పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

ప‌ట్ట‌ణ అడ‌వుల‌పై ప్ర‌త్యేక దృష్టి పెడుతూ పర్యావరణ దినోత్సవ‌పు వేడుక‌లు

Posted On: 04 JUN 2020 5:15PM by PIB Hyderabad

ప్ర‌తి ఏడాది జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం (డ‌బ్ల్యూఈడీ) జ‌రుప‌బ‌డుతుంది.
ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం పుర‌స్క‌రించుకొని కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అనేక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తుంది. యూఎన్ఈపీ ప్ర‌క‌టించిన త‌గిన ‌ఇతివృత్తంపై దృష్టిసారిస్తూ ఈ వేడుక‌లు నిర్వహించ‌బ‌డుతాయి. ఈ ఏడాది "జీవవైవిధ్యం"
థీమ్‌ను నిర్ణ‌యించారు. కోవిడ్‌-19 మహమ్మారి నేప‌థ్యం ప్రబలంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా మంత్రిత్వ శాఖ ఈ సంవత్సరం ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌ల్ని వర్చువ‌ల్ విధానంలో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను న‌గర్ వ‌న్ (పట్టణ అడవులు) పై ప్ర‌త్యేక దృష్టి సారించనున్నారు. ఈ ఏడాది నిర్వ‌హించనున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం శుక్ర‌వారం (జూన్ 5వ తేదీ) ఉదయం 9 గంటల నుండి https://www.youtube.com/watch?v=IzMQuhmheoo పై ప్రత్యక్షంగా ప్ర‌సారం కానుంది. భారతదేశం తక్కువ భూభాగం మరియు ఎక్కువ మానవ మరియు పశువుల జనాభా ఉన్నప్పటికీ జీవవైవిధ్యంలో దాదాపు 8 శాతం ఉంది. భార‌త దేశం అనేక రకాల జంతువులు మరియు మొక్కలతో గొప్ప జీవవైవిధ్యత‌ను క‌లిగి ఉంది. అనేక స్థానిక జాతులను కలిగి ఉన్న 35 గ్లోబల్ బయో-డైవర్సిటీ హాట్‌స్పాట్లలో నాలుగింటిని క‌లిగి ఉంది. జీవవైవిధ్య పరిరక్షణ సాంప్రదాయకంగా మారుమూల అటవీ ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయబడింది. అయితే పెరుగుతున్న పట్టణీకరణతో పట్టణ ప్రాంతాల్లో కూడా జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఏర్పడింది. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 200 కార్పొరేషన్లు మరియు నగరాల్లో పట్టణాల‌లోనూ వ‌నాల్ని సృష్టించేందుకు వీలుగా ఒక  పథకాన్ని తిరిగి ప్రారంభించింది. ఈ నగరాలన్నింటిలో ప‌లు తోటలు ఉన్నాయి కాని అటవీ ప్రాంతం లేని కార‌ణంగా స‌ర్కారు దీనిని పునఃప్రారంభించింది. ఈ నగరాల శ్వాస‌కోశ సామర్థ్యాన్ని సృష్టించ‌డం మరియు పెంపొందించ‌డానికి పట్టణ అటవీక‌ర‌ణ ప‌క్రియ దోహ‌దం చేయ‌నుంది.
పుణె నగరంలో 40 ఎకరాల అటవీ భూమిపై అడవి ప్రాంతం అభివృద్ధి చేయబడింది. ఇందులో 65000 కి పైగా చెట్లు, 5 చెరువులు, 2 వాచ్ టవర్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఇందులో ప‌లు చెట్లు 25-30 అడుగుల వరకు పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం నిర్ధారిత ప్రాంతల‌‌లో మరిన్ని మొక్క‌లు నాటనున్నారు. నేడు ఈ అడవిలో 23 జాతుల మొక్కలు, 29 పక్షి జాతులు, 15 సీతాకోకచిలుక జాతులు, 10 సరీసృపాలు మరియు 3 క్షీరద జాతులు ఉన్నాయి. ఈ అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్ట్ పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడటమే కాకుండా, స్థానిక ప్ర‌జ‌ల‌కు మంచి నడక మార్గాన్ని  ఉదయం మరియు సాయంత్రం నడిచే వారికి ఒక ఆహ్లాద‌ర‌క‌ర‌మైన స్థలాన్ని అందిస్తుంది. దీంతో వాజ్రే అర్బన్ ఫారెస్ట్ ఇప్పుడు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో పర్యావరణ శాఖ స‌హాయ మంత్రి శ్రీ బ‌బూల్ సుప్రియో, మ‌హారా‌ష్ట్ర అట‌వీ శాఖ మంత్రి శ్రీ సంజ‌య్ రాథే, పర్యావరణ మంత్రిత్వ శాఖ కొత్త కార్యదర్శి శ్రీ ఆర్.పి. గుప్తా, కేంద్ర  
పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్య‌ద‌ర్శి, డీజీ ఫారెస్ట్స్ శ్రీ సంజయ్ కుమార్, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కంబాట్ డిస‌ర్ట్‌పైకేష‌న్‌ (యుఎన్‌సిసిడి) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఇబ్రహీం థియావాండ్, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (యుఎన్ఈపీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
శ్రీమతి ఇంగెర్ ఆండర్ అండర్సన్ త‌దిత‌రులు పాల్గొన‌నున్నారు. వ‌ర్చువ‌ల్ విధానంలో జ‌రిగే అ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖులు ఆన్‌లైన్ ద్వారా పాలుపంచుకుంటారు. ఈ కార్య‌క్ర‌మం https:// www.youtube.com/watch?v=IzMQuhmheoo ద్వారా ప్ర‌త్య‌క్షంగా ప్ర‌సారం కానుంది.


(Release ID: 1629449) Visitor Counter : 324