ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19వైరస్ కట్టడి చర్యలపై కేంద్ర మంత్రుల బృందం సమీక్ష

మిగతా ప్రపంచ దేశాలకంటే మెరుగైన స్థితిలో భారత్,...అయితే, ఇపుడు నిర్లక్ష్యం ఏమాత్రం తగదు: డాక్టర్ హర్షవర్ధన్

“కోవిడ్-19 వైరస్ కట్టడికి భౌతిక దూరం, చేతుల పరిశుభ్రత, మాస్కులు ధరించడం..కచ్చితంగా పాటించాల్సిందే..కోవిడ్ వైరస్ కు ఇదే సరైన ‘సామాజిక టీకాలు’ అన్నది మనం మరిచిపోరాదు”

Posted On: 09 JUN 2020 4:22PM by PIB Hyderabad

   కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీఓఎం) 16 అత్యున్నత సమావేశం రోజు ఢిల్లీలో జరిగింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరిగింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, పౌర విమానయాన శాఖ మంత్రి హర్ దీప్ ఎస్. పూరి, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, నౌకా రవాణా, రసాయనాలు ఎరువుల శాఖ సహాయమంత్రి మన్ సుఖ్ లాల్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే, రక్షణ సిబ్బంది ప్రధాన అధిపతి బిపిన్ రావత్ ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రుల బృందం సభ్యులు, తదితర అధికారులు భౌతిక దూరం పాటిస్తూ సమావేశంలో పాలుపంచుకున్నారు.

   దేశంలో చేపడుతున్న కోవిడ్-19 వైరస్ నియంత్రణ, నిర్వహణా చర్యల గురించి సమావేశంలో అధికారులు మంత్రుల బృందానికి వివరించారు. కోవిడ్ నియంత్రణకు సంబంధించి లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలో ఇతర దేశాలతో పోల్చినపుడు భారత్ లో నెలకొన్న పరిస్థితిని, స్నాప్ షాట్ రూపంలో మంత్రుల బృందానికి వివరించారులాక్ డౌన్ తో లభించిన ప్రయోజనాలను, కోవిడ్ వైరస్ వ్యాధి నియంత్రణకు లాక్ డౌన్ ఉపయోగపడిన తీరును కూడా అధికారులు వివరించారు. మంత్రులతో కూడిన 11 సాధికార బృందాలు తమకు అప్పగించిన రంగాల్లో సాధించిన ప్రగతిని కూడా వివరించారు. లాక్ డౌన్ నిబంధనలను దశలవారీగా సడలిస్తున్న నేపథ్యంలో కోవిడ్ కట్టడి చర్యల విషయంలో ఎలాంటి రాజీలేకుండానే ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నిబంధనలు ఎలా దోహదపడతాయో మంత్రుల బృందానికి వివరించారు.

  సమావేశంలో మంత్రుల బృందం చైర్మన్ హోదాలో  డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ,..లాక్ డౌన్ నిబంధనలను ఎత్తివేస్తూ, అన్ లాక్ తొలిదశలో దేశం ప్రవేశిస్తున్న తరుణంలో కోవిడ్ నియంత్రణకు మనం మరింత క్రమశిక్షణతో వ్యవహరించవలసి ఉంటుందని, బహిరంగ స్థలాల్లో భౌతిక దూరం, చేతులు శుభ్రపరుచుకోవడం, మాస్కులను ధరించడం తప్పనిసరిగా పాటించవలసి ఉంటుందని అన్నారు. ప్రస్తుత తరుణంలో ఏమరుపాటు, నిర్లక్ష్యం మాత్రం కూడదని ఆయన పునరుద్ఘాటించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి తెరుచుకుంటున్న తరుణంలో మరింత జాగ్రత్తలు అవసరమని వివిధ శాఖల అధిపతులకు మంత్రి సూచించారు.

కోవిడ్-19 వైరస్ కట్టడికి భౌతిక దూరం, చేతుల పరిశుభ్రత, మాస్కులు ధరించడం..కచ్చితంగా పాటించాల్సిందే..కోవిడ్ వైరస్ కు ఇదే సరైన  ‘సామాజిక టీకాలుఅన్నది మనం మరిచిపోరాదుఅని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని, పరిస్థితిపై సొంత అంచనాకు, కోవిడ్-19వైరస్ నుంచి రక్షణకు ఇది ఎంతగానో దోహదపడుతుందని డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 12కోట్ల 55లక్షలమంది ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని ఆయన చెప్పారు.

   దేశంలో వైద్యపరంగా పెరుగుతున్న మౌలిక సదుపాయాల గురించి కూడా మంత్రుల బృందానికి అధికారులు వివరించారు. సంవత్సరం జూన్ 9నాటికి దేశంలో కోవిడ్ వైరస్ కు చికిత్సకు సంబంధించిన మౌలిక సదుపాయాలు బాగా పటిష్టపడ్డాయని, లక్షా 67వేల 883 ఐసొలేషన్ పడకలు, 21,614 పడకలు, 73,469 ఆక్సిజన్ సదుపాయంతో కూడిన పడకలతో 958ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రులు ఏర్పాటయ్యాయని అధికారులు తెలిపారు. లక్షా 33వేల 37 ఐసొలేషన్ పడకలు, 10,748 .సి.యు. పడకలు, 46,635 ఆక్సిజన్ సదుపాయం కలిగిన పడకలతో కూడిన 2,313 కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు ఇప్పటికే వినియోగంలోకి వచ్చాయని తెలిపారు. దీనికితోడు,..7లక్షల 10వేల 642 పడకలతో కూడిన 7,525 కోవిడ్ కేర్ సెంటర్లు దేశంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.  21,494 కోవిడ్ పడకలకు కృత్రిమ శ్వాస ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

    రాష్ట్రాలకు, కేంద్రపాలిత  ప్రాంతాలకు, కేంద్రప్రభుత్వ సంస్థలకు 128.48 లక్షల ఎన్-95 మాస్కులు, 104.74లక్షల పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్లు (PPEలు) కేంద్రప్రభుత్వం అందించిందని తెలిపారు. అదనంగా 60,848 వెంటిలేటర్ల తయారీ కోసం కేంద్ర ప్రభుుత్వం ఆర్డర్ ఇచ్చిందని, భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్.ఆర్) పరీక్షా సామర్థ్యం పెరిగిందని, ప్రస్తుతం ఐసీఎమ్.ఆర్. పర్యవేక్షణలో 553 ప్రభుత్వ లేబరేటరీలు, 231 ప్రైవేటు లేబరేటరీలు కలిపి మొత్తం 784 లేబరేటరీలు పరీక్షలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 49లక్షలకు పైగా కరోనా పరీక్షలు జరిగాయని, గత 24 గంటల్లో లక్షా 41వేల 682 నమూనాలను పరీక్షించారని తెలిపారు.

  కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ భారాన్ని తగ్గించి, కీలకమైన సరకులు సరఫరా అయ్యేలా చూసేందుకు తమ బృందం అనుసరించిన కీలక వ్యూహాలను ఐదవ సాధికార బృందం చైర్మన్ పరమేశ్వరన్ అయ్యర్ సమావేశంలో సమర్పించారు

  టెస్టింగ్ లేబరేటరీల్లో తాజా పరిస్థితిని, దేశవ్యాప్తంగా వైద్య పరీక్షల బలోపేతం చేయడం, హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రలు, రెమ్ డెసివిర్ మందుల వినియోగం తదితర అంశాలపై వివరాలను ఐసీఎంఆర్.కు చెందిన డాక్టర్ రామన్ గంగా ఖేడ్కర్ సమావేశంలో సమర్పించారు.

  ఇప్పటివరకూ దేశంలో లక్షా 29వేల 214మంది బాధితులు కోవిడ్ వైరస్ నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 4,785మంది రోగులు కోలుకున్నారు. దీనితో దేశంలో కోవిడ్ రోగుల స్వస్థత (రికవరీ) రేటు 48.47శాతంగా నమోదైంది. దేశ వ్యాప్తంగా లక్షా 29వేల 917 మంది చికిత్స పొందుతున్నారు.

  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశానికి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతీ సుడాన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక అధికారి రాజేశ్ భూషణ్, ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఆర్తీ అహుజా, ఐసీఎం.ఆర్.కు చెందిన డాక్టర్ రామన్ గంగాఖేడ్కర్ హాజరయ్యారు.



(Release ID: 1630544) Visitor Counter : 276