శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 నిమిత్తం 'రాపిడ్ రెస్పాన్స్ రెగ్యులేటరీ'ని అందుబాటులోకి తెచ్చిన బయోటెక్నాలజీ శాఖ‌

Posted On: 30 MAY 2020 2:57PM by PIB Hyderabad

 

బయో సేఫ్టీ రెగ్యులేషన్‌ను క్రమబద్ధీకరించడానికి మరియు రీకాంబినెంట్ డీఎన్ఏ టెక్నాలజీ మరియు ప్రమాదకర సూక్ష్మజీవులపై పరిశోధనలు మరియు అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కార్య‌క‌లాపాల‌లో నిమ‌గ్న‌మైన పరిశోధకులు మరియు పరిశ్రమల వారికి త‌గిన  తోడ్పాటు అందించేలా బ‌యోటెక్నాల‌జీ శాఖ అనేక చురుకైన చర్యలు చేప‌ట్టింది.
 
1. 'ఇండియ‌న్ బ‌యోసేఫ్టీ నాలెడ్జ్ పోర్ట‌ల్' ‌ను పూర్తిస్థాయిలో కార్యాచ‌ర‌ణ‌లోకిః  మే, 2019 లో ప్రారంభించిన 'ఇండియ‌న్ బ‌యోసేఫ్టీ నాలెడ్జ్ పోర్ట‌ల్' తాజాగా పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. దీంతో ఈ విభాగం ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే కొత్త దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ చ‌ర్య‌ మొత్తం ప్రక్రియలో పారదర్శక‌త‌ను పెంచ‌డంతో పాటుగా మరియు ఆయా ప‌నులను నిర్ణీత కాలంలో చేప‌ట్టేలా చేసింది.
2. ఆర్‌అండ్‌డీ ప్రయోజనం కోసం జీఈ జీవుల దిగుమతి, ఎగుమతి మరియు మార్పిడి మరియు వాటి ఉత్పత్తిపై సవర‌ణ‌ల‌తో సరళీకృత మార్గదర్శకాల నోటిఫికేషన్: ఈ ఏడాది (2020) జ‌న‌వ‌రి మాసంలో బ‌యోటెక్నాల‌జీ డిపార్ట్‌మెంట్ జీఈ జీవుల దిగుమ‌తులు, ఎగుమ‌తి మ‌రియు మార్పిడికి సంబంధించి స‌వ‌రించిన  మార్గ‌ద‌ర్శకాల‌ను జారీ చేసింది. వీటి ప్ర‌కారంగా ఆర్‌జీ1 మ‌రియు ఆర్‌జీ2 ఐట‌మ్స్‌ను ప‌రిశోధ‌న మ‌రియు అభివృద్ధి నిమిత్తం దిగుమతి ఎగుమతి మరియు జీఈ జీవుల మార్పిడి మరియు ఉత్పత్తి యొక్క అనువర్తనాలపై నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని సంస్థాగత జీవ భద్రత కమిటీకి అప్పగించారు.
3. కోవిడ్ -19పై పరిశోధన మరియు అభివృద్ధికి త‌గిన విధంగా వీలు క‌ల్పించుటః కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్ర‌స్తుత కఠిన పరిస్థితుల నేప‌థ్యంలో బ‌యోటెక్నాల‌జీ శాఖ ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ప్ర‌స్తుత క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ఈ వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసి నివారించేందుకు గాను ప‌రిశోధ‌న మ‌రియు అభివృద్ధి అవ‌శ్య‌క‌త‌ను గుర్తించిన సంస్థ ఈ దిశ‌గా ప‌లు క్రియాశీల‌క నిర్ణ‌యాల‌ను తీసుకుంది. కోవిడ్‌-19 ప‌రిశోధ‌న‌ల్లో నిమ‌గ్న‌మై ఉన్న ప‌రిశోధ‌కులు మ‌రియు ప‌రిశ్ర‌మ‌ల వారికి త‌గిన విధంగా తోడ్పాటును అందించేలా వివిధ తోడ్పాటు చ‌ర్య‌ల‌ను ఈ శాఖ‌ తీసుకుంటోంది.  కోవిడ్-19కు సంబంధించిన టీకాలు, డయాగ్నస్టిక్స్, ప్రొఫిలాక్టిక్స్ మరియు థెరప్యూటిక్స్ అభివృద్ధికి సంబంధించిన దరఖాస్తుల పరిష్కరించడానికి గాను బ‌యోటెక్నాల‌జీ శాఖ‌
'రాపిడ్ రెస్పాన్స్ రెగ్యులేటరీ' ఫ్రేమ్‌వర్క్ 20.03.2020 ను నోటిఫై చేసింది. కోవిడ్ -19 కి సంబంధించిన చ‌ర్య‌ల విష‌య‌మై 08.04.2020 న తేదీని బ‌యోటెక్నాల‌జీ శాఖ “కోవిడ్‌-19 నమూనాలను నిర్వహించే విష‌య‌మై ప్రయోగశాల జీవ భద్రతపై తాత్కాలిక మార్గదర్శక పత్రం” ను నోటిఫై చేసింది. ఐబీఎస్‌సీలు 30 జూన్, 2020 వరకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తమ సమావేశాల్ని నిర్వహించడానికి అనుమతించారు. కోవిడ్ -19కు రీకాంబినెంట్  డీఎన్ఏ వ్యాక్సిన్  అభివృద్ధికి గాను డీబీటీ రాపిడ్ రెస్పాన్స్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ 26.05.2020 న జారీ చేసింది.


(Release ID: 1627943) Visitor Counter : 277