సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 తో పోరాడటానికి అవగాహన పెంపొందించుకోవాలి, ఆందోళన కాదు: డాక్టర్ జితేంద్ర సింగ్
కోవిడ్-19 రోగుల కోసం భారత దేశపు మొట్ట మొదటి స్వదేశీ, ఖర్చుతో కూడుకున్న, వైర్‌లెస్ శారీరిక ప్రమాణాల పర్యవేక్షణ వ్యవస్థ "కోవిడ్-బీప్" ని ప్రారంభించింది.
అసలు కోవిడ్ కు విరుగుడు గా "కోవిడ్ బీప్" అవతరించనుంది
Posted On:
07 JUN 2020 5:33PM by PIB Hyderabad
కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (ఐ/సి) మరియు ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ఇక్కడ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారిపై పోరాడటానికి అవగాహన పెంపొందించుకోవాలనీ, ఆందోళన కాదని, పేర్కొన్నారు. కోవిడ్-19 రోగుల కోసం భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ, ఖర్చుతో కూడుకున్న, వైర్‌లెస్ శారీరిక ప్రమాణాల పర్యవేక్షణ వ్యవస్థ "కోవిడ్ బీప్" (నిరంతర ఆక్సిజనేషన్ & వైటల్ ఇన్ఫర్మేషన్ డిటెక్షన్ బయో మెడ్ ఈ.సి.ఐ.ఎల్. ఈ.సి.ఐ.సి పాడ్) ను ఆయన ప్రారంభించారు. కేంద్ర అణుశక్తి శాఖ, ఐ.ఐ.టి.హైదరాబాద్ ల సహకారంతో హైదరాబాద్ లోని ఈ.ఎస్.ఐ.సి.వైద్య కళాశాల ఈ "కోవిడ్ బీప్" ను రూపొందించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో నివారణ మరియు అవగాహన యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. సుమారు రెండు నెలల లాక్ డౌన్ తర్వాత, ఇప్పుడు అన్‌లాక్ ప్రక్రియ దశల వారీగా ప్రారంభమై, సకాలంలో సమర్థవంతంగా కొనసాగుతోందని, ఆయన చెప్పారు.
ప్రస్తుతం కోవిడ్-19 సంక్షోభ సమయంలో బీమా చేసిన వ్యక్తుల సంక్షేమం కోసం హైదరాబాద్, ఐ.ఐ.టి, హైదరాబాద్, ఇ.సి.ఐ.ఎల్, హైదరాబాద్ మరియు టి.ఐ.ఎఫ్.ఆర్, హైదరాబాద్ వంటి ప్రముఖ సంస్థల సహకారంతో మరో ఆవిష్కరణతో ముందుకు వచ్చిన ఈ.ఎస్.ఐ.సి. వైద్య కళాశాల, హైదరాబాద్ ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. డాక్టర్ సింగ్ మాట్లాడుతూ, ఆత్మ నిర్భర్ ను నిజమైన అర్థంలో దేశాన్ని తయారుచేయడంలో భాగంగా, భారతదేశంలోని ప్రఖ్యాత సంస్థల సమిష్టి సహకారంతో కనీస వ్యయంతో దేశం ఎదుర్కొంటున్న చాలా సవాళ్లకు పరిష్కారాలను ఎలా అందించగలదో చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ అని పేర్కొన్నారు. మొత్తం ప్రపంచాన్ని ప్రస్తుతం పట్టి పీడిస్తున్న అసలు కోవిడ్ మహమ్మారి కి సమర్థవంతమైన విరుగుడుగా "కోవిడ్ బీప్" ఉపయోగపడుతుందని డాక్టర్ సింగ్ చెప్పారు.
అధునాతన కోవిడ్ బీప్ తాజా వ్యవస్థ ఈ క్రింది అంశాలను కలిగి ఉంది :
(i) ఎన్.ఐ.బి.పి. పర్యవేక్షణ: కోవిడ్-19 కారణంగా వయోవృద్దులు ఎక్కువ సంఖ్యలో మృతి చెందుతున్న నేపథ్యంలో ఎన్.ఐ.బి.పి. పర్యవేక్షణ తప్పనిసరి అవుతుంది.
(ii) ఈ.సి.జి. పర్యవేక్షణ: రోగ నిరోధకత మరియు / లేదా చికిత్సగా ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్ మరియు అజిత్రోమైసిన్ మొదలైన మందులు గుండెపై ప్రభావాలను కలిగి ఉంటాయి. అందువల్ల ఈ.సి.జి. పర్యవేక్షణ ప్రాముఖ్యత కలిగి ఉంది.
(iii) శ్వాస క్రియకు సంబంధించిన రేటు : బయో ఇంపెడెన్స్ పద్ధతి ద్వారా లెక్కించబడుతుంది.
కోవిడ్ బీప్ ట్రాన్స్ మిషన్ ఇబ్బందులను బాగా తగ్గిస్తుంది, అదేవిధంగా, పి.పి.ఈ. లు వంటి వనరులను ఆదా చేస్తుంది.
ఆరోగ్య సంబంధిత అనేక సమస్యలకు పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో అణు ఇంధన శాఖలో భాగమైన ఈ.సి.ఐ.ఎల్. కృషిని డాక్టర్ సింగ్ ప్రశంసించారు. సాధారణంగా ప్రజల్లో ఉన్న అవగాహనకు విరుద్ధంగా, అణుశక్తి విభాగం మానవజాతి సంక్షేమం కోసం అణుశక్తిని ఉపయోగించుకోవడాన్ని ప్రోత్సహించడంలో చురుకుగా పాల్గొంటోంది. విద్యుత్తు ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం, ఆహార సంరక్షణ లేదా ముంబై లోని టి.ఎం.సి. పేరుతో ఎంతో ప్రఖ్యాత ఆంకాలజీ కేంద్రాన్ని నిర్వహించడం వంటి విభిన్న రంగాలలో, అణు ఇంధన శాఖ, దేశానికి అవసరమైన సమయంలో ఎప్పుడూ ముందు ఉంటుంది.
కోవిడ్ బీప్ ను అభివృద్ధి చేయడం ఈ దిశ గా చేపట్టిన మరొక చర్య. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, అణుశక్తి శాఖ కార్యదర్శి శ్రీ కే. ఎన్. వ్యాస్, హైదరాబాద్ లోని ఈ.ఎస్.ఐ.సి. వైద్య కళాశాల డీన్ ప్రొఫెసర్ శ్రీనివాస్, హైదరాబాద్ లోని ఈ.సి.ఐ.ఎల్. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (రిటైర్డ్) రియర్ అడ్మిరల్ సంజయ్ చౌబే మొదలైన వారు మాట్లాడుతూ - ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి ఆవిష్కరణల యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు.
<><><>
(Release ID: 1630112)
Visitor Counter : 319