రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

బీఎస్‌-6 నాలుగు చక్రాల వాహనాల నంబర్‌ ప్లేట్ల కోసం విభిన్నమైన రంగు

ఒక సెం.మీ. వెడల్పున్న ఆకుపచ్చ స్టిక్కర్‌తో విండ్‌ షీల్డ్‌ మీద రిజిస్ట్రేషన్‌ వివరాలు
కచ్చితమైన, శుద్ధమైన ఉద్గారాల నిబంధనలతో బీఎస్‌-6 ప్రమాణాలు

Posted On: 08 JUN 2020 4:45PM by PIB Hyderabad

బీఎస్‌-6 నాలుగు చక్రాల వాహనాలపై, అది పెట్రోల్‌, డీజిల్‌ లేక సీఎన్‌జీ వాహనమా అన్న వివరాలు తెలిపేందుకు ఒక సెం.మీ. వెడలున్న ఆకుపచ్చ స్టికర్‌తో వివరాలు అతికించడాన్ని తప్పనిసరి చేస్తూ "కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ" ఆదేశాలు జారీ చేసింది. జూన్ 5, 2020న ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ప్రస్తుతం పెట్రోలు లేదా సీఎన్‌జీ వాహనమైతే లేత బ్లూ రంగులో స్టిక్కర్‌ ఉంటోంది. డీజిల్‌ వాహనమైతే నారింజ రంగులో స్టిక్కర్‌ ఉంటోంది. వీటిపై ఆకుపచ్చ స్టిక్కర్‌ అతికించాలని కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొంది.

    ఏప్రిల్‌ 1, 2020 నుంచి అమల్లోకి వచ్చిన బీఎస్‌-6 ఉద్గార ప్రమాణాలు... కచ్చితమైన, శుద్ధమైన ఉద్గార నిబంధనలు కలిగివుంటాయి. ప్రస్తుతం మిగిలిన ప్రపంచం పాటిస్తున్న ఉద్గార ప్రమాణాల కంటే ఇవి ఉన్నతమైనవి. ఇతర దేశాల్లో అనుసరిస్తున్న ఈ తరహా వాహనాల ప్రమాణాలను భారత్‌లోనూ పాటించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు రాగా, వీటిని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.



(Release ID: 1630246) Visitor Counter : 247