వ్యవసాయ మంత్రిత్వ శాఖ
"పర్ డ్రాప్ మోర్ క్రాప్" కింద రాష్ట్రాలకు రూ.4 వేల కోట్లు
కొన్ని రాష్ట్రాలకు కొనసాగుతున్న నిధుల విడుదల ప్రక్రియ
నాబార్డుతో కలిసి రూ.5 వేల కోట్ల కార్పస్ ఫండ్ సృష్టించిన కేంద్రం
సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థను ప్రోత్సహించడం లక్ష్యం
గత ఐదేళ్లలో సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థలోకి 46.96 లక్షల హెక్టార్లు
Posted On:
10 JUN 2020 12:28PM by PIB Hyderabad
"ప్రధానమంత్రి కృషి సించయీ యోజన" కింద, "పర్ డ్రాప్ మోర్ క్రాప్" కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ సహాకారం, రైతుల సంక్షేమ విభాగం అమలు చేస్తోంది. బిందు సేద్యం, స్ప్రింక్లర్ల వంటి పద్ధతులతో సూక్ష్మ నీటిపారుదల ద్వారా.. క్షేత్రస్థాయిలో నీటి సమర్థ వినియోగం జరిగేలా చూడడంపై పీఎంకేఎస్‌వై-పీడీఎంసీ దృష్టి పెట్టింది. బిందు సేద్యం ద్వారా నీటి పొదుపే కాక, ఎరువులు, కూలీలు, ఇతర పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో 4 వేల కోట్ల రూపాయలను రాష్ట్రాలకు కేటాయించారు. ఈ పథకం కిందకు వచ్చే లబ్ధిదారులను రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. కొన్ని రాష్ట్రాలకు నిధుల విడుదల ప్రక్రియ ఇప్పటికే జరుగుతోంది.
సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థ కోసం, నాబార్డుతో కలిసి 5 వేల కోట్ల రూపాయల కార్పస్ ఫండ్‌ను కేంద్రం సృష్టించింది. ప్రత్యేక, ఆవిష్కార ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా సూక్ష్మ సేద్యాన్ని మరింత విస్తరించడంలో వనరుల సమీకరణకు రాష్ట్రాలకు వీలు కల్పించడం ఈ నిధి లక్ష్యం. రైతులు సూక్ష్మ సేద్య వ్యవస్థలను నెలకొల్పేలా చేసి సూక్ష్య సేద్య వ్యవస్థను ప్రోత్సహించడం కూడా మరొక లక్ష్యం. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.616.14 కోట్లు, తమిళనాడుకు 478.79 కోట్ల రూపాయలను నాబార్డు ద్వారా కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లో 1.021 లక్షల హెక్టార్లు, తమిళనాడులో 1.76 లక్షల హెక్టార్లు సూక్ష్మ సేద్యం కింద సాగవుతున్నాయి.
గత ఐదేళ్లలో (2015-16 to 2019-20), పీఎంకేఎస్‌వై-పీడీఎంసీ ద్వారా 46.96 లక్షల హెక్టార్లను సూక్ష్మ నీటిపారుదల కిందకు తెచ్చారు.
(Release ID: 1630677)
Visitor Counter : 406
Read this release in:
Tamil
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Malayalam