బొగ్గు మంత్రిత్వ శాఖ

బొగ్గు శక్తిని చాటే ప్రయత్నం:

ఆత్మ నిర్భర్ భారత్ కు కొత్త ఆశలు

వాణిజ్యపరంగా బొగ్గు తవ్వకాలకు జూన్ 18న వేలం

Posted On: 11 JUN 2020 6:31PM by PIB Hyderabad

వాణిజ్యపరంగా బొగ్గు తవ్వకాలకు వీలు కల్పిస్తూ  భారత ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేయాలని నిర్ణయించింది. " బొగ్గు శక్తిని చాటే ప్రయత్నం: ఆత్మ నిర్భర్ భారత్ కు కొత్త ఆశలు " అనే ఆలోచన ప్రాతిపదికన 2020 జూన్ 18న వేలం జరుగుతుంది. న్యూ ఢిల్లీలో వర్చువల్ విధానంలో జరిగే ఈ కార్యక్రమానికి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారు.

దేశంలో మొట్టమొదటిసారిగా వాణిజ్యపరమైన తవ్వకాలకు వీలు కల్పిస్తూ బొగ్గు గనులను జూన్ 18న వేలం ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి శ్రీ నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. బొగ్గు రంగంలో ఆత్మ నిర్భర్ భారత్ ను సాకారం చేయాలనుకోవటం ఆయన దార్శనికతకు, మార్గదర్శకానికి నిదర్శనం. దీన్ని సాధించటానికి మేం సిద్ధంగా ఉన్నామని గర్వంగా చెబుతున్నాం" అని కేంద్ర బొగ్గు, గనుల శాఖామంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఈరోజు ట్వీట్ చేశారు.

ఆంక్షలను ఛేదించుకొని భారతీయ బొగ్గు రంగం స్వేచ్ఛ పొందటం, సరికొత్త ఎదుగుదల దిశలో అడుగేయటం ఒక చరిత్రాత్ర్మక ఘట్టం.

దార్శనికుడు, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటంలో దిట్ట అయిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఇటీవలే ఆత్మనిర్భర్ భారత్ ను నినాదంగా తీసుకున్న తరుణంలో బొగ్గు, గనుల త్రవ్వకం రంగం కూడా సంసిద్ధమై ఈ రంగంలో స్వావలంబన దిశలో సంస్కరణలకు పూనుకుంది.

గతంలో ఉన్న ఆంక్షలకు భిన్నంగా వాణిజ్యపరమైన బొగ్గు తవ్వకాలకు వీలుకల్పించటమన్నది చరిత్రాత్మకం. వాడకం, ధర వంటి విషయాల్లో గతంలో ఉన్న ఆంక్షలేవీ ఇప్పుడు ఉండవు. కొత్త కంపెనీలు సైతం వేలం లో పాల్గొనటానికి వీలుగా వేలం నిబంధనలు సరళతరం అయ్యాయి. ముందుగా చెల్లించాల్సిన మొత్తం, ఆ మొత్తాన్ని రాయల్టీలో సర్దుబాటు చేయటం, వాడకంలోకి తీసుకురావటానికి విధించే నిబంధనల సడలింపు, పారదర్శకమైన వేలం విధానం పాటించబోతున్నారు. నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆటోమేటిక్ రూట్ ద్వారా అవకాశం కల్పించటం, ఆర్థిక నియమ నిబంధనలు అర్థవంతంగా ఉండటం, జాతీయ బొగ్గు సూచీ ఆధారంగా ఆదాయ పంపిణీ నమూనా రూపకల్పన దీని ప్రత్యేకతలుగా ఉంటాయి. గతంలో అమలు చేసిన విధానాలకు భిన్నంగా ఇప్పుడు వేగంగా బొగ్గు తవ్వకం జరిపినవారికి ప్రత్యేక ప్రోత్సాహకాలుంటాయి.

 అదనపు బొగ్గు ఉత్పత్తికి ఈ వేలం దోహదం చేస్తుంది. దేశానికి ఇంధనపు భద్రత ఏర్పడటానికి బలమైన పునాదులు పడతాయి. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరగటంతోబాటు ఈ రంగంలో పెట్టుబడులకు కూడా ఆస్కారం ఏర్పడుతుంది. ఈ చర్యల వలన 23-24 ఆర్థిక సంవత్సరంలో కోల్ ఇండియా ఉత్పత్తి సామర్థ్యం వంద కోట్ల టన్నులకు చేరే అవకాశముంది. దేశంలొ థర్మల్ విద్యుదుత్పత్తి అవసరాలకు కూడా పూర్తి స్థాయిలో బొగ్గు సమకూరుతుంది.



 

****

.


(Release ID: 1630959) Visitor Counter : 412