మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత ఆరు సంవత్సరాలుగా చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాలను వివరిస్తూ ఇన్ఫోగ్రాఫిక్స్ విడుదల
Posted On:
31 MAY 2020 5:05PM by PIB Hyderabad
మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. తను గత ఆరు సంవత్సరాల కాలంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలు, సాధించిన పలు విజయాలను గురించి వివరిస్తూ హిందీ మరియు ఇంగ్లీషు భాషల్లో అయిదు ఇన్ఫోగ్రాఫిక్‌లను విడుదల చేసింది. సామాజిక మాద్యమాలకు సరిపోయేలా వీటిని శాఖ రూపొందించింది. దేశంలోని మైనారిటీల సంక్షేమం కోసం చేపట్టిన దాదాపు అన్ని పథకాలను కవర్ చేసే విధంగా ఐదు విస్తృత అంశాలు/ విషయాలను వివరిస్తూ వీటిని రూపొందించారు.
- నైపుణ్య అభివృద్ధి, ఉపాధి & ఉపాధి అవకాశాలు;
- హూనార్ హాట్ --- మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ శిల్పకారులకు, చెఫ్‌కు అవకాశాలు;
- ప్రధాన్ మంత్రి జన్ వికాస్ కార్యాక్రమ్ (పీఎంజేవీకే) --- దేశ వ్యాప్తంగా మైనారిటీ కేంద్రీకృత ప్రాంతాల్లో సామాజిక- ఆర్థిక - విద్య మరియు ఉపాధి ఆధారితమైన మౌలిక సదుపాయాలపై దృష్టి సారించడం;
- విద్య సాధికారత; మరియు
-వక్ఫ్ ఆస్తుల సద్వినియోగం ---- దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల డిజిటలైజేషన్ మరియు జియో ట్యాగింగ్ ద్వారా వాటిని సమాజ సంక్షేమానికి వినియోగపడేలా చూడడం.
సులువుగా అర్థం చేసుకోవడానికి వీలుగా పిక్టోరియల్స్, ఛాయాచిత్రాలు మరియు వచనం ద్వారా సందేశాన్ని అందించడానికి అనుకూలంగా ఆయా ఇన్ఫోగ్రాఫిక్స్ రూపొందించబడ్డాయి.
(ఇంగ్లీషులో ఇన్ఫోగ్రాఫిక్స్ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి)
(హిందీలో ఇన్ఫోగ్రాఫిక్స్ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి)
****
(Release ID: 1628186)
Visitor Counter : 238