ప్రధాన మంత్రి కార్యాలయం
రెండో సంవత్సరపు తొలి కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
ఎం.ఎస్.ఎం.ఇ రంగం, వీధివ్యాపారులు, రైతులకు సంబంధించి చరిత్రాత్మక నిర్ణయాలు
14 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఎం.ఎస్.ఎం.ఇ నిర్వచనానికి సవరణ
మధ్యతరహా యూనిట్ల నిర్వచనాన్ని రూ 50 కోట్ల పెట్టుబడి , రూ 250 కోట్ల టర్నోవర్‌కు పెంపు
వీధివ్యాపారులకు చౌక రుణాలు అందించేందుకు ప్రత్యేక సూక్ష్మ రుణ సదుపాయ పథకం 'పి.ఎం.ఎస్.వి.ఎ నిధి ప్రారంభం
ఖరీఫ్ సీజన్ 2020-21కి సంబంధించి పంట ఉత్పత్తి ఖర్చుకు 1.5 రెట్లు కనీస మద్దతు ధరను నిర్ణయించే హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది.
వ్యవసాయం,ఇతర అనుబంధ కార్యకలాపాలకు స్వల్పకాలిక రుణాల తిరిగిచెల్లింపు తేదీల పొడిగింపు.
వడ్డీపై రాయితీ ,సకాలంలో తిరిగి చెల్లించినందుకు లభించే ప్రోత్సాహక ప్రయోజనాన్ని పొందేందుకు రైతులకు అవకాశం
పేదల సంరక్షణపై ప్రభుత్వ ప్రధాన దృష్టి
Posted On:
01 JUN 2020 5:31PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ 2020 జూన్ 1 వ తేదీ సమావేశమైంది . ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం రెండవ సంవత్సరంలోకి అడుగిడిన అనంతరం జరిగిన తొలి కేబినెట్ సమావేశం ఇది. ఈ సమావేశం సందర్భంగా దేశంలోని కష్టజీవులైన రైతులు, ఎం.ఎస్.ఎం.ఇ రంగం, వీధి వ్యాపారులుగా పనిచేస్తున్నవారి జీవితాలలో గణనీయమైన ప్రభావం చూపే చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
ఎం.ఎస్.ఎం.ఇలకు చేయూత:
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ఎంటర్ ప్రైజ్‌లను ఎం.ఎస్.ఎం.ఇలు అంటారు ఇవి భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివి. దేశవ్యాప్తంగా ఇవి వివిధ రంగాలలో నిశ్శబ్దంగా తమదైన కృషి కొనసాగిస్తున్నాయి. 6 కోట్లకుపైగా ఎం.ఎస్.ఎం.ఇలు బలమైన స్వావలంబన కలిగిన భారత దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.
కోవిడ్ -19 మహమ్మారి అనంతరం, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ,దేశ నిర్మాణంలో ఎం.ఎస్.ఎం.ఇల పాత్రను గుర్తించడంలో వేగంగా స్పందించారు. అందుకే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ప్రభుత్వం చేసిన ప్రకటనలలో ఎం.ఎస్.ఎం.ఇలకు సంబంధించిన ప్రకటనలే కీలకంగా ఉన్నాయి.
ఈ ప్యాకేజ్ కింద , ఎం.ఎస్.ఎం.ఇ రంగానికి చెప్పుకోదగిన కేటాయింపులు చేయడమే కాక, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు చేపట్టాల్సిన చర్యల అమలు విషయంలో ఈ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. పలు కీలక ప్రకటనల అమలుకు ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయి.
ఈరోజు, భారత ప్రభుత్వం, ఆత్మనిర్భర భారత్ ప్యాకేజ్ కింద ఇతర ప్రకటనల సత్వర అమలుకు మార్గసూచీని రూపొందించిందికూడా. వీటిలో కింది అంశాలు ఉన్నాయి:
ఎం.ఎస్.ఎం.ఇ నిర్వచనం సవరింపు. సులభతర వాణిజ్యం దిశగా తీసుకున్న మరో చర్య . ఎం.ఎస్.ఎం.ఇ రంగంలో పెట్టుబడులు ఆకర్షించడానికి, మరిన్ని ఉద్యోగాల కల్పనకు ఇది అవకాశం కల్పిస్తుంది.
స్ట్రెస్‌డ్ ఎం.ఎస్.ఎం.ఇలకు ఈక్విటీ మద్దతు నిచ్చేందుకు సబార్డినేట్ రుణం కింద రూ 20,000 కోట్ల రూపాయల కేటాయింపు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. ఇది 2 లక్షల స్ట్రెస్‌డ్ ఎం.ఎస్.ఎం.ఇలకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ఫండ్ ఆఫ్ పండ్స్ ద్వారా ఎం.ఎస్.ఎం.ఇలకు రూ50,000 కోట్ల రూపాయల ఈక్విటీ సమకూర్చే ప్రతిపానలకు కూడా ఈరోజు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రుణ- ఈక్విటీ నిష్పత్తి నిర్వహణలో ఇది ఎం.ఎస్.ఎం.ఇలకు సహాయం చేసేందుకు ఒక ఫ్రేమ్ వర్క్‌ను ఏర్పరుస్తుంది. అలాగే వాటి సామర్థ్యాల పెంపుకు ఉపకరిస్తుంది. ఇది ఇవి స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్ట్ కావడానికి అవకాశం కల్పిస్తుంది.
ఎం.ఎస్.ఎం.ఇ నిర్వచనం పరిధి మరింత ఎగువకు సవరణ:
ఎం.ఎస్.ఎం.ఇ నిర్వచనానికి సంబంధించి మరింత అనుకూల సవరణ తెచ్చేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్యాకేజ్ ప్రకారం, సూక్ష్మ తయారీ, సర్వీసు యూనిట్లకు సంబంధించిన నిర్వచనాన్ని 1 కోటిరూపాయల పెట్టుబడికి, 5 కోట్ల రూపాయల టర్నోవరుకు పెంచింది.చిన్న యూనిట్ల పరిమితిని రూ 10 కోట్ల పెట్టుబడికి, రూ50 కోట్ల టర్నోవర్‌కు పెంచారు. అలాగే , మధ్యతరహా యూనిట్లకు పరిమితిని రూ 20 కోట్ల పెట్టుబడి, రూ 100 కోట్ల టర్నోవర్‌కు పెంచారు. 2006 లో ఎం.ఎస్.ఎం.ఇ అభివృద్ధి చట్టం అమలులోకి వచ్చిన తర్వాత 14 సంవత్సరాలకు ఈ రివిజన్ తీసుకువచ్చారు. 2020 మే 13న ప్యాకేజ్‌ప్రకటన వచ్చిన అనంతరం , ప్రకటించిన సవరణలు మార్కెట్, ధరల పరిస్థితులకు అనుగుణంగా లేవని, దీనిని మరింత ఎగువకు సవరించాలంటూ విజ్ఞప్తులు వచ్చాయి.ఈ విజ్ఞాపనలను దృష్టిలో ఉంచుకుని మధ్యతరహా తయారీ, సేవా యూనిట్లకు పరిమితిని మరింత ఎగువకు పెంచాలని ప్రధానమంత్రి నిర్ణయించారు. దీనితో ప్రస్తుతం ఇది రూ 50 కోట్ల పెట్టుబడి, 250 కోట్ల టర్నోవర్‌గా ఉంటుంది. ఎగుమతులకు సంబంధించిన టర్నోవర్‌ను ఎం.ఎస్.ఎం.ఇలకు చెందిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా యూనిట్ల విషయంలొ ఏమాత్రం పరిగణన లోకి తీసుకోరాదని నిర్ణయించారు.
కష్టపడి పనిచేస్తున్న మన వీధివ్యాపారులకు చేయూత:
గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రత్యేక మైక్రో- క్రెడిట్ ఫెసిలిటీ పథకం- పి.ఎం. ఎస్.వి.ఎ. నిధి, దీనినే పి.ఎం. స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అంటారు . వీధివ్యాపారులకు చౌక రుణాలు ఇచ్చేందుకు సంబంధించినది ఇది. వీధి వ్యాపారులు తిరిగి తమ పనులు ప్రారంభించడానికి, జీవనోపాధి పొందడానికి ఎంతో ఉపకరిస్తుంది.
50 లక్షల మందికి పైగా వెండర్లు హాకర్లు థాలీవాలాలు, రెహ్రివాలాలు. థెలిపడ్‌వాలాలు తదితరులు వివిధ ప్రాంతాలు వివిధ నేపథ్యాలలోని వారు ఈ పథకం కింద ప్రయోజనం పొందగలుగుతారు.
వీరు సరఫరా చేసే ఉత్పత్తులలో కూరగాయలు, పండ్లు, వెంటనే తినడానికి పనికి వచ్చే ఆహార పదార్థాలు, టీ, పకోడా, బ్రెడ్, గుడ్లు, టెక్స్‌టైల్. దుస్తులు, ఫుట్‌వేర్, హస్తకళాఉత్పత్తులు, పుస్తకాలు, స్టేషనరీ తదితరాలు ఉన్నాయి. ఈ సేవలలో బార్బర్‌షాపులు , చెప్పులు కుట్టే దుకాణాలు, పాన్ షాపులు, ల్యాండ్రీ సేవలు తదితరాలు ఉన్నాయి.
కోవిడ్ -19 సంక్షోభం సందర్భంగా ఈ వర్గాల వారు ఎదుర్కొన్న సమస్యల పట్ల భారత ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఇలాంటి పరిస్థితులలో వీరికి తమ వ్యాపారాలకు ఊతం ఇచ్చే విధంగా అందుబాటులో రుణ సదుపాయాన్ని కల్పించాల్సిన అత్యవసరం ఉంది.
ఈ పథకం అమలులో పట్టణ స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి.
ఈ పథకం ఎన్నోకారణాల రీత్యా ఇది ప్రత్యేకమైనది:
1. చరిత్రాత్మకంగా మొదటిది :
భారతదేశ చరిత్రలో ఒక పట్టణ జీవనోపాధి కార్యక్రమంలో పట్టణ పరిసర , గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వీధివ్యాపారులను లబ్ధిదారులుగా చేర్చడం ఇదే ప్రథమం..
వీధివ్యాపారులు, రూ10,000 వరకు వర్కింగ్ కేపిటల్ లోన్‌ను ఉపయోగించుకోవచ్చు. దీనిని ఏడాదిలో నెలవారీ వాయిదాల రూపంలో తిరిగి చెల్లించవచ్చు.సకాలంలో, లేదా ముందుగా రుణాన్ని తిరిగి చెల్లిస్తే వడ్డీపై 7 శాతం వార్షిక సబ్సిడీని లబ్దిదారు బ్యాంకు ఖాతాకు ప్రత్యక్ష నగదు బదలీ విధానం ద్వారా ఆరునెలల ప్రాతిపదికన జమచేస్తారు. ముందుగా తిరిగి చెల్లించే రుణంపై ఎలాంటి పెనాల్టీ ఉండదు.
సకాలంలో చెల్లించిన, ముందుగానే రుణం తిరిగి చెల్లంచిన వెండర్‌కు రుణ పరిమితిని పెంచే వెసులుబాటు వల్ల వెండర్ ఆర్థిక నిచ్చెనపై పైకి ఎదుగుతూ తన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు.
ఎం.ఎప్.ఐలు, ఎన్.బి.ఎఫ్.సిలు , ఎస్‌హెచ్‌జి బ్యాంకులను గ్రామీణ పేదలకు నిర్దేశించిన పథకానికి తొలిసారిగా అనుతించారు. వీధివ్యాపారులు, పట్టణ పేదలకు వీరి సేవలు దగ్గరగా అందుబాటులో ఉన్నందువల్ల వీటిని అనుమతించారు.
2. సాధికారతకు సాంకేతిక పరిజ్ఞాన వినియోగం:
కేంద్ర ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా , సమర్దమైన సేవల అందుబాటు , పారదర్శకతకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడానికి వీలుగా ఒక డిజిటల్ ప్లాట్‌ఫాం, వెబ్ పోర్టల్, మొబైల్‌యాప్ ను అభివృద్ధి చేస్తారు. ఎండ్ టు ఎండ్‌సొల్యూషన్ తో పథకం నిర్వహణకుదీనిని ఉపయోగిస్తారు.ఈ ఐటి ప్లాట్‌ఫాం వెండర్లను ఫార్మల్ ఫైనాన్షియల్ వ్యవస్థతో అనుసంధానం చేయడానికి ఉపకరిస్తుంది. ఈ ప్లాట్‌ఫాం వెబ్ పోర్టల్, మొబైల్‌యాప్‌ను క్రెడిట్ మేనేజ్‌మెంట్‌కు ఎస్.ఐ.డి.బి.ఐ కి చెందిన ఉద్యమి మిత్రా పోర్టల్తో అనుసంధానం చేస్తారు. అలాగే వడ్డీ సబ్సిడీ నిర్వహణకు కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన పోర్టల్ పి.ఎ.ఐ.ఎస్.ఎతో అనుసంధానం చేస్తారు.
3. డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం.
ఈ పథకం డిజిటల్ లావాదేవీలకు వీధి వ్యాపారులను నెలవారీ క్యాష్‌బ్యాక్ ద్వారా ప్రోత్సహిస్తుంది.
ఈ పథకం వీధి విక్రేతలు నెలవారీ క్యాష్ బ్యాక్ ద్వారా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తుంది.
4- సామర్ధ్యాల నిర్మాణంపై దృష్టి:
మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్, అర్బన్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వాల కొలాబరేషన్‌తో , రాష్ట్ర మిషన్ లైన డి.ఎ.వై- ఎన్‌యుఎల్ఎం, యుఎల్‌బిలు, ఎస్ఐడిబిఐ, సిజిటిఎంఎస్ఇ, ఎన్‌పిసిలు, డిజిటల్ పేమెంట్ అగ్రిగేటర్లతో కలసి సామర్థ్యాల నిర్మాణం,స్టేక్ హోల్డర్లందరికి ఉపయోగపడే ఫైనాన్షియల్ లిటరసీ కార్యక్రమాలు, ఐఇసి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం జూన్ నెలలో చేపడతారు. రుణాలు అందజేయడం జూలై నెలలో ప్రారంభమౌతుంది.
జైకిసాన్ స్ఫూర్తి కి ప్రేరణ:
2020-21 ఖరీఫ్ సీజన్‌కు ఉత్పత్తి ఖర్చుకు1.5 రెట్లు కనీస మద్దతు ధర ను నిర్ణయిస్తామన్న హామీని ప్రభుత్వం నెరవేర్చింది. 2020-21 ఖరఫ్ సీజన్‌కు సంబంధించి 14 పంటల కనీస మద్ధతు ధరను సిఎసిపి సిఫార్సుల ప్రకారం ప్రకటించడం జరిగింది. ఈ 14 పంటలకు అయిన ఖర్చుపైన రాబడి 50 శాతం నుంచి 83 శాతం వరకూ ఉంటుంది.
వ్యవసాయం , ఇతర అనుబంధ కార్యకలాపాల కోసం బ్యాంకులు అడ్వాన్స్ గా ఇచ్చిన 3 లక్షల రూపాయల వరకు అన్ని స్వల్పకాలిక రుణాలకు తిరిగి చెల్లించే తేదీని 31.08.2020 వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు వడ్డీ రాయితీ, సత్వరం రుణం తిరిగి చెల్లించినందుకు ఇచ్చే ప్రోత్సాహకం కూడా వారికి లభిస్తుంది.
మార్చి 1, 2020 నుండి 31 ఆగస్టు 2020 మధ్య చెల్లించాల్సిన వ్యవసాయ స్వల్పకాలిక రుణంపై 2 శాతం వడ్డీ రాయితీ (ఐఎస్) , సకాలంలో రుణం తిరిగి చెల్లించినందుకు రైతులకు ఇచ్చే3శాతం ప్రోత్సాహకం (పిఆర్‌ఐ) లను పొందడానికి వీరికి వీలుంటుంది.
