ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
తగిన సాంకేతిక పరిజ్ఞానం, ఎఫ్.డి.ఐలతో పాటు పెద్ద ఎత్తున పెట్టుబడులు, అసాధారణ రీతిలో మానవ వనరులతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతున్న ప్రధాన దేశం ఇండియా : కేంద్ర మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్
డిజిటల్ ఇండియా లేదా మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా ఇలా పరివర్తనతో కూడిన కార్యక్రమాలను ప్రభుత్వం ఎల్లప్పుడూ విశ్వసిస్తోంది.
Posted On:
02 JUN 2020 1:01PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం , పరివర్తనతో కూడిన కార్యక్రమాలపై ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచుతోంది. అది డిజిటల్ ఇండియాకావచ్చు లేదా స్టార్టప్ ఇండియా కావచ్చు పరివర్తనతో కూడిన కార్యక్రమాలను ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ కార్యక్రమాలు సామాన్య భారతీయులకు సాధికారత కల్పించాయి. అలాగే డిజిటల్ సమ్మిళితత్వం సాధించడానికి, నవకల్పనలు ప్రోత్సహించడానికి, ఎంటర్ ప్రెన్యుయర్‌షిప్‌కు దోహదపడి ఇండియాను అంతర్జాతీయ డిజిటల్ శక్తి గా ఎదిగేందుకు దోహదపడ్డాయి.
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కీలకమైనది. నేషనల్‌పాలసీ ఆన్ ఎలక్ట్రానిక్స్- 2019, సవరించిన ప్రత్యేక ప్రోత్సాహక పథకం(ఎం.ఎస్.ఐ.పి.ఎస్), ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లు, ఎలక్ట్రానిక్ డవలప్‌మెంట్ ఫండ్ వంటి చర్యలతో 2014 లో 29 బిలియన్ డాలర్లు గా ఉన్న భారతదేశ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు , 2019 నాటికి 70 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ప్రత్యేకించి మొబైల్ ఫోన్ తయారీ ఇదే కాలంలో గణనీయంగా పెరిగింది. 2014 నాటికి కేవలం రెండు మొబైల్ ఫోన్ తయారీ ఫ్యాక్టరీలు మాత్రమే దేశంలో ఉండగా, ఇండియా ప్రస్తుతం ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఉత్పత్తి దారుగా ఉంది. 2018-19లో మొబైల్ ఫోన్ హ్యాండ్‌సెట్‌లు 29 కోట్ల యూనిట్లకు చేరుకున్నాయి. వీటి విలువ 1.70 లక్షల కోట్ల రూపాయలు. 2014లో కేవలం 6 కోట్ల యూనిట్ల మొబైల్ హ్యాండ్‌సెట్‌లు రూ 19 ,000 కోట్ల రూపాయల విలువ గలవి మాత్రమే తయారయ్యాయి. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతుల విషయం చూస్తే, 2014-15 సంవత్సరంలో 38,263 కోట్ల రూపాయల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులఎగుమతులు జరగగా, 2018-19 సంవత్సరానికి అవి 61,908 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో భారతదేశ వాటా2014-15 సంవత్సరంలో రూ 38,263 కోట్ల రూపాయలు ఉండగా 2018-19లో అది 61,908 కోట్ల రూపాయలకు చేరుకుంది. 2012లో అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో భారత్ వాటా 1.3 శాతం మాత్రమే ఉండగా 2018 నాటికి అది 3 శాతానికి పెరిగింది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , స్వావలంబిత భారత్‌ను సాధించేందుకు ఆత్మ నిర్భర్ భారత్‌కు శంఖం పూరించారు. ఎలక్ట్రానిక్స్, ఐటి శాఖమంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్ తరచూ దీనిని గురించి వివరిస్తూ, ఆత్మనిర్భర భారత్ అంటే ఇండియా వేరుగా ఉండడం కాదని, తగిన సాంకేతిక పరిజ్ఞానం, ఎఫ్.డి.ఐలతో సహా పెట్టుబడులు, అసమాన మానవ వనరులతో చెప్పుకోదగిన రీతిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే విధంగా ప్రపంచంలోని ఒక ప్రధాన దేశంగా భారత్ ఉంటుందని చెప్పారు..
దేశంలో పెద్ద ఎత్తున తయారీ రంగ వాతావరణం ఏర్పాటు చేయడమంటే, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద ఆస్తికాగలదు. మనం వాల్యూ చెయిన్ దిశగా బలమైన వ్యవస్థ ఏర్పాటుకు చూస్తున్నాం. దీనిని ప్రపంచ వాల్యూ చెయిన్ తో అనుసంధానం చేయాలనుకుంటున్నాం. ఇది ప్రభుత్వం ప్రకటించిన మూడు పథకాల సారాంశంగా ఉంది. అవి, 1.భారీ తరహా ఎలక్ట్రానిక్ తయారీ రంగానికి ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహక పథకం (పి.ఎల్.ఐ), 2) ఎలక్ట్రానిక్ కాంపొనెంట్లు, సెమికండక్టర్ల తయారీకి ప్రోత్సాహక పథకం (ఎస్‌పిఇసిఎస్), 3) సవరించిన ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లు (ఇఎంఇసి 2.0) పథకం,
ఈ మూడు పథకాలకు కేటాయింపులు సుమారు రూ 50,000 కోట్లు( సుమారు యుఎస్‌డి 7 బిలియన్లు). ఈ పథకాలు దేశీయ ఎలక్ట్రానిక్ తయారీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడానికి తోడ్పడతాయి. అలాగే దేశీయంగా ఎలక్ట్రానిక్ తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి ఉపకరిస్తాయి. ఈ మూడు పథకాలు 1 ట్రిలియన్ డిజిట్ ఆర్థిక వ్యవస్థను సాధించడానికి , 2025 నాటికి 5 ట్రిలియన్ల అమెరికన్ డాలర్ల జిడిపి సాధించడానికి వీలు కల్పిస్తాయి.
ఈ మూడు కొత్త పథకాలు ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు మొబైల్ ఫోన్ల ఉత్పత్తి, వాటి విడిభాగాలు, కాంపొనెంట్ల తయారీని 2025 నాటికి సుమారు 10,00,000 కోట్ల రూపాయల మేరకు పెంచనున్నాయి. అలాగే వీటివల్ల 5 లక్షల ప్రత్యక్ష, 15 లక్షల పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి.
****
(Release ID: 1628821)
Visitor Counter : 345