రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

సెప్టెంబర్ 30 వరకు మోటారు వాహన పత్రాల చెల్లుబాటు పొడిగింపు

Posted On: 09 JUN 2020 4:47PM by PIB Hyderabad

మోటారు వాహన‌పు పత్రాల చెల్లుబాటు తేదీని ఈ ఏడాది సెప్టెంబర్ చివ‌రి వరకు పొడిగించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు మ‌రియు ఎంఎస్‌ఎంఈల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ
రోజు ప్రకటించారు. దీనికి అనుగుణంగా రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల‌కు ఒక అడ్వైజ‌రీని జారీ చేసింది. అంతకు ముందు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు మార్చి 30వ తేదీన‌ ఒక అడ్వైజ‌రీని జారీ చేసింది. దీని ప్ర‌కారం వాహ‌నాల ఫిట్‌నెస్, పర్మిట్ (అన్ని రకాల), డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ వంటి ప్ర‌తాల చెల్లుబాటును పొడిగించ లేని ఇతర ప్ర‌తాల యొక్క చెల్లుబాటు గ‌డువును పొడిగిస్తున్న‌ట్టుగా తెలిపింది. లాక్‌డౌన్‌ కారణంగా ఫిబ్రవరి 1, 2020 నుండి మొద‌లుకొని మే 31 మ‌ధ్య కాలావ‌ధి ముగుస్తున్న ర‌వాణాకు సంబంధించిన వాహ‌న ప్ర‌తాలు జూన్ 30వ తేదీ వ‌ర‌కు చెల్లుబాటు అవుతాయన్న‌ట్టుగా భావించాల‌ని తెలిపింది.
కోవిడ్ నేప‌థ్యంలో అభ్య‌ర్థ‌ల మేర‌కు నిర్ణ‌యం..
దేశంలోని ప్ర‌త్యేక ప‌రిస్ధితుల నేప‌థ్యంలో గ‌డువు ముగిసిన ఆయా ప‌త్రాల‌ను చెల్లుబాటయ్యే ప్ర‌తాలుగానే ప‌రిగ‌ణించాల‌ని స‌ర్కారు అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల‌ను కోరింది. అయితే దేశంలో కోవిడ్‌-19 క‌ట్ట‌డికి సంబంధించి ప‌రిస్థితుల‌ను పరిగణనలోకి తీసుకోవ‌డంతో పాటుగా త‌మ శాఖ‌కు అందుతున్న అభ్యర్థనల మేర‌కు ఆయా ప్ర‌తాల చెల్లుబాటు స‌మ‌యం సెప్టెంబ‌రు నెలాఖ‌రు వ‌ర‌కు ఉన్నట్టు ప‌రిగ‌ణించేలా ఆదేశాల‌ను జారీ చేయాల‌ని మంత్రి గ‌డ్క‌రీ మంత్రిత్వ శాఖను ఆదేశించారు. ఈ నిర్ణ‌య అమలు ప్రయోజనాల కోసం చెల్లుబాట‌య్యేలా ఆదేశాలు జారీ చేయాల‌ని మంత్రి సూచించారు. కోవిడ్‌-19 క‌ట్ట‌డికి సంబంధించి నెల‌కొన్న ప్ర‌త్యేక పరిస్థితులలో పౌరులను వాహ‌నాల‌కు సంబంధించిన ప‌త్రాల విష‌యం త‌దుప‌రి అనుమ‌తులు పొందేందుకు ఇబ్బందిగా ఉండ‌కూడ‌ద‌న్న కోణంలో కేంద్ర రోడ్డు ర‌వాణా, ర‌హ‌దారుల శాఖ, మే 21వ తేదీన ఇందుకు సంబంధంచి ఒక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు -1989 లోని రూల్ 32 లేదా రూల్ 81 కింద ఫీజుల చెల్లుబాటు మరియు / లేదా అదనపు రుసుముల నిబంధ‌న‌ను జూలై 31, 2020 వరకు సడలించ‌డం జ‌రిగింది. దీని ప్ర‌కారం ఇప్పుడు మోటారు వాహనాల చట్టం 1988 కింద లభించే నిబంధనలను లేదా ఇతర చట్టాలలో లభ్యమయ్యే ఇతర నిబంధనలను పరిగణనలోకి తీసుకొని రాష్ర్టాలు/ ‌కేంద్ర‌పాలిత ప్రాంతాల వారు త‌గిన చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాల‌ని కేంద్రం కోరింది. కోవిడ్‌-19 అసాధార‌ణ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప‌ర్మిట్‌, లేదా ఫీజులు లేదా రెన్యూవ‌ల్ నిమిత్తం ప‌న్నులు ప‌ర్మిట్ల కొన‌సాగింపు పొంద‌డంలో జాప్యం కార‌ణంగా విధించే జ‌రిమానాల నుంచి ప్ర‌జ‌ల‌కు త‌గు విధంగా మిన‌హాయింపులు ల‌భించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరింది.

***



(Release ID: 1630540) Visitor Counter : 329