.ఇలాంటి రుణాలను రైతులకు సంవత్సరానికి 7 శాతం వార్షిక వడ్డీతో అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 2 శాతం వడ్డీ రాయితీని బ్యాంకులకు, 3 శాతం అదనపు ప్రోత్సాహకాన్ని రైతులు సకాలంలో తిరిగి చెల్లించినందుకు ఇస్తారు. దీనితో రైతులు 3 లక్షల రూపాయల వరకు రుణాన్ని 4 శాతం వడ్డీతో పొందినట్టు అవుతుంది.
రాయితీపై స్వల్పకాలిక పంట రుణాలను ఇవ్వడానికి వడ్డీ రాయితీ పథకం ( ఐఎస్ఎస్) ప్రారంభమైంది. రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు కింద తీసుకున్న రుణాలకూ ఇది వర్తిస్తుంది.గడచిన కొన్ని వారాలలో చాలామంది రైతులు , తమ స్వల్పకాలిక రుణాల బకాయిలను తిరిగి చెల్లించేందుకు బ్యాంకు శాఖలకు వెళ్లలేకపోయారు. అందువల్ల కేబినెట్ తీసుకున్న నిర్ణయం కోట్లాదిమంది రైతులకు ఉపయోగపడుతుంది.
పేదల సంరక్షణపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి:
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వ ప్రాధాన్యతలలో పేదలు , అణగారిన వర్గాల వారు అత్యున్నత స్థాయిలో ఉన్నారు. కరోనావైరస్ మహమ్మారి సమయంలో, లాక్‌డౌన్ ప్రకటించిన రోజు నుండే, పేద పేద ప్రజల అవసరాలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది. . లాక్‌డౌన్ ప్రారంభమైన రెండు రోజుల్లోనే, అంటే మార్చి 26, 2020 న ప్రధాన మంత్రి ప్రకటించిన గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజీ లో ఇది కనిపించింది. 80 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రతకు పూచీపడడంతోపాటు 20 కోట్ల మంది మహిళలు, వయోధికులు, పేద వితంతువులు , పేద దివ్యాంగుల బ్యాంకు ఖాతాలలో ప్రత్యక్షనగదు బదలీ పథకం కింద నేరుగా నగదు బదిలీ చేయడం , కోట్లాది మంది రైతుల పి.ఎం కిసాన్ ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లింపు వంటి చర్యల ను ప్రకటించారు. వివిధ వర్గాల అణగారిన ప్రజలకు ప్రభత్వం వీటిని వెంటనే వర్తింప చేసింది. లేకుంటే వారు లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొని ఉండే వారు. అంతేకాదు, ఇవి కేవలం ప్రకటనలు మాత్రమే కాదు, ప్రభుత్వం ప్రకటించిన సహాయం, కొద్ది రోజులలోనేకోట్లాది మంది ప్రజలకు నేరుగా నగదు లేదా సహాయం రూపంలో వారికి అందింది.
ఆత్మ నిర్భర భారత్ చొరవ కింద, ఒక దేశం- ఒక రేషన్ కార్డు పథకం, రేషన్ కార్డు లేని వారికి సైతం ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, పేదల కోసం కొత్త చౌక అద్దె పథకం, ఇంకా ఎన్నో ఇతర చర్యలను వలస కార్మికుల కోసం ప్రకటించడం జరిగింది.
రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున సంస్కరణలను ప్రభుత్వం ప్రకటించింది. రైతుల ఆదాయాన్ని చెప్పుకోదగిన రీతిలో పెంచే నిర్ణయాలు ప్రకటించారు.దీనికితోడు వ్యవసాయ మౌలిక సదుపాయాల రంగంలో మరిన్ని పెట్టుబడులు ప్రతిపాదించస్థితిలోఉన్న వర్గాల ప్రజల అవసరాలను తీర్చడంలో ప్రతి దశలోనూ భారత ప్రభుత్వం ఎంతో వేగంగా స్పందించడంతో పాటు వారిపట్ల కరుణతో వ్యవహరించింది.
(Release ID: 1628501)
Visitor Counter : 418
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam