రక్షణ మంత్రిత్వ శాఖ
భారత నావికాదళం “సముద్ర సేతు” ద్వారా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ నుండి పౌరులను తరలించడం ప్రారంభించింది
Posted On:
08 JUN 2020 10:10AM by PIB Hyderabad
2020 మే 8వ తేదీ నుండి భారత పౌరులను స్వదేశానికి రప్పించడానికి భారత నావికాదళం "ఆపరేషన్ సేతు " ను ప్రారంభించింది. భారత నావికాదళానికి చెందిన జలాశ్వ మరియు మగర్ నౌకలు ఇప్పటికే మాల్దీవులు మరియు శ్రీలంక నుండి 2,874 మందిని కొచ్చి మరియు టుటికోరిన్ నౌకాశ్రయాలకు తీసుకువచ్చాయి.
సముద్ర సేతు పధకం కింద తరువాతి దశలో, భారత నావికాదళపు నౌక శార్దూల్ 2020 జూన్ 08వ తేదీన, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ లోని బందర్ అబ్బాస్ నౌకాశ్రయం నుండి గుజరాత్ లోని పోర్బందర్ వరకు భారతీయ పౌరులను తరలించనుంది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ లోని భారతీయ రాయబార కార్యాలయం అక్కడనుండి తరలించవలసిన భారతీయ పౌరుల జాబితాను సిద్ధం చేస్తోంది. వారి ప్రయాణం సులభతరమయ్యే విధంగా అవసరమైన వైద్య పరీక్షలను జరిపిస్తోంది.

కోవిడ్ - సంబంధించిన సామాజిక దూరం వంటి నిబంధనలను పాటించడంతో పాటు, అదనపు వైద్య సిబ్బంది, వైద్యులు, పరిశుభ్రత నిపుణులు, పోషకాహార నిపుణులు, మందుల దుకాణాలు, రేషన్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, ఫేస్-మాస్క్‌లు మొదలైనవి ఐ.ఎన్.ఎస్ శార్దూల్ లో సమకూర్చడం జరిగింది. అధీకృత వైద్య దుస్తులతో పాటు, కొనసాగుతున్న కోవిడ్-19 సంక్షోభ సమయంలో భారత నావికాదళం అభివృద్ధి చేసిన వినూత్న ఉత్పత్తులతో సహా కోవిడ్-19 తో వ్యవహరించడానికి అవసరమైన ప్రత్యేకమైన వైద్య పరికరాలను కూడా నౌకలో ఏర్పాటు చేయడం జరిగింది.
పోరుబందర్ చేరుకోడానికి సముద్ర మార్గాన్ని ఎంచుకున్నప్పుడు, ఖాళీ చేయబడిన సిబ్బందికి ప్రాథమిక సౌకర్యాలు మరియు వైద్య సదుపాయాలు కల్పించబడతాయి. ఏవైనా ఆకస్మిక పరిస్థితులు ఏర్పడితే, ప్రత్యేక ఐసోలేషన్ కంపార్ట్మెంట్లు కూడా కేటాయించబడ్డాయి. లక్షణం లేని క్యారియర్‌లతో సహా కోవిడ్-19 తో సంబంధం ఉన్న ప్రత్యేకమైన సవాళ్ల దృష్ట్యా, కఠినమైన ప్రోటోకాల్‌లు గడిచే సమయంలో నిర్దేశించబడుతున్నాయి.
పోరుబందర్ వద్ద దిగిన తరువాత, ఖాళీ చేయబడిన సిబ్బందిని రాష్ట్ర అధికారుల సంరక్షణలో ఉంచుతారు.
*****
(Release ID: 1630179)
Visitor Counter : 333
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam