సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన ఎడిఐపి పథకం కింద తొలిసారిగా సహాయ పరికరాలు, ఉపకరణాల పంపిణీ
ప్రస్తుత సంక్షోభ సమయంలో లక్షిత లబ్దిదారులకు సహాయ పరికరాలు సకాలంలో అందుబాటులో ఉండేందుకు మరిన్ని వర్చువల్ ఎడిఐపి క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుంది.--- శ్రీ తావర్‌చంద్ గెహ్లాట్
Posted On:
15 JUN 2020 2:01PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితులలో దివ్యాంగులకు సంబంధించి సంక్షేమ పథకాలు ఏమాత్రం అంతరాయం లేకుండా అందడానికి భారతప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ఈ ప్రయత్నంలో భాగంగా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లా తల్వండి భాయి బ్లాక్‌లో ఎడిఐపి పథకం కింద భారత ప్రభుత్వం దివ్యాంగులకు సహాయ పరికరాల పంపిణీకి వర్చువల్ ఎడిఐపి క్యాంప్‌ను నిర్వహించింది. ఎ ఎల్ ఐ ఎం సి ఒ , సామాజిక న్యాయం ,సాధికారత మంత్రిత్వశాఖ కిందగల డిఇపిడబ్ల్యుడి, భారత ప్రభుత్వ ఎడిఐపి పథకం కింద నిర్వహించిన తొలి క్యాంప్. లాక్‌డౌన్ ఎత్తివేసిన అనంతరం భారత ప్రభుత్వం ఆమోదించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం దీనిని నిర్వహించారు.
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి శ్రీ తావర్‌చంద్ గెహ్లాట్ ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ ద్వారా ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. డిఇపిడబ్ల్యుడి కార్యదర్శి శ్రీమతి శంకుతల డి గామ్‌లిన్, డిఇపిడబ్ల్యుడి సంయుక్త కార్యదర్శి శ్రీ ప్రబోథ్ సేథ్, ఎఎల్ఐఎంసిఒ సిఎండి డి.ఆర్.శరీన్‌లు వీడియో లింక్‌ద్వారా పాల్గొన్నారు. ఫిరోజ్‌పూర్ రూరల్ ఎమ్మెల్యే శ్రీమతి శత్కార్ కౌర్, ఫిరోజ్‌పూర్ జిల్లా కలెక్టర్ శ్రీ కుల్వంత్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
శ్రీ తారాచంద్ గెహ్లాట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సమర్థనాయకత్వంలో మనదేశంలో వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని అన్నారు. కోవిడ్ -19ను దృష్టిలో ఉంచుకుని ఎడిఐపి వర్చువల్ క్యాంపులను నిర్వహించాలని సామాజిక న్యాయం,సాధికారతా మంత్రిత్వశాఖ నిర్ణయించిందన్నారు. దివ్యాంగులకు సహాయక పరికరాలు, ఉపకరణాలు పంపిణీచేసేందుకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. దేశంలో నిర్వహించిన ఎడిఐపి క్యాంపుల సందర్బంగా ఇప్పటివరకు 10 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ను నెలకొల్పడం జరిగింది.దివ్యాంగులైన విద్యార్థులు స్వావలంబన సాధించడానికి, ఉన్నత విద్య చదవడం కోసం తమ మంత్రిత్వశాఖ ఆర్థిక సహాయం , స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. దివ్యాంగులకు ప్రత్యేక గుర్తింపు కార్డుల కోసం దివ్యాంగులు, వారి తల్లిదండ్రులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ఇవి దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 31 లక్షల ప్రత్యేక ఐడి కార్డులు దివ్యాంగులకు పంపిణీ చేసినట్టు మంత్రి చెప్పారు.
ఫిరోజ్‌పూర్ రూరల్ ఎమ్మెల్యే శ్రీమతి శత్కార్ కౌర్ మాట్లాడుతూ, దివ్యాంగులకు ఇలాంటి ఉపయోగకరమైన కార్యక్రమాలను సామాజిక న్యాయం, సాధికారతా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో ప్రస్తుత కీలక సమయంలో ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆమె అభినందనలు తెలిపారు. మోటారుతో నడిచే ట్రైసైకిల్ పొందడానికి ప్రస్తుతం ఉన్న అర్హతా నిబంధనలను సవరించాలని ,మరింత మంది దివ్యాంగులకు అందేట్టు చూడాలని ఆమె కోరారు.
శ్రీమతి శకుంతలా డి గామ్లిన్ మాట్లాడుతూ,సామాజిక న్యాయం,సాధికార మంత్రిత్వశాఖకు చెందిన డిఇపిడబ్ల్యుడి, దేశవ్యాప్తంగా ఇలాంటి వర్చువల్ ఎడిఐపి క్యాంపులు నిర్వహించడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఒపి)ని అభివృద్ధి చేసిందని ఆయన చెప్పారు. ఆరోగ్యం , వ్యక్తిగత రక్షణకు సంబంధించి ముందస్తు కఠిన చర్యలు అమలు చేయడం జరుగుతోందని అన్నారు. దివ్యాంగులకు సహాయకారిగా ఉండే వస్తువులు, ఉపకరణాలను పంపిణీ చేసే సమయంలో కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవలసిన అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నట్టు చెప్పారు.
తల్వాండి బ్లాక్‌కు చెందిన 95 మంది లబ్దిదారులకు 12 లక్షల రూపాయల విలువ చేసే వివిధ కేటగిరీల 166 సహాయ పరికరాలను పంపిణీ చేశారు. 11 మోటరైజ్‌డ్ ట్రైసైకిళ్లను కూడా ఈ క్యాంప్ లో లబ్దిదారులకు పంపిణీ చేశారు. అయితే ఫిరోజ్‌పూర్ జిల్లాలోని మొత్తం 962 మంది లబ్ది దారులకు కోటీ 50 లక్షల రూపాయల విలువగల 1667 సహాయ పరికరాలను సమకూర్చడం జరుగుతోంది. ఫిరోజ్‌పూర్ లోని 6 బ్లాక్‌లలో 2020 జూన్ 20 నుంచి పంపిణీ ప్రారంభం కానుంది.
పంజాబ్ లోని ఫిరోజ్‌పూర్ జిల్లా తల్వాండి భాయ్‌లో జరిగిన క్యాంప్ ఎఎల్ఐఎంసిఒ వర్చువల్ పద్దతిలో వికేంద్రీకృత విధానంలో నిర్వహించిన తొలి క్యాంప్. దీని విజయం ఆధారంగా ఇలాంటి క్యాంప్‌లు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఫలితంగా సకాలంలో ప్రస్తుత సంక్షోభ సమయంలో దివ్యాంగులకు తగిన సహాయం అందుతుంది. ఈ క్యాంప్‌ను ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఎల్ఐఎంసిఒ) కాన్పూర్ నిర్వహించింది.. ఇది భారత ప్రభుత్వానికి చెందిన సామాజిక న్యాయం, సాధికార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని డిపార్టమెంట్ ఆఫ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజెబిలిటీ (డిఇపిడబ్ల్యుడి), కింద పనిచేస్తుంది. ఫిరోజ్‌పూర్ జిల్లా పాలనాయంత్రాంగం సహకారంతో దీనిని నిర్వహించారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ప్రతి వ్యక్తి కి థర్మల్ స్క్రీనింగ్, తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరింపచేయడం, శానిటైజర్ వినియోగం, చేతికి తొడుగులు వాడడం, ప్రొఫెషనల్స్ కు పిపిఇ కిట్‌లు వాడడం వంటి చర్యలను తీసుకుని లబ్ధిదారులకు ఉపకరణాలు అందజేయడం జరిగింది. దీనవల్ల దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని శానిటైజ్ చేయడం, ప్రజలు చేతితో తాకిన ప్రాంతాలను , ఉపకరణాలను శానిటైజ్ చేయడం జరిగింది. ఉపకరణాలను డిస్పాచ్ చేయడానికి ముందు శానిటైజ్ చేయడం, రవాణా వాహనాలను శానిటైజ్ చేయడం, పంపిణీకి ముందు మళ్ళీ ఉపకరణాలను శానిటైజ్ చేయడం వంటి బహుళ విధ శానిటైజేషన్ పద్ధతులను చేపట్టడం జరిగింది.ఫిట్టింగ్ కు సన్నిహిత కాంటాక్ట్ అవసరమైన ఉపకరణాలను ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో పంపిణీ చేయలేదు.
లబ్ధిదారులు ,వారి సహాయకులు, సమావేశానికి హాజరైన వారు సామాజిక దూరం పాటించే విధంగా సీటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే లబ్ధిదారులను వారి వంతు వచ్చినపుడు వచ్చే విధంగా దశలవారీగా వారికి సమయాన్ని కేటాయించడం జరిగింది. ప్రతి టైమ్ స్లాట్ బ్యాచ్‌కు 40 మంది వంతున లబ్ధిదారులకు సమయం కేటాయించడం జరిగింది. కార్యక్రమానికి వచ్చిన వారి మధ్య దూరం ఉండేలాగ ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు వేరు వేరుగా ఏర్పాటు చేయడం జరిగింది.
తల్వాండి భాయ్ బ్లాక్లో పంపిణీ చేసిన సహాయ పరికరాలు, ఉపకరణాలలో 11 మోటరైజ్‌డ్ ట్రై సైకిళ్ళు, 19 ట్రై సైకిళ్లు, 21 వీల్ ఛెయిర్‌లు, 4 సిపి చెయిర్‌లు, 32 క్రచ్‌లు, 15 వాకింగ్ స్టిక్ లు,14 స్మార్ట్ కేన్‌లు, 12 స్మార్ట్‌ఫోన్‌లు, 01 డైసీ ప్లేయర్, 4 రోలటార్, 18 వినికిడి మిషన్లు, 12 ఎంఎస్ ఇడి కిట్‌లు ,4 కృత్రిమ అవయవాలు, కాలిపర్స్ ఉన్నాయి. ఈ క్యాంప్‌లో మొత్తం 200 మోటరైజ్‌డ్ ట్రై సైకిళ్ళు పంపిణీ చేయడం జరిగింది. ఒక్కొక్క మోటరైజ్‌డ్ ట్రైసైకిల్ ఖరీదు 37 వేల రూపాయలు. అర్హులైన లబ్ధిదారులు భారత ప్రభుత్వానికి చెందిన ఎడిఐపి పథకం కింద సబ్సిడీగా 25 వేల రూపాయల మద్దతు పొందుతారు. ఒక్కొక్క మోటరైజ్‌డ్ ట్రైసికిల్‌కు చెల్లించాల్సిన మిగిలిన 12 వేల రూపాయలను ఫిరజో్ పూర్‌జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ భరిస్తుంది.
ఫిరోజ్ పూర్‌జిల్లాలో బ్లాక్ ల వారీగా దివ్యాంగులకు ఈ కింది కేటగిరీల సహాయ పరికరాలు, ఉపకరణాలను పంపిణీ చేయడం జరిగింది. వాటి వివరాలు కింది విధంగా ఉన్నాయి.
• మోటరైజ్‌డ్ ట్రైసికిళ్లు - 200
• ట్రైసైకిళ్లు - 239
• వీల్‌ఛెయిర్ - 194
• సి.పి.ఛెయిర్ - 23
• క్రచెస్ - 394
• వాకింగ్ స్టిక్స్ - 108
• స్మార్ట్ కేన్ - 76
• స్మార్ట్ ఫోన్ - 51
• డైసీప్లేయర్ -17
• బ్రెయిలీ కిట్ - 03
• రోలటోర్ -21
• వినికిడి పరికరాలు - 226
• ఎంఎస్ఐఇడి కిట్ - 98
• కృత్రిమ అవయవాలు, కాలిపర్స్ - 17
*****
(Release ID: 1631712)
Visitor Counter : 335