రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

కేంద్ర కెమికల్స్‌, పెట్రో కెమికల్స్‌ విభాగం కార్యదర్శిగా ఆర్‌.కె.చతుర్వేది బాధ్యతలు

प्रविष्टि तिथि: 01 JUN 2020 3:57PM by PIB Hyderabad

శ్రీ ఆర్‌.కె.చతుర్వేది, 1987 బ్యాచ్‌కు చెందిన మధ్యప్రదేశ్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి. 'కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ'కు చెందిన కెమికల్స్‌, పెట్రో కెమికల్స్‌ విభాగం కార్యదర్శిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతలకు ముందు.., కేంద్ర సాంస్కృతిక శాఖ అదనపు కార్యదర్శిగా, ఆర్థిక సలహాదారుగా ఆయన సేవలు అందించారు. సీబీఎస్‌ఈ ఛైర్మన్‌గా, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌డీఏ) డైరెక్టర్‌ జనరల్‌గానూ పని చేశారు. 

    మే 31, 2020న ఉద్యోగ విరమణ చేసిన శ్రీ పి.రాఘవేంద్రరావు స్థానంలో కెమికల్స్‌, పెట్రో కెమికల్స్‌ విభాగం కార్యదర్శిగా శ్రీ చదుర్వేది నియమితులయ్యారు.


(रिलीज़ आईडी: 1628378) आगंतुक पटल : 233
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Punjabi , Odia , Tamil