పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ఒపెక్ సెక్రటరీ జనరల్‌తో సంభాషించిన కేంద్రమంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
భారతదేశ ఇంధన భద్రత కోసం ఒపెక్ దేశాలతో సన్నిహిత సంబంధంపై చర్చ
అంతర్జాతీయ ఇంధన స్థిరత్వం సాధనకు బాధ్యతాయుత అడుగులపైనా చర్చ
प्रविष्टि तिथि:
04 JUN 2020 3:42PM by PIB Hyderabad
కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, "ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్" (ఒపెక్) సెక్రటరీ జనరల్ డా.మొహమ్మద్ బార్కిందోతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో ప్రస్తుత పరిస్థితులు, కొవిడ్ సవాళ్ల నడుమ ముడిచమురు ధరల తీరు, ఈ నెల తర్వాత జరగనున్న ఒపెక్ సమావేశాల గురించి చర్చించారు.
రాబోయే రోజుల్లో, ప్రపంచవ్యాప్తంగా సరళ ఆర్థిక పరిస్థితుల పునరుద్ధరణకు ఇంధన ఉత్పత్తి, వినియోగ దేశాలు బాధ్యతాయుత చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని మంత్రి ప్రధాన్ ప్రస్తావించారు. ఇంధన మార్కెట్ల స్థిరత్వంలో ఒపెక్ పాత్ర, భారతదేశ ఇంధన భద్రత కోసం ఒపెక్ దేశాలతో సన్నిహిత సంబంధం, ప్రస్తుత సవాళ్ల పరిస్థితుల్లో అంతర్జాతీయ ఇంధన స్థిరత్వం వంటి అంశాలపై మంత్రి మాట్లాడారు.
కరోనా వైరస్ నియంత్రణ, దేశంలో ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను బార్కిండో ప్రశంసించారు.
***
(रिलीज़ आईडी: 1629367)
आगंतुक पटल : 252