శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 పై దృష్టి సారించే ఆరోగ్యం & రిస్క్ కమ్యూనికేషన్ ప్రోగ్రామ్ పై సమాచార బ్రోచర్ ను విడుదల చేసిన - డి.ఎస్.టి.
ఇది అట్టడుగు స్థాయి లో ఆసక్తికరమైన, ప్రామాణికమైన సమాచారాన్ని పరస్పరం అడిగి తెలుసుకునే పద్ధతి లో అందిస్తుంది.
ప్రత్యేకంగా గుర్తించబడిన ప్రాంతాలకు అనుగుణంగా ప్రత్యేక కమ్యూనికేషన్ మాడ్యూల్స్ ను అభివృద్ధి చేయడం జరిగింది.
Posted On:
08 JUN 2020 1:31PM by PIB Hyderabad
శాస్త్ర, సాంకేతిక శాఖ (డి.ఎస్.టి) కి చెందిన నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ & టెక్నాలజీ కమ్యూనికేషన్ (ఎన్.సి.ఎస్.టి.సి), ఇటీవల ఆరోగ్యం మరియు రిస్క్ కమ్యూనికేషన్‌పై ప్రారంభించిన "కోవిడ్- పై దృష్టి సారించే విజ్ఞాన శాస్త్రం & ఆరోగ్యం పై అవగాహన కల్పించే సంవత్సరం (యాష్)" కార్యక్రమానికి సమాచార బ్రోచర్‌ను విడుదల చేసింది. ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఎదుర్కొన్న ప్రమాదాలు, సంక్షోభాలు, విపత్తులు, అనిశ్చితుల వంటి సమస్యలను పరిష్కరించడానికి దేశంలో ఇటువంటి భారీ కార్యక్రమం యొక్క ఆవిర్భావం మరియు అవసరాల గురించి ఈ బ్రోచర్ లో తగిన సమాచారాన్ని పొందుపరిచారు. ప్రస్తుత మరియు భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవటానికి మెరుగైన సంసిద్ధత కోసం అదేవిధంగా, విజ్ఞానశాస్త్రం మరియు ఆరోగ్యం పై ప్రజల్లో జ్ఞానాన్నీ, అవగాహననూ పెంపొందించడంపై ఈ కార్యక్రమం దృష్టి సారించింది.
శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ మాట్లాడుతూ, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, జానపద మరియు ఇంటరాక్టివ్ మీడియాతో కూడిన ఈ కార్యక్రమాలను సమాజంలోని అన్ని విభాగాలకు చేరుకోవాలనే ఉద్దేశ్యంతో రూపొందించడం జరిగిందని అన్నారు. బ్రోచర్‌లో ముద్రించిన యాష్ కార్యక్రమ లోగో శాంతి మరియు ఆనందాల తరంగాలను ప్రదర్శించే విధంగా రూపొందించబడిందనీ, పరిస్థితిని సమర్ధవంతంగా అధిగమించే భావాన్ని కలిగిస్తూ, విజ్ఞానశాస్త్రం, ఆరోగ్యం, ప్రమాదం, అవగాహనల సందేశాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుందనీ, ఆయన అభివర్ణించారు.
ముఖ్యంగా కోవిడ్-19 పై దృష్టి సారించి, ప్రామాణికమైన సమాచారాన్ని ఆసక్తికరమైన మరియు పరస్పరం అడిగి తెలుసుకునే పద్ధతి లో అట్టడుగు స్థాయిలో వారికి సైతం అందే విధంగా, ఆరోగ్యం మరియు రిస్క్ కమ్యూనికేషన్‌పై ఒక సమగ్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. జాతీయ ఆరోగ్యం & రిస్క్ కమ్యూనికేషన్ కార్యక్రమం పాన్ ఇండియా యంత్రాంగంతో రూపొందించబడి, పెద్ద ఎత్తున అమలు చేయబడుతోంది. రాష్ట్రాలకు చెందిన శాస్త్ర, సాంకేతిక మండళ్లు కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి మూడు ప్రధాన అంశాలుఉన్నాయి. అవి, సాఫ్ట్‌వేర్ / కంటెంట్ డెవలప్‌మెంట్, సామర్థ్య అభివృద్ధి, మరియు వ్యాప్తి, అవుట్ రీచ్.
ఈ కార్యకలాపాలు ఆరు (తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, మధ్య మరియు ఈశాన్య) ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. ప్రత్యేకంగా గుర్తించబడిన ప్రాంతాలను బట్టి ప్రత్యేక కమ్యూనికేషన్ మాడ్యూల్స్ అభివృద్ధి చేయడం జరిగింది. కమ్యూనిటీ ఆరోగ్యానికి సంబంధించిన కార్యకలాపాల కోసం కమ్యూనికేటర్లు మరియు వాలంటీర్లకు నెట్‌వర్కింగ్ లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది. కోవిడ్-19 మహమ్మారి వల్ల ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో, శాస్త్రీయ అవగాహన, ఆరోగ్య సంసిద్ధత, ప్రామాణికమైన శాస్త్రీయ సమాచారం యొక్క అవగాహన, వినియోగంతో పరిస్థితిని ఎదుర్కోవటానికి మరియు కలిగే నష్టాలను తెలియజేయడానికి మరియు వాటిని సులభంగా అధిగమించడానికి ఈ సంఘాలు ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.
సమాచార బ్రోచర్ లో - ఆరోగ్యం పై అట్టడుగు స్థాయి ప్రశంసలు మరియు ప్రతిస్పందనను ప్రోత్సహించడానికి సమగ్ర మరియు సమర్థవంతమైన విజ్ఞానశాస్త్రం మరియు ఆరోగ్య పరమైన కమ్యూనికేషన్ కోసం జరుగుతున్న కృషి, ప్రజల జీవితాలను పెద్దగా తీర్చిదిద్దడం, వారిలో విశ్వాసాన్ని పెంపొందించడం, శాస్త్రీయ నిగ్రహాన్ని కలిగించడం మరియు వారిలో ఆరోగ్య స్పృహను ప్రోత్సహించడం వంటి అంశాలను ప్రధానంగా వివరించడం జరిగింది.
ఈ బ్రోచర్ ను www.dst.gov.in వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
(మరిన్ని వివరాల కోసం, దయచేసి సంప్రదించండి :
డాక్టర్ మనోజ్ కుమార్ పాతైరియా ,
సలహాదారులు & అధిపతి, ఎన్ .సి.ఎస్.టి.సి.,
ఈ -మెయిల్ : mkp[at]nic[dot]in ,
మొబైల్ : 9868114548)
******
(Release ID: 1630233)
Visitor Counter : 282