ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 తాజా స‌మాచారం

52.47 శాతానికి మెరుగుపడిన కోవిడ్-19 రికవరీ రేటు

- కోవిడ్-19 సంబంధిత కళంకాలను ఎదుర్కొనేందుకు గాను ఒక‌ గైడ్‌ను విడుదల చేసిన
ఎంఓహెచ్ఎఫ్‌డ‌బ్ల్యూ

Posted On: 16 JUN 2020 2:15PM by PIB Hyderabad

గ‌డిచిన‌ 24 గంటల్లో 10,215 మంది కోవిడ్-19 రోగులు వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,80,012 మంది రోగులు ఈ కోవిడ్ -19 నుంచి కోలుకున్న‌ట్ట‌యింది. రికవరీ రేటు 52.47 శాతానికి పెరిగింది. కోవిడ్‌-19 బారిన ప‌డిన వారిలో దాదాపు స‌గం కంటే కూడా ఎక్కువ మంది రోగులు ఈ వ్యాధి నుండి కోలుకున్నార‌నే విషయాన్ని ఇది సూచిస్తుంది. ప్రస్తుతం 1,53,178 క్రియాశీల కేసులు వైద్య పర్యవేక్షణలో వైద్య సేవ‌లో ఉన్నాయి.

కోవిడ్‌-19 బారిన పడిన ప్రజలు ఎదుర్కొంటున్న కళంకం యొక్క సమస్యను పరిష్కరించడానికి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్ఎఫ్‌డ‌బ్ల్యూ) ఒక వివరణాత్మక గైడ్‌ను విడుదల చేసింది. కోవిడ్‌-19 నుండి కోలుకున్న రోగులు, ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ ప్రొవైడర్లు, వారి కుటుంబాలు వారి వివ‌ర‌ణ‌తో దీనిని రూపొందించారు. ఈ గైడ్‌ను      
https://www.mohfw.gov.in/pdf/GuidetoaddressstigmaassociatedwithCOVID19.pdf అనే వెబ్‌సైట్ నుంచి పొంద‌వ‌చ్చే.

కోవిడ్‌-19 సంబంధిత ఇత‌ర సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు మ‌రియు సలహాలో పాటుగా అన్ని ప్రామాణికమైన మరియు నవీకరించబడిన సమాచారం కోసం దయచేసి క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ and @MoHFW_INDIA అనే వెబ్‌సైట్‌ను చూడగ‌ల‌రు.

కోవిడ్‌-19 కి సంబంధించిన సాంకేతిక సంబంధిత ప్రశ్నల్ని technquery.covid19[at]gov[dot]in మరియు ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in మరియు ovCovidIndiaSeva కు  పంపవచ్చు.

కోవిడ్‌-19కు సంబంధించి ఏవైనా ప్రశ్నలు ఉంటే, దయచేసి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ నెం.: + 91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) పోన్‌కాల్ చేయండి. కోవిడ్‌-19కు సంబంధించి రాష్ట్రాలు / ‌కేంద్రపాలిత ప్రాంతాల‌లోని హెల్ప్‌లైన్ సంఖ్యల జాబితా https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf
అనే లింక్‌లో అందుబాటులో ఉంది.

***



(Release ID: 1631918) Visitor Counter : 160