంట్ కార్యకలాపాలను కూడా నిర్వహిస్తోంది, ఇక్కడ ప్రజలు తమ చిత్రాలను పంచుకోవచ్చు మరియు క్విజ్‌లకు సమాధానం ఇవ్వవచ్చు. ఈ వారంలో యోగా ఔత్సాహికుల నుండి కొన్ని ప్రత్యక్ష సెషన్‌లు కూడా ఉంటాయి. ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న 'మై లైఫ్ మై యోగా' ద్వారా పోటీకి ప్రోత్సహిస్తోంది, ఇంట్లో, వారి కుటుంబాలతో కలిసి యోగా చేస్తున్న సాధారణ వ్యక్తులపై వీడియోను కూడా ప్రచురిస్తుంది.

దేశంలో దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి సాంకేతిక సహాయంతో పౌరుల మధ్య భాగస్వామ్యాన్ని నిర్మించడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ మైగోవ్‌తో చురుకుగా సహకరిస్తోంది. ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మీటీవై) ఏర్పాటు చేసిన నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (నెజిడి) చేత దేఖో అప్నా దేఖ్ వెబినార్ లకు  చురుకుగా మద్దతు ఇస్తున్నాయి.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పర్యాటక మంత్రిత్వ శాఖ చేసిన ప్రయత్నం భారతదేశ యోగా, వెల్నెస్ టూరిజం  గొప్ప వారసత్వాన్ని సూచిస్తుంది.

 

****


(Release ID: 1632774) Visitor Counter : 140