ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 తాజా సమాచారం
కోవిడ్ -19 తీవ్రంగా ఉన్న 50 మున్సిపాలిటీలలో కేంద్ర బృందాల నియామకం
Posted On:
09 JUN 2020 1:51PM by PIB Hyderabad
కోవిడ్ -19 తీవ్రత బాగా ఎక్కువగా ఉండి పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్న 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 50 జిల్లాలు/ మున్సిపాలిటీలలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రత్యేక బృందాలను నియమించింది. ఈ బృందాలలో బహుళ నైపుణ్యం ఉన్న వివిధ స్థాయి అధికారులుంటారు. కోవిడ్ -19 నియంత్రించటంలో అక్కడి ప్రభుత్వాలకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించటానికి ఈ బృందాలు కృషిచేస్తాయి.
అలాంటి సహాయం అందుకుంటున్న రాష్ట్రాలలోమహారాష్ట్ర(7 జిల్లాలు/ మున్సిపాలిటీలు), తెలంగాణ (4), తమిళనాడు (7), రాజస్థాన్ (5), అస్సాం(6), హర్యానా (4), గుజరాత్(3), కర్నాటక (4), ఉత్తరాఖండ్ (3), మధ్యప్రదేశ్(5), పశ్చిమబెంగాల్(3), ఢిల్లీ (3), బీహార్ (4), ఉత్తరప్త్రదేశ్(4), ఒడిశా(5) ఉన్నాయి.
ముగ్గురేసి సభ్యులతో కూడిన ఈ బృందాలలో ఇద్దరు ప్రజారోగ్య నిపుణులు/ అంటువ్యాధుల నిపుణులు/ వైద్యులు, ఒకరి పాలనాపరమైన విధులు నిర్వహించే జాయింట్ సెక్రెటరీ స్థాయి నోడల్ అధికారి అంటారు. ఈ బృందాలు క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ అక్కడి వ్యవహారాల మెరుగుదలకు కృషి చేస్తాయి. రాష్ట్రప్రభుత్వాల వైద్య కేంద్రాలకు వెళ్ళి తగిన సహాయం అందించేందుకు, తద్వారా మెరుగైన చికిత్స అందటానికి, కోవిడ్ నియంత్రణకు, నివారణకు సాయపడతాయి.
మరింత మెరుగైన సమన్వయం సాధించటానికి, క్షేత్ర స్థాయిలో వేగవంతమైన చర్యలకు నిశితమైన వ్యూహాన్ని అనుసరించటానికి ఈ బృందాలు సహాయపడతాయి. పైన పేర్కొన్న జిల్లాలు/మున్సిపల్ కేంద్రాలు ఇప్పటికే రాష్ట్ర బృందాలతో అనుసంధానమై ఉన్న ఈ కేంద్రబృందాలతో సంప్రదింపులు జరుపుతూ ఉండటం వలన ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.
కేంద్ర బృందాలు రాష్ట్ర. కేంద్రపాలిత ప్రాంతాలకు సహాయం చేస్తూ పరీక్షల సంఖ్య విషయంలోను, అత్యధికంగా నమోదవుతున్న కేసుల విషయంలోను, అత్యధికంగా నిర్థారణ జరుగుతున్న నేపథ్యంలోను అక్కడి అధికారులు ఎదుర్కుంటున్న సవాళ్ళను పరిష్కరించే దిశలో కృషి చేస్తున్నాయి. వచ్చే రెండు నెలల కాలంలో వైద్య సదుపాయాప సామర్థ్యం తగినంతగా ఉందబోదనుకుంటున్న సమయంలో అక్కడ చేపట్టాల్సిన చర్యలను కూడా ఈ బృందాలు పర్యవేక్షిస్తాయి. పదకల కొరత, పెరుగుతున్న పాజిటివ్ నిర్థారణలు, మరణాల సంఖ్య, ఆకస్మికంగా కేసులు పెరగటం లాంటి సమస్యల విషయంలో తగిన చర్యలు తీసుకోవటానికి సహాయపడతాయి.తీసుకుంటున్నారు.
అనేక జిల్లాలు, మున్సిపాలిటీలు ఇప్పటికే ప్రత్యేక బృమ్దాలను తమ్న తమ స్థాయిలో ఏర్పాటు చేసుకున్నాయి. అందులో
జిల్లా స్థాయి వైద్యాధికారులు, పాలనాధికారులు సభ్యులుగా ఉన్నారు. వారు ఎప్పటికప్పుడు కేంద్రబృందాలతో సమాచారం పంచుకుంటూ తదుపరి చర్యలకు సలహాలు తీసుకుంటున్నారు
****
(Release ID: 1630473)
Visitor Counter : 322
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam