ప్రధాన మంత్రి కార్యాలయం

కేదార్ నాథ్ పునర్ నిర్మాణ పథకం పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 10 JUN 2020 1:47PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం తో కలసి కేదార్ నాథ్ పునర్ నిర్మాణ పథకం పై సమీక్ష సమావేశాన్ని ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా  నిర్వహించారు.
  
ఈ పుణ్యక్షేత్రం యొక్క పునర్ నిర్మాణం పట్ల తన దృష్టికోణాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, కేదార్ నాథ్ మరియు బద్రీనాథ్ ల వంటి పవిత్ర స్థలాల లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పథకాలు ఒక విధం గా కాల పరీక్ష కు తట్టుకొని నిలచేవి గా ఉంటూనే, పర్యావరణమిత్రపూర్వకం గా కూడా ఉండేటట్లు మరియు ప్రకృతి తో, పరిసర ప్రాంతాల తో సామరస్యాన్ని నెలకొల్పుకొనేదిగా కూడా ఉండాలన్నారు.
  
 
వర్తమాన స్థితి ని గమనించినప్పుడు మరియు పవిత్ర స్థలాల కు తైర్థికుల, పర్యటకుల రాక పోక ల పరం గా చూసినప్పుడు ఇది సాపేక్షం గా గడ్డు కాలం కావడాన్ని దృష్టి లో పెట్టుకొని పెండింగు పడ్డ పనుల ను పూర్తి చేయడం కోసం ప్రస్తుత నిర్మాణ యుక్త సమయాన్ని వినియోగించుకోవచ్చని, అయితే సామాజిక దూరం తాలూకు నియమాల ను పరిగణన లోకి తీసుకొంటూను మరియు శ్రామిక సమూహాల కు సముచిత పని వితరణ కు పూనుకోవడం ద్వారాను ఈ కార్యాన్ని నెరవేర్చాలని ప్రధాన మంత్రి సూచించారు.  రాబోయే సంవత్సరాల లో పర్యటకుల తాకిడి ని తట్టుకోగలిగిన విధం గా మౌలిక సదుపాయాల కల్పన లో మరియు సౌకర్యాల స్థాపన లో ఈ కార్యం సహాయకారి కాగలదని ఆయన అన్నారు.  

ప్రధాన మంత్రి తన యొక్క నిర్దిష్ట సలహాల లో భాగం గా,  రామ్ బన్ నుండి కేదార్ నాథ్ వరకు విస్తరించిన మార్గం లోని ఇతర ధార్మిక కేంద్రాలు మరియు వారసత్వ స్థలాల ను మరింతగా అభివృద్ధిపరచడం కోసం కూడా ఆదేశాల ను ఇచ్చారు.  ఇవి కేదార్ నాథ్ లోని ప్రధాన పుణ్యక్షేత్రం యొక్క పునర్ నిర్మాణాని కి అదనం గా ఉంటాయి. 

బ్రహ్మ కమల్ వాటిక (ఉద్యానవనం) యొక్క అభివృద్ధి పనుల లో పురోగతి తో పాటు వాసుకి తాళ్ కు వెళ్లే మార్గం లో యాత్రికుల కోసం (వస్తు) ప్రదర్శనశాల ను ఏర్పాటు చేసే పనులు, పాత బస్తీ విడిది ఇళ్ల ను పునర్ నిర్మించే పనుల ను, చారిత్రిక ప్రాముఖ్యం కలిగిన ఇతర సంపత్తుల ను వాటి యొక్క మూల వాస్తు ముఖతలాన్ని పదిలం గా ఉంచుతూనే పునర్ నిర్మాణ పనుల ను చేపట్టడం, వాటి తో పాటు  నియమిత వ్యవధుల తో వాహనాల ను నిలిపి ఉంచేందుకు పుణ్యక్షేత్రాని కి తగినంత దూరం లో ఉద్దేశించిన చోటుల ను పర్యావరణమైత్రిపూర్వకం గా మలచడం తదితర విషయాల పైనా సమావేశం లో సమగ్ర చర్చ లు జరిగాయి.   

చర్చల లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ త్రివేంద్ర సింహ్ రావత్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా పాలుపంచుకొన్నారు. 


***


(Release ID: 1630679) Visitor Counter : 318