రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

లడఖ్‌లో సరిహద్దు పరిస్థితిని సీడీఎస్, త్రివిధ ద‌ళాధిప‌తుల‌తో సమీక్షించిన ర‌క్ష‌ణ‌ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్

Posted On: 17 JUN 2020 3:23PM by PIB Hyderabad

కేంద్ర ర‌క్ష‌ణ శాఖ‌ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ ఈ రోజు ఉదయం లడ‌ఖ్‌లో సరిహద్దు పరిస్థితిని సమీక్షించారు. సౌత్ బ్లాక్‌లో జ‌రిగిన ఈ స‌మావేశానికి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్, మిలిటరీ వ్యవహారాల కార్యదర్శి జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నారావణే, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌.కె.ఎస్ భదౌరియాలు పాల్గొన్నారు. ఈ స‌మావేశం అనంత‌రం మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఒక ట్వీట్‌ను విడుద‌ల చేస్తూ సరిహద్దు ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన సైనికు‌లకు త‌న ప్ర‌గాఢ‌ సంతాపం వ్యక్తం చేశారు. “గాల్వన్‌లో సైనికులను కోల్పోవడం తీవ్ర మనోవేదన మరియు బాధాకరమైన విష‌యం" అని అన్నారు. మన సైనికులు విధి నిర్వహణలో ఆదర్శప్రాయమైన ధైర్యం మరియు శౌర్యాన్ని ప్రదర్శించారు మరియు భారత సైన్యం యొక్క అత్యున్నత సంప్రదాయాలలో తమ ప్రాణాలను త్యాగం చేశారు అని పేర్కొన్నారు. "దేశం వారి ధైర్యాన్ని మరియు త్యాగాన్ని ఎప్పటికీ మరచిపోదు" అని అన్నారు. వీర మ‌ర‌ణం పొందిన భార‌త సైనికుల కుటుంబాలకు
నా హృదయ పూర్వ‌క సంతాపాన్ని తెలియ‌జేస్తున్నా. ఈ క‌ష్ట‌కాలంలో జాతి వారికి త‌గిన చేయూత‌నిస్తూ బాస‌ట‌గా నిలుస్తుంది. భారతదేశపు దైర్య‌వంతులైన‌ సైనికులు క‌న‌బ‌రిచిన ధైర్యం మరియు సాహ‌సం చూసి మేము గర్విస్తున్నాము."



(Release ID: 1632094) Visitor Counter : 212