ప్రధాన మంత్రి కార్యాలయం

తుఫాను పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించిన - ప్రధానమంత్రి.

అవసరమైన అన్ని జాగ్రత్తలు, భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలను కోరారు.

प्रविष्टि तिथि: 02 JUN 2020 5:24PM by PIB Hyderabad

భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో కొన్ని ప్రాంతాల్లో తుఫాను నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ పరిస్థితిని  సమీక్షించారు.   అన్ని జాగ్రత్తలు, భద్రతా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రజలను కోరారు.

"భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న తుఫాను నేపథ్యంలో పరిస్థితిని తెలుసుకున్నాను.  ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాను.  సాధ్యమయ్యే అన్ని జాగ్రత్తలు, భద్రతా చర్యలు తీసుకోవలసిందిగా నేను ప్రజలను కోరుతున్నాను ", అని ప్రధానమంత్రి అన్నారు. 

 

*****


(रिलीज़ आईडी: 1628841) आगंतुक पटल : 184
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam