ఆర్థిక మంత్రిత్వ శాఖ
రాష్ట్రాలకు జి ఎస్ టి పరిహారం కింద రూ.36,400 కోట్లు విడుదల చేసిన కేంద్రం
प्रविष्टि तिथि:
04 JUN 2020 8:28PM by PIB Hyderabad
కోవిడ్-19 ఫలితంగా ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రూ. 36,400 కోట్ల జి ఎస్ టి పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, శాసనసభలున్న కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసింది. వనరులు తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితుల్లో ఖర్చులు చేయాల్సి ఉండటంతో 2019 డిసెంబర్ నుంచి 2020 ఫిబ్రవరి వరకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఈ రోజు కేంద్రం విడుదల చేసింది.
2019 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఇవ్వాల్సిన జిఎస్టీ పరిహారమైన రూ.1,15,096 కోట్లను కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రప్రభుత్వాలకు, శాసన సభలున్న కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటికే విడుదల చేసింది.
*****
(रिलीज़ आईडी: 1629508)
आगंतुक पटल : 